విలన్ అవతారం ఎత్తిన యాంకర్ ఉదయభాను, స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..?
వెండితెరపై స్పేస్ కోసం గట్టిగా ప్రయత్నిస్తుంది యాంకర్ ఉదయభాను. స్టార్ యాంకర్ గా, నటిగా ప్రతిభచూపి.. ఆతరువాత గ్యాప్ తీసుకున్న ఆమె.. ఈసారి సినిమాల్లో డిఫరెంట్ పాత్రలకు సై అంటోంది.
తెలుగులో స్టార్ యాంకర్ అంటే ఒకప్పుడు ఉదయ భాను మాత్రమే కనిపించేది. ఆమెకనిపిస్తే చాలు కుర్ర కారు ఉర్రూతలూగేవారు. అప్పట్లోనే హాట్ హాట్ గా డ్రెస్ లు వేస్తూ.. స్పైసీ స్పైసీ గా మాట్లాడుతూ.. కుర్రాళ్లను కట్టిపడేసేది. ప్రతీ షోను ను తన ఇమేజ్ తో సక్సెస్ చేసేది ఉదయ భాను. ఇప్పుడంటే మనం స్టార్ యాంకర్ గా సుమను ఆకాశానికి ఎత్తుతున్నాం కాని.. ఒకప్పుడు బుల్లి తెరను ఏలియన యాంకర్ మహారాణి ఉదయభాను మాత్రమే.
అప్పటి వరకూ ఎవరూ చేయలేని.. ఇప్పటి వరకూ ఎవరూ చేయని పని ఉదయ భాను చేసింది. స్మాల్ స్క్రీన్ కు గ్లామర్ షో అద్దిన ఉదయ భాను కోసమే షోలను ఆడియన్స్ ప్రత్యేకంగా చూసేవారు అంటే.. ఆమె ఎంత పాపులారిటీ సంపాధించుకుందో తెలుస్తుంది. ఉదయభాను సక్సెస్ ఫుల్ గా షోలు చేసేప్పుడు యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా సైట్లు పెద్దగా యాక్టీవ్ గా లేవు.. ఉండి ఉంటే.. ఆమె ఇప్పటికీ లైమ్ లైన్ లోనే ఉండేవారేమో..
udaya bhanu
ఉదయభాను అంటే నిన్నటి తరం బుల్లితెర ప్రేమికులకు బాగా తెలిసిన పేరు. ఒకప్పుడు యాంకరింగ్‌కు మరో మీనింగ్ లా ఉండేది బ్యూటీ.. కాని ఆమె జీవితంలో అనుకోని ఇబ్బందులు.. కష్టాలు.. కెరీర్ కు బ్రేక్ ఇచ్చేలా చేశాయి. అంతే కాదు.. పెళ్లి చేసుకున్న తరువాత టీవీ ప్రేక్షకులకు దూరమయ్యారు. ఇక చాలా ఏళ్ళ తరువత మళ్ళీ ఈ మధ్య నుంచే స్క్రీన్ పై స్పేస్ కోసం గట్టిగా ప్రయత్నిస్తుంది సీనియర్ బ్యూటీ.
ఈమధ్య సినిమాల్లో స్సెషల్ సాంగ్స్ లో కనిపించింది ఉదయ భాను. గతంలో లీడర్, జులాయ్ సినిమాల్లో కూడా సాంగ్స్ చేసింది. అయితే యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేయడానికి ముందే ఉదయభాను కొన్నిసినిమాల్లో నటించింది.
ఆర్.నారాయణ మూర్తి తెరకెక్కించిన ఎర్ర సైన్యం సినిమాతో ఉదయ భాను కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఇక ఈమధ్య సినిమాలకోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తున్న ఉదయ భాను.. రీసెంట్ గా వచ్చిన ప్రతినిథి 2 లో ఓ ముఖ్య పాత్రలో కనిపించింది. కాని ఈసినిమా ప్లాప్ అయ్యింది.
ఇక ఇప్పుడిప్పుడే చిన్న సినిమాల్లో మంచి పాత్రలను పొందుతుంది ఉదయ భాను. తాజాగా విలన్ అవతారం ఎత్తింది. బార్బరిక్ అనే సినిమాలో ఈమె కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉదయభాను విలన్ రోల్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకి మారుతి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు.
ఈ సినిమాలో ఉదయభాను యాక్టింగ్ తో మరోసారి మళ్ళీ బిజీ అవుతుందేమో చూడాలి. అయితే ఉదయభానుకి ఓ స్టార్ హీరో సినిమాలో పవర్ ఫుల్ లేడీ విలన్ గా అవకాశం వచ్చింది అని టాక్ గట్టిగా వనిపిస్తుంది. అయితే ఆ స్టార్ హీరో ఎవరు అనే విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. నాని, సాయి ధరమ్ తేజ్ సినిమాల్లో నటిస్తుందంటూ రూమర్ వినిపిస్తుంది. మరి అందులో నిజం ఎంతో చూడాలి.