'జబర్దస్త్‌' కు గెటప్ శ్రీను దూరం.. కారణం ఇదే?

First Published 22, Sep 2019, 1:51 PM

జబర్దస్త్ షో కు మూల స్దంబాల్లో ఒకడు గెటప్ శ్రీను. సుడిగాలి సుధీర్ టీమ్‌లో ఒకడైన గెటప్ శీనుకు మంచి డిమాండ్ ఉంది. అతను వేషే గెటప్ లతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

జబర్దస్త్ షో కు మూల స్దంబాల్లో ఒకడు గెటప్ శ్రీను. సుడిగాలి సుధీర్ టీమ్‌లో ఒకడైన గెటప్ శీనుకు మంచి డిమాండ్ ఉంది. అతను వేషే గెటప్ లతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. రీసెంట్ గా బిల్డప్ బాబాయ్ స్కిట్ యూట్యూబ్‌లో సూపర్ హిట్ అయ్యింది. దాంతో అతని స్కిట్ లకు విపరీతమైన ప్రేక్షకాదరణ పెరిగింది. ఎన్నారై అసోసియేషన్స్ అమెరికా, లండన్ వంటి దేశాల్లో గెటప్ శీనుతో షోలను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ షోల కోసం గెటప్ శీను భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇలా జబర్దస్త్ తో ఓ రేంజిలో బిజీ అయిన గెటప్ శ్రీను గత కొద్ది కాలంగా జబర్దస్త్ లో రెగ్యులర్ గా కనిపించటం లేదు. ఓ వారం కనపడితే మరో రెండు వారాలు మాయమైపోతున్నాడు. అందుకు కారణం ఏమిటనేది ఆయన అభిమానుల్లో చర్చగా మారింది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అలా మిస్సవటానికి కారణం గెటప్ శ్రీను హీరో కావడమే. వరసపెట్టి జబర్దస్త్ షో కమెడియన్లు అంతా ఒక్కొక్కరుగా హీరోలు అవుతున్నారు. ఇప్పటికే షకలక శంకర్, రంగస్థలం మహేష్, చమ్మక్ చంద్ర, ధన్‌రాజ్, సుడిగాలి సుధీర్ లాంటి వాళ్లంతా హీరోలయ్యారు. వాళ్లు క్లిక్ అవుతున్నారా లేదా అనేది పక్కనబెడితే హీరోలైతే అవుతున్నారు.

ఇప్పుడు అదే వరసలో గెటప్ శ్రీను కూడా ఇలాగే హీరో అయ్యాడు. డబ్ స్మాష్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు గెటప్ శ్రీను. రీసెంట్ గా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.

ఈ సినిమాతో పాటు మరిన్ని సినిమాల్లో కమెడియన్‌గా కూడా నటిస్తున్నాడు. మరోవైపు సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్‌తో కలిసి 3 మంకీస్ అనే సినిమా చేస్తున్నాడు ఈయన.  గెటప్ శ్రీను ఈ హీరోల రేసులో ఎంతవరకూ సక్సెస్ అవుతాడో చూడాలి.

loader