డియర్ సమంత ఎక్కడున్నావ్.. ఎదురు చూస్తున్న ఫ్యాన్స్.. ఇంతకీ ఏం చేస్తోంది?
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తన అభిమానులకు ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. ఎప్పుడూ నెట్టింట సందడి చేసే ఈ బ్యూటీ.. నెలరోజులుగా ఫ్యాన్స్ కు టచ్ లో లేకపోవడంతో చిన్నబోతున్నారు. ‘డియర్ సాయ్ ఎక్కడున్నారు’ అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఇండియన్ యాక్ట్రెస్ గా, స్టార్ హీరోయిన్ సమంతకు ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చైతూతో విడాకులు తీసుకున్న తర్వాత ఈ బ్యూటీ తన కేరీర్ లో మరింత బిజీ అవుతోంది. ఏమాత్రం సమయం దొరికినా పలు కమర్షియల్ యాడ్ షూట్లలోనూ నటిస్తూ తన అభిమానులను అలరిస్తోంది.
ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టడంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే సామ్ అటు సినిమాలతోనే కాకుండా ఇటు సోషల్ మీడియాలో తన అభిమానులకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలు, సినిమా విశేషాలు, పలు కమర్షియల్ యాడ్స్ ను వారితో పంచుకుంటూ ఉంటుంది.
బాలీవుడ్ వైపు మొగ్గుచూపుతున్నసమంత ఎంత బిజీగా ఉన్నా తన అభిమానులతో ఏదో రకంగా టచ్ లోనే ఉంటూ వస్తోంది. తన డివోర్స్ సమయంలోనూ ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా ఏదోక పోస్ట్ పెడుతూ వచ్చింది. మొన్నటి వరకు ఇన్ స్టా గ్రామ్ క్రేజీ ఫొటోషూట్లతో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ గత నెల రోజులు సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటోంది.
ఒక్కసారిగా సమంత సోషల్ మీడియాలో కనిపించడం మానడంతో అభిమానులు హార్ట్ అవుతున్నారు. దీంతో ‘డియర్ సామ్ మేడమ్ ఎక్కడున్నావ్’,‘వి మిస్ యూ’ అంటూ పోస్టులు పెడుతున్నారు. నెట్టింటికి పునఃదర్శనం ఇవ్వాలని కోరుతున్నారు. పలువురు అభిమానులు అయితే వందల పోస్టులతో సమంతను రెక్వెస్ట్ చేస్తూ.. ఆమె స్పందన కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే, ‘ఫ్యామిలీ మెన్’ తర్వాత సమంతకు బాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ పెరిగింది. అలాగే తెలుగు చిత్రం ‘పుష్ఫ : ది రైజ్’ చిత్రంలో ‘ఊ అంటావా మావా’ ఐటెం సాంగ్ లో నటించిన ఇండియాను షేక్ చేసింది. అందాల విందు చేసి ఆడియెన్స్ ను ఉర్రూతలూగించింది. దీంతో బాలీవుడ్ నుంచి సమంతకు వరుస ఆఫర్లు వస్తున్నాయి.
ఈ క్రమంలో సమంత తన సైన్ చేసిన ప్రాజెక్టులకు ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తోంది. ఇప్పటికే ‘యశోద’, ‘శాకుంతలం’ చిత్రాల షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan)తో కలిసి ‘ఫ్యామిలీ మెన్’ దర్శకుడి డైరెక్షన్ లో నటిస్తోంది. పలు యాక్షన్ సీన్లలో నటిస్తుండటంతో షూటింగ్ పైనే ఫోకస్ పెట్టింది.
బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ షెడ్యూల్స్ వస్తుండటంతో రెస్ట్ లెస్ గా ఈ బ్యూటీ షూటింగ్స్ లో పాల్గొంటోంది. యాక్షన్ సీన్స్ లో నటించాల్సి రావడంతో అందుకు తగిన వర్క్ అవుట్స్ తో బిజీగా ఉంటోంది. దీంతో అభిమానులకు, సోషల్ మీడియాకు కాస్తా దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. తర్వలోనే ఈ బ్యూటీ వరుస చిత్రాలతో తన ఫ్యాన్స్ ను వెండితెరపై అలరించనుంది.