- Home
- Entertainment
- Shriya Saran: ఈ ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం ఉందా? వాళ్ళు చెప్పినరోజు నేను కూడా సమాధానం చెబుతాను!
Shriya Saran: ఈ ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం ఉందా? వాళ్ళు చెప్పినరోజు నేను కూడా సమాధానం చెబుతాను!
హీరోయిన్ శ్రియ శరన్ ఫస్ట్ టైం ఒక విషయంలో తన అసహనం బయటపెట్టారు. తన అందం గురించి విలేకరి చేసిన కామెంట్ ఆమెకు కోపం తెప్పించింది.

Shriya Saran
శ్రియ శరన్ చాలా సౌమ్యురాలు. ఆమె సహనం కోల్పోయి ఆగ్రహం కనబరిచిన సందర్భాలు లేవు. విషయం ఏదైనా పెద్దగా సీరియస్ గా తీసుకోరు. తనపై వచ్చే కామెంట్స్ ని పట్టించుకోరు. ఓ సందర్భంలో మాత్రం ఆమె ఆగ్రహానికి గురయ్యారు. ఏకంగా హీరోలను టార్గెట్ చేస్తూ పరుష వ్యాఖ్యలు చేశారు.
Shriya Saran
పెళ్లయ్యాక కూడా మీరు ఇంత అందంగా ఉండటానికి కారణం ఏంటని? జర్నలిస్ట్ అడిగారు. అందుకు సమాధానంగా శ్రియ ఇలా అన్నారు... హీరోయిన్స్ ని మాత్రమే ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు? హీరోలను అడిగే ధైర్యం మీకు ఉందా? అని ఎదురు ప్రశ్నించారు.
నా ఫ్రెండ్స్ అందం విషయంలో నన్ను మెచ్చుకుంటూ ఉంటారు. పెళ్ళై పిల్లలను కన్నాక కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు గ్రేట్ అని కొనియాడుతారు. ఇక్కడ అందం ఒక్కటే ముఖ్యం కాదు. వయసు? పరిశ్రమకు వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? వంటి విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇదే ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం మీకు లేదు. వాళ్ళను అడిగిన రోజున నేను సమాధానం చెబుతాను... అని శ్రియ కుండబద్దలు కొట్టారు.
Shriya Saran
శ్రియ కామెంట్స్ సంచలనం రేపాయి. 2018లో శ్రియా-ఆండ్రూ వివాహం నిరాడంబరంగా జరిగింది. బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇక పిల్లల్ని ఆమె రహస్యంగానే కన్నారు. లాక్ డౌన్ సమయంలో గర్భం దాల్చిన శ్రియా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. కూతురు పేరు రాధ.
Shriya Saran
ఈ విషయం చాలా కాలం తర్వాత శ్రియ ఫ్యాన్స్ తో పంచుకున్నారు. శ్రియా తల్లయ్యిందన్న ఆ వార్త అందరికీ పెద్ద ఝలక్ ఇచ్చింది. కొన్ని అవమానాలకు భయపడి తల్లైన విషయం దాచినట్లు శ్రియ అనంతరం వెల్లడించారు. తాను బాడీ షేమింగ్ కి గురవుతానేమో అన్న ఆందోళనతో చెప్పలేదన్నారు.
కాగా ఇష్టం మూవీతో శ్రియ వెండితెరకు పరిచయమైంది. సంతోషం, చెన్నకేశవరెడ్డి, నువ్వే నువ్వే... వంటి వరుస హిట్స్ తో ఆమె స్టార్ అయ్యారు. దశాబ్దానికి పైగా శ్రియ నార్త్ టు సౌత్ అన్ని పరిశ్రమల్లో సత్తా చాటారు. తెలుగులో రెండు జనరేషన్స్ స్టార్స్ తో నటించిన ఘనత ఆమె సొంతం. చిరు, బాలయ్య, నాగ్, వెంకీలతో పాటు మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ లతో ఆమె జతకట్టారు.