MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఏఎన్నార్ కి జీవితంలో అతిపెద్ద అవమానం.. అందుకు కారణమైన వ్యక్తిని స్టార్ హీరో అయ్యాక ఏమన్నాడో తెలుసా?

ఏఎన్నార్ కి జీవితంలో అతిపెద్ద అవమానం.. అందుకు కారణమైన వ్యక్తిని స్టార్ హీరో అయ్యాక ఏమన్నాడో తెలుసా?

లెజెండరీ నటుడు ఏఎన్నార్ కి కూడా అవమానాలు తప్పలేదట. భోజనం చేయడానికి వెళుతున్న ఏఎన్నార్ ని మేనేజర్ తీవ్రంగా అవమానించాడట. చిన్నబుచ్చుకుని ఏఎన్నార్ అక్కడ నుండి వెళ్ళిపోయాడట. స్టార్ అయ్యాక ఏఎన్నార్ ఆ వ్యక్తిని ఏం చేశాడంటే..   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jul 08 2024, 10:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Akkineni Nageswararao

Akkineni Nageswararao

పెద్దగా చదువుకోని నాగేశ్వరరావుకు నాటకాలంటే పిచ్చి. ఆ మక్కువే చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేసేలా చేసింది. 1944లో విడుదలైన శ్రీ సీతారామ జననం మూవీతో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా పరిచయం అయ్యారు. బాలరాజు, కీలుగుఱ్ఱం, దేవదాసు, మిస్సమ్మ చిత్రాలతో ఆయన స్టార్ గా ఎదిగారు. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఎన్టీఆర్-ఏఎన్నార్ సమకాలీన నటులు తెలుగు చిత్ర పరిశ్రమను దశాబ్దాల పాటు ఏలారు. అయితే కెరీర్ బిగినింగ్ లో ఏఎన్నార్ కి కూడా అవమానాలు తప్పలేదట. తనకు జరిగిన ఓ అవమానాన్ని ఏఎన్నార్ గతంలో తెలియజేశారు. ఏఎన్నార్ ని భోజనం విషయంలో ఓ వ్యక్తి తీవ్రంగా అవమానించాడట. 

37

1946లో విడుదలైన ముగ్గురు మరాఠీ లు చిత్రంలో ఏఎన్నార్ నటించారు. ఏఎన్నార్ కి అది మూడో చిత్రం. ఆయనకు ఎలాంటి ఫేమ్ లేదు. ముగ్గురు మరాఠీ లు చిత్రానికి ఘంటసాల బలరామయ్య దర్శకుడు. ఏఎన్నార్ మొదటి చిత్రం దర్శకుడు కూడా ఆయనే. 

 

47

మధ్యాహ్నం మేకప్ రూమ్ లో కన్నాంబతో పాటు మరికొందరు నటులు, ప్రముఖులు భోజనం చేస్తున్నారట. ఏఎన్నార్ కూడా భోజనం చేద్దామని లోపలి వెళ్లబోయాడట. ముగ్గురు మరాఠీలు చిత్రానికి మేనేజర్ గా ఉన్న సూర్యనారాయణ అనే వ్యక్తి ఏఎన్నార్ ని అడ్డగించాడట. పెద్దవాళ్ళు భోజనం చేస్తుంటే నువ్వు ఎక్కడికి? నువ్వేమైనా స్టార్ అనుకుంటున్నావా? క్యాంటీన్ కి వెళ్లి తిను, అని గట్టిగా కసిరాడట. 
 

57

అవమానభారంతో ఏఎన్నార్ అక్కడ నుండి వెళ్ళిపోయాడట. క్యాంటీన్ లో భోజనం చేశాడట. 1967లో ప్రాణమిత్రులు షూటింగ్ జరుగుతుందట. ఆ చిత్రానికి దర్శకుడు పి.పుల్లయ్య. నిర్మాత వి. వెంకటేశ్వర్లు. అయితే సూర్యనారాయణ అన్నీ దగ్గరుండి చూసుకునేవారట. సూర్యనారాయణతో పుల్లయ్య.. ఏఎన్నార్ మేకప్ వేసుకోవడం పూర్తి అయితే రమ్మను షాట్ రెడీ అని చెప్పాడట. 

67

ఏఎన్నార్ కి చెప్పేందుకు సూర్యనారాయణ మేకప్ రూమ్ కి వెళ్ళాడట. అప్పుడు ఏఎన్నార్... నువ్వు ముగ్గురు మరాఠీ లు చిత్రానికి మేనేజర్ గా పని చేశావు కదా? నాకు తెలుసు. ఇంకా గుర్తుంది. ఆ రోజు నువ్వు భోజనం దగ్గర నన్ను కసిరి అవమానించావు, అన్నాడట. ఏదో తప్పైపోయింది క్షమించండి అని సూర్యనారాయణ అన్నాడట. అప్పుడు నువ్వు నాకు చేసిన అవమానానికి నిన్ను చెడామడా తిడతానని అనుకోకు, అని ఏఎన్నార్ అన్నారట. 

 

77

నీ తప్పేమీ లేదు. నీ బాధ్యత నువ్వు నెరవేర్చావు. అప్పుడు నిజంగా నేను ఎవరినీ? స్టార్ హీరోని కాదు కదా? నువ్వు అలా అనడం భావ్యమే. కన్నాంబ గారు పెద్ద నటులు. ఆమెకు ఇచ్చే గౌరవ మర్యాదలు వేరుగా ఉంటాయి. అంతటి గౌరవం నాకు ఎలా ఇస్తార్లెండి. కానీ బాధ కలిగింది గనుక ఆ అవమానం మర్చిపోలేదు. అందుకే అడిగాను... అన్నారట. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Crazy Kalyanam Movie Review: క్రేజీ కళ్యాణం మూవీ రివ్యూ, అనుపమా పరమేశ్వరన్‌ సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Bigg Boss 10: తనకి తానే చెంపదెబ్బలు కొట్టుకుని ఏడ్చేసిన వంశీ..ఇక నీ ముఖం కూడా చూడను, షాలినిపై రోహిత్ ఫైర్
Recommended image3
Sunil: లాయర్లుగా రఫ్ఫాడించబోతున్న సునీల్, క్రేజీ హీరోయిన్.. మరో విలక్షణ పాత్రలో ఛాన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved