MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విజయ్ ‘The Goat’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) తెలుగులో అంత దారుణమా?

విజయ్ ‘The Goat’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) తెలుగులో అంత దారుణమా?

విజయ్  రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడంతో ఇదే విజయ్ లాస్ట్ సినిమా అని ప్రచారం జరగడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

2 Min read
Author : Surya Prakash
Published : Sep 06 2024, 08:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
The GOAT opening advance collection report out

The GOAT opening advance collection report out

తమిళ్ స్టార్ హీరో విజయ్ ‘The Goat’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే సినిమాతో నిన్న గురువారం( సెప్టెంబర్ 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కింది.

స్నేహ, మీనాక్షి చౌదరి, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, అజ్మీర్, జయరాం.. ఇలా పలువురు స్టార్స్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటించడం, విజయ్  రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడంతో ఇదే విజయ్ లాస్ట్ సినిమా అని ప్రచారం జరగడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తెలుగులో ఆ ఇంపాక్ట్ ఏమీ లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
The GOAT advance sale collection report out

The GOAT advance sale collection report out

తమిళంలో ఈ సినిమా అదిరిపోయే  టాక్ ను సొంతం చేసుకోగా మిగిలిన చోట్ల యావరేజ్, జస్ట్ ఓకే  అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.  ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా సినిమా అన్ని చోట్లా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంది.

తెలుగు లో మరీ లియో రేంజ్ లో అయితే బుకింగ్స్ లేవు కానీ…ఉన్నంతలో విజయ్ వారసుడు మూవీ రేంజ్ లో బుకింగ్స్  అయ్యాయి. మార్నింగ్ షోకు యావరేజ్ అనుకున్న టాక్, ఈవినింగ్ కు నెగిటివ్ గా మారింది.

35
The GOAT total advance ticket sale report out

The GOAT total advance ticket sale report out

తెలుగు లో ఓపినింగ్స్ ప్రక్కన పెడితే  అడ్వాన్స్ బుక్కింగ్ లు బాగా పూర్ గా ఉన్నాయి, మొదటి రోజు కలెక్షన్స్ దాదాపు 5 కోట్లు వరకూ వచ్చి ఉంటాయని అంచనా. తెలుగులో గోట్ థియేటర్ రైట్స్   22 కోట్లు దాకా అమ్ముడయ్యాయి. అంటే రికవరీ అయ్యి, హిట్ అనిపించుకోవాలంటే గ్రాస్   40 కోట్లు దాకా రావాలి.

45
The GOAT pre sale collection at overseas

The GOAT pre sale collection at overseas

ఇప్పుడున్న  కరెంట్ ట్రెండ్ ని బట్టి తెలుగులో బ్రేక్ ఈవెన్ రావటం కష్టమే అంటున్నారు. సినిమా ఆన్ లైన్ బుక్కింగ్స్, ఈవినింగ్,నైట్ షోలు నిన్న  చాలా పూర్ గా ఉండటం డిస్ట్రిబ్యూటర్స్ ని భయపెట్టే అంశమే.

సాధారణంగా విజయ్ సినిమాలకు లియోకు తప్పించి మిగతావాటికి హిట్ టాక్ వచ్చాకే పికప్ అయ్యాయి. ఈ సారి హిట్ టాక్ స్ప్రెడ్ కాకపోవటం, ఓ ప్రక్కన వరదలు, భారీ వర్షాలు కూడా సినిమా కలెక్షన్స్ కు అడ్డంకిగా మారాయి.

55
The GOAT Vijay film first title revealed

The GOAT Vijay film first title revealed

తెలుగు వారు చెప్పే మైనస్ లు విషయానికి వస్తే..

సినిమా లెంగ్త్ 3 గంటలు కావడంతో చాలా చోట్ల సినిమా సాగదీసినట్టు అనిపిస్తూంటుంది. దానికి తోడు రెగ్యులర్ కథే కావడం, ట్విస్ట్ లు ముందే ఊహించడం మైనస్ గా మారింది.అలాగే తండ్రి కొడుకులు హీరో – విలన్ గా కొట్టుకోవడం చూసి బోలెడన్ని పాత సినిమాలు గుర్తుకు వస్తాయి.

కొన్ని సీన్స్ తప్పితే విజయ్ ని ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో డీ ఏజింగ్ చేసి  నడిపేసారు. క్లైమాక్స్ ఓ పక్క క్రికెట్, ఓ పక్క యాక్షన్ సీన్స్ కంపారిజాన్ చేస్తూ చూపించిన విధానం మాత్రం బాగుంటుంది.  సినిమాలో క్రికెట్ ఫ్యాన్స్ కి ముఖ్యంగా ధోని ఫ్యాన్స్ కి మాత్రం మంచి ఫీస్ట్ ఉంది 
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నన్ను ఎలిమినేట్ చేసేయండి.. ఆడియన్స్ కు సుధీర్ రిక్వెస్ట్.. ముకేష్, అమన్ లతో గొడవ..
Recommended image2
Priyanka Jain: ముఖేష్‌ లేకుండా ఊపిరి కూడా తీసుకోలేవు, సెన్స్ లేదు.. వర్షిణికి ప్రియాంక జైన్‌ మాస్‌ వార్నింగ్‌
Recommended image3
Jailer 2 Box Office: పుష్ప 2 కలెక్షన్స్ బ్రేక్ చేసిన జైలర్ 2.. రజనీకాంత్‌ దెబ్బకి అక్కడ బాక్సాఫీస్‌ షేక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved