MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • `వార్ 2` మూవీ ఫస్ట్ రివ్యూ.. ఎన్టీఆర్‌, హృతిక్‌ నటించిన సినిమాలో కళ్ళు తిప్పుకోలేని ఎలిమెంట్‌ ఏంటంటే?

`వార్ 2` మూవీ ఫస్ట్ రివ్యూ.. ఎన్టీఆర్‌, హృతిక్‌ నటించిన సినిమాలో కళ్ళు తిప్పుకోలేని ఎలిమెంట్‌ ఏంటంటే?

ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ కలిసి నటించిన `వార్‌ 2` సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సినిమా సింపుల్‌గా బ్లాక్‌ బస్టర్‌ అని తేలిపోయింది. హైలైట్స్ ఏంటో కూడా లీక్‌ అయ్యాయి. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 12 2025, 07:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భారీ మల్టీస్టారర్‌గా వస్తోన్న `వార్‌ 2`
Image Credit : instagram/Yrf

భారీ మల్టీస్టారర్‌గా వస్తోన్న `వార్‌ 2`

ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ నటించిన సినిమా `వార్‌ 2`. హృతిక్‌ రోషన్‌ మరో హీరోగా నటించిన ఈ భారీ మల్టీస్టారర్‌ చిత్రానికి బాలీవుడ్‌లో స్పై యాక్షన్‌ మూవీస్‌కి కేరాఫ్‌గా నిలిచిన అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించారు. యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ మరో రెండు రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. హిందీ, తెలుగుతోపాటు పాన్‌ ఇండియా తరహాలో రిలీజ్‌ చేస్తున్నారు.

DID YOU
KNOW
?
హృతిక్‌కి అభిమాని
ఎన్టీఆర్‌ బెస్ట్ డాన్సర్‌. కానీ ఆయన హృతిక్‌ రోషన్‌ డాన్సులకు అభిమాని. ఈ విషయంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ఇటీవల `వార్‌ 2` ఈవెంట్‌లోనూ ఆ విషయాన్ని ప్రస్తావించారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రెండు కాలర్స్ ఎగరేసి సినిమాపై హైప్‌ పెంచిన ఎన్టీఆర్‌
Image Credit : Instagram/YRF

రెండు కాలర్స్ ఎగరేసి సినిమాపై హైప్‌ పెంచిన ఎన్టీఆర్‌

మొన్నటి వరకు మూవీపై పెద్దగా అంచనాలు లేవు. టీజర్‌, ట్రైలర్‌ పెద్దగా ఆకట్టుకునేలా అనిపించలేదు. బాలీవుడ్‌ సినిమాలు మనకు పెద్దగా ఎక్కవు. కొన్ని సినిమాలే ఆకట్టుకుంటాయి. పైగా ఇలాంటి స్పై యాక్షన్‌ మూవీస్‌పై  మన తెలుగు ఆడియెన్స్ పెద్దగా ఆసక్తి చూపరు. కానీ ఎన్టీఆర్‌ ఉండటంతో దీనికి క్రేజ్‌ పెరిగింది. ట్రైలర్‌, టీజర్‌లో రెగ్యూలర్‌ కంటెంట్‌ కనిపించడంతో హైప్‌ రాలేదు. కానీ ఇటీవల హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌తో సినిమాపై హైప్‌ పెంచారు తారక్‌. ఆయన రెండు కాలర్స్ ఎగరేసి చెప్పారు బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ అని. ఎన్టీఆర్‌ నుంచి ఇలాంటి కామెంట్‌ చాలా అరుదు. బాగుంటేనే చెబుతారు. ఆయన చెప్పారంటే బాగున్నట్టే. దీంతో `వార్‌ 2`కి బజ్‌ క్రియేట్‌ అవుతుంది.

Related Articles

Related image1
కూలీ, వార్ 2 టికెట్ రేట్లపై ఫ్యాన్స్ ఫైర్, డబ్బింగ్ సినిమాలను వదలరా అంటున్న అభిమానులు
Related image2
హీరోయిన్‌తో ప్రభాస్‌ మ్యారేజ్‌.. పెద్దమ్మ రియాక్షన్‌ ఇదే.. ఆయన చేతుల్లోనే డార్లింగ్‌ పెళ్లి
34
`వార్‌ 2` ఫస్ట్ రివ్యూ
Image Credit : Yash Raj Films

`వార్‌ 2` ఫస్ట్ రివ్యూ

ఈ క్రమంలో తాజాగా `వార్‌ 2` సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చింది. ఓవర్సీస్‌ క్రిటిక్‌గా చెప్పుకునే ఉమైర్‌ సందు సోషల్‌ మీడియా ద్వారా ఈ మూవీ ఎలా ఉండబోతుందో తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా బ్లాక్‌ బస్టర్‌ అని వెల్లడించారు. ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ ల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని, యాక్షన్‌ సీన్లు సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయన్నారు. అలాగే ఈ ఇద్దరు కలిసి చేసే డాన్స్ వాహ్‌ అనిపిస్తుందని, కళ్లు తిప్పుకోవడం కష్టమే అని తెలిపారు. పాటలోనే కాదు, నటన పరంగానూ ఇద్దరూ ఆడియెన్స్ చూపు తిప్పుకోనివ్వరు అని వెల్లడించారు. కియారా అద్వానీ కేవలం గ్లామర్‌ పరంగానే ఆకట్టుకుందని తెలిపారు.

44
బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌ పాగా వేయడం పక్కా
Image Credit : Youtube/Sithara Entertainment

బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌ పాగా వేయడం పక్కా

ఇక ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ అదిరిపోయిందన్నారు ఉమైర్‌ సందు. తారక్‌ కళ్లు చాలా పవర్‌ఫుల్‌ అని, కళ్లతోనే యాక్ట్ చేశాడని తెలిపారు. ఇంకోవైపు ఈ చిత్రంతో బాలీవుడ్‌లో ఆయన పాగా వేయడం పక్కా అని, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ బాగా పెరిగిపోతుందని చెప్పారు. సినిమాకి విజువల్స్ బాగున్నాయని, అంతిమంగా బొమ్మ సూపర్‌ షాట్‌ హిట్‌ అని స్పష్టం చేశారు. దీంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. బేసిక్‌గా ఉమైర్‌ సందు వివాదాస్పద అంశాలతో రచ్చ చేస్తుంటారు. నెగటివ్‌ రివ్యూస్‌ పెట్టేవారు. కానీ ఇప్పుడు చాలా వరకు రియాలిటీకి దగ్గరగా ఉండే రివ్యూలు పెడుతున్నాడు. దీంతో ఆయనపై పాజిటివిటీ పెరిగింది. `వార్‌ 2` విషయంలోనూ ఆయన చెప్పింది నమ్ముతున్నారు. మరి ఆయన చెప్పినట్టుగానే మూవీ బ్లాక్‌ బస్టర్‌ అవుతుందా? అనేది మరో రెండు రోజుల్లో తేలనుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Related Stories
Recommended image1
కూలీ, వార్ 2 టికెట్ రేట్లపై ఫ్యాన్స్ ఫైర్, డబ్బింగ్ సినిమాలను వదలరా అంటున్న అభిమానులు
Recommended image2
హీరోయిన్‌తో ప్రభాస్‌ మ్యారేజ్‌.. పెద్దమ్మ రియాక్షన్‌ ఇదే.. ఆయన చేతుల్లోనే డార్లింగ్‌ పెళ్లి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved