Waltair Veerayya First Review: `వాల్తేర్ వీరయ్య` ఫస్ట్ రివ్యూ.. రేటింగ్ అదిరింది..
మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కలిసి నటించిన `వాల్తేర్ వీరయ్య` మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో యూఎస్ క్రిటిక్ రివ్యూ బయటకు వచ్చింది. మెగాఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ వచ్చింది.
చిరంజీవి హీరోగా రూపొందిన `వాల్తేర్ వీరయ్య` ఈ నెల 13న విడుదల కాబోతుంది. ఇందులో రవితేజ కీలక పాత్రలో నటించగా, శృతి హాసర్, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటించారు. బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతుంది. మెగా ఫ్యాన్స్ కి మరో పండగని తీసుకురాబోతుంది.
అయితే సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ట్రైలర్ అదిరిపోయవడంతో ఫ్యాన్స్ ఖుషిగా ఉన్నారు. `ఆచార్య`, `గాడ్ ఫాదర్` విషయాల్లో ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో సంతృప్తి చెందలేదు. కమర్షియల్‌గానూ మెగాస్టార్ రేంజ్‌ని చూపించలేకపోయాయి. ఈ నేపథ్యంలో `వాల్తేర్ వీరయ్య` సక్సెస్ చిరంజీవికి కీలకంగా మారింది. కలెక్షన్ల పరంగా ఇది చాలా కీలకంగా మారింది. మరి సినిమా ఆ స్థాయిలో ఉందా? అనేది చూస్తే..
తాజాగా మెగాఫ్యాన్స్ సంబరాలు చేసుకునే వార్త చెప్పారు ఓవర్సీస్ క్రిటిక్, సెన్సార్ సభ్యుడు. ఉమైర్ సందు అనే ఓవర్సీస్ సెన్సార్ మెంబర్ సినిమా చూశాక అలా ఎలా ఉందో ట్విట్టర్ ద్వారా పోస్ట్ లు పెడుతుంటారనే విషయం తెలిసిందే. తాజాగా చిరంజీవి `వాల్తేర్ వీరయ్య` మూవీ అప్‌డేట్ కూడా ఇచ్చారు. ఆయన ట్వీట్ చేస్తూ అదిరిపోయే ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు.
Waltair Veerayya
ఆయన చెప్పినదాని ప్రకారం.. చిరంజీవికిది బెస్ట్ కమ్ బ్యాక్ అవుతుందన్నారు. `సైరా` నుంచి ఆశించిన స్థాయిలో ఆయన సినిమాలు ఆడలేని నేపథ్యంలో ఇది అదిరిపోయే కమ్ బ్యాక్ అవుతుందని ఉమైర్ సందు తెలిపారు. కమర్షియల్‌గా బాగా ఆడుతుందన్నారు. గత చిత్రాలతో పోల్చితే ఇందులో కంటెంట్ చాలా బాగుందట. చిరంజీవి, రవితేజల కాంబినేషన్ దుమ్ములేపేలా ఉంటుందట. వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు నెక్ట్స్ లెవల్‌లో ఉంటాయని, అందరి హృదయాలను దోచుకునేలా ఉంటాయన్నారు.
సినిమా కథ పరంగా చూస్తే ఇది మాస్ మసాలా మూవీనే అని, మంచి కథ ఉంటుందని, సంగీతం హైలైట్ అవుతుందని, మెగా ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించేలా ఉంటాయన్నారు. ఇక ఈ చిత్రానికి 3 రేటింగ్ ఇవ్వడం విశేషం. మాస్ కమర్షియల్ యాక్షన్ మూవీకి 3 రేటింగ్ అంటే మామూలు కాదు, పైగా చిరంజీవి లాంటి సినిమాకి, సంక్రాంతికి వచ్చే మూవీకి ఈ స్థాయిలో రేటింగ్ ఉంటే సినిమా దుమ్ములేపడం ఖాయమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ క్రిటిక్ చెప్పినవన్నీ నిజం కావాలని లేదు. చాలా వరకు రిజల్ట్ తేడా కొట్టాయి. కొడుతున్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందనేది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. కానీ ఉమైర్ సందు ఇచ్చిన రివ్యూకి మాత్రం మెగాఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.