- Home
- Entertainment
- తన భర్త పుట్టినరోజు.. 6 అడుగుల మెమొరబుల్ గిఫ్ట్ ఇచ్చిన వీజే మహాలక్ష్మి, ప్రేమంటే ఇదే కదా.. ఫొటోస్
తన భర్త పుట్టినరోజు.. 6 అడుగుల మెమొరబుల్ గిఫ్ట్ ఇచ్చిన వీజే మహాలక్ష్మి, ప్రేమంటే ఇదే కదా.. ఫొటోస్
ప్రముఖ బుల్లితెర నటి వీజే మహాలక్ష్మి, నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి పెళ్లి జరిగినప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.

ప్రముఖ బుల్లితెర నటి వీజే మహాలక్ష్మి, నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి పెళ్లి జరిగినప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. చాలా మంది సెటైర్లు వేశారు. మహాలక్ష్మి, రవీందర్ ఇద్దరిపై జోకులు వేశారు. అయినా కూడా ఈ జంట భార్య భర్తలుగా వైవాహిక జీవితంలో ముందుకెళుతున్నారు.
ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలు పంచుకుంటూ ట్రోల్ చేసిన వారికి చెంపపెట్టులా సమాధానం ఇస్తున్నారు. కాగా ఆదివారం రోజు రవీందర్ జన్మదిన వేడుకలు జరిగాయి. దీనితో మహాలక్ష్మి తన భర్త పుట్టినరోజుని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసింది. రవీందర్ కుటుంబ సభ్యులతో కలసి కేక్ కట్ చేశారు.
ఇక మహాలక్ష్మి తన భర్త పుట్టినరోజుకి గుర్తుండిపోయేలా మెమొరబుల్ గిఫ్ట్ ఇచ్చింది. మహాలక్ష్మి ఇచ్చిన 6 అడుగుల గిఫ్ట్ కి రవీందర్ థ్రిల్ అయ్యారు. 6 అడుగుల ఫోటో ఫ్రేమ్ ని మహాలక్ష్మి స్వయంగా చేయించి రవీందర్ కి ప్రజెంట్ చేసింది. ఈ ఫోటో ఫ్రేమ్ లో రవీందర్ సూట్ లో స్టైలిష్ గా ఉన్నారు. ఈ గిఫ్ట్ ఇచ్చిన తన భార్యకి కృతజ్ఞతలు తెలిపాడు.
ఇక మహాలక్ష్మి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. నా వెనుక ఉండి నా లో మళ్ళీ ధైర్యాన్ని నింపిన మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటూ వీజే మహాలక్ష్మి పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా రవీందర్ కి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
గత ఏడాది సెప్టెంబర్ లో రవీందర్, మహాలక్ష్మి తిరుపతిలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఇద్దరికీ ఇది రెండవ వివాహమే. రవీందర్ అధిక బరువు ఉండడంతో ఇద్దరిపై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. మహాలక్ష్మి అతడిని కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటోంది అంటూ విమర్శలు చేశారు.
దీనికి తోడు రవీందర్ నిర్మించే చిత్రాల్లో మహాలక్ష్మి నటిగా చేస్తోంది. దీనితో రవీందర్ ని వాడుకోవడానే అతడిని వివాహం చేసుకుంది అంటూ మహాలక్ష్మిపై ట్రోలింగ్ జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం వీరిద్దరి మధ్య ప్రేమ చూసి నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.