MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • విశ్వక్‌ సేన్‌ `పాగల్‌` మూవీ రివ్వూ..

విశ్వక్‌ సేన్‌ `పాగల్‌` మూవీ రివ్వూ..

`ఫలక్‌నూమా దాస్‌`, `హిట్‌` చిత్రాలతో సెన్సేషనల్‌ హీరోగా టాలీవుడ్‌లో తనకంటూ ఓ సెపరేట్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్న విశ్వక్‌ సేన్‌ ప్రస్తుతం `పాగల్‌` సినిమాతో రాబోతున్నారు. విడుదలకు ముందే ఆయన పంచుకున్న నోట్ వైరల్‌ అవుతుంది. మరి సినిమా ఎలా ఉందో చూస్తే..  

3 Min read
Author : Aithagoni Raju
| Updated : Aug 14 2021, 12:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

విశ్వక్‌సేన్‌.. సొంతంగా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ఓ ఫ్లాట్‌ఫామ్‌ని క్రియేట్‌ చేసుకున్న హీరో. `వెళ్లిపోమాకే`, `ఈ నగరానికి ఏమైంది` చిత్రాలతో మెరిసినా, సొంతంగా హీరోగా నటిస్తూ, దర్శకత్వంలో నిర్మించిన `ఫలక్‌నూమా దాస్‌` తో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. తనదైన స్టయిల్‌ ప్రమోషన్స్ తో హాట్‌ టాపిక్‌గా మారాడు. ఆ తర్వాత నాని నిర్మించిన `హిట్‌` చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు `పాగల్‌` సినిమాతో వస్తున్నాడు. నరేష్‌ కుప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నివేతా పేతురాజ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. దిల్‌రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్‌ నిర్మించారు. నేడు(ఆగస్ట్ 14)న శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. మరి దీని రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

సినిమా కథ ః ప్రేమ్‌(విశ్వక్‌ సేన్‌) తన ఏడేళ్లప్పుడే అమ్మ(భూమిక)ని కోల్పోతాడు. చిన్నప్పుడే అమ్మ ప్రేమకి దూరమైన ప్రేమ్‌కి ఆ ప్రేమని పొందాలంటే అమ్మాయి వల్లే సాధ్యమని తన స్నేహితుడు సలహా ఇస్తాడు. అమ్మలా చూసుకునే అమ్మాయిని ప్రేమించమని చెబుతాడు. దీంతో అమ్మాయిలను ప్రేమలో పడేయడమే తన పనిగా పెట్టుకుంటాడు ప్రేమ్‌. ఇలా దాదాపు 1600 మంది అమ్మాయిలకు తన లవ్‌ ప్రపోజ్‌ చేస్తాడు. కానీ అందరు ఆయన్ని తిరస్కరిస్తారు. చివరికి తీర(నివేతా పేతురాజ్‌)ని చూసి ప్రేమలో పడతాడు. కానీ ఆమెకి అప్పటికే ఎంగేజ్‌మెంట్‌ అవుతుంది. పైగా ప్రేమ్‌ లవ్‌ని తిరస్కరిస్తుంది.  దీంతో ఫ్రస్టేట్‌ అయిన ప్రేమ చివరికి ఆత్మహత్య కూడా ప్రయత్నిస్తాడు. మరి దాన్నుంచి ఎలా బయటపడ్డాడు, తన ప్రేమని తీరా ఒప్పుకుందా? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ.  
 

38

విశ్లేషణః విశ్వక్‌ సేన్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేయడంలో తడబడిందనే చెప్పాలి. నూతన దర్శకుడు నరేష్‌ సినిమా మొత్తం ఒక చమత్కారమైన కామెడీపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అయితే అందులోనూ చాలా విషయాల్లో లాజిక్‌లు మిస్‌ అయ్యాయి. తొలుత మదర్‌ సెంటిమెంట్‌లోనూ కామెడీకి ప్రయత్నించాడు. ఈ క్రమంలో మదర్‌-సన్‌ సెంటిమెంట్‌లో ఎమోషన్స్ మిస్‌ అయ్యింది. అవి బోరింగ్‌ మారిపోయాయి. 

48

సెంటిమెంట్‌ సీన్లలోనూ అతిగా కామెడీకి పండించే ప్రయత్నం చేయగా అది బెడిసికొట్టినట్టుగా అనిపిస్తుంది. కామెడీ నుంచి, ఎమోషన్‌కి కథ టర్న్ తీసుకునే సమయంలో పర్‌ఫెక్ట్ గా దాన్ని మౌల్డ్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడని చెప్పాలి. అమ్మాయిలకు తన లవ్‌ ప్రపోజ్‌ చేయడానికి ప్రేమ్‌ వైజాగ్‌ వెళ్లడం, తిరిగి హైదరాబాద్‌ రావడం వంటి సన్నివేశాలు, సీనియర్‌ రాజకీయ నాయకులతో గే లవ్‌ వంటి సన్నివేశాలు ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించేలా ఉన్నాయి. 
 

58

మొదటి భాగంలో `గూగుల్‌ గూగుల్‌..`, `ఈ సింపుల్ చిన్నోడు ` పాటలు పర్వాలేదనిపిస్తాయి. ఇంటర్వెల్ తర్వాత కథ మరింత బోరింగా మారుతుంది. హీరోయిన్‌ నివేతా పేతురాజ్‌ పాత్ర సన్నివేశాలు చాలా తక్కువ. హీరోహీరోయిన్ల మధ్య లవ్‌ ట్రాక్ కూడా కొద్ది సేపే ఉంటుంది. ఆ లవ్‌ ట్రాక్‌ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత సెకండాఫ్‌ మొత్తం గందరగోళంగా తయారయ్యింది. దీంతో సినిమా ట్రాక్‌ తప్పినట్టయ్యింది. 

68

నటన పరంగా చూస్తూ, ప్రేమ్‌ పాత్రలో విశ్వక్‌ సేన్‌ పర్‌ఫెక్ట్ గా సూట్‌ అయ్యారు. ఆయనకిది టైలర్‌ మేడ్‌ రోల్‌ అని చెప్పొచ్చు. నివేతా ఉన్న కొద్ది సేపే అయినా తనవంతుగా ఆకట్టుకుంది. హీరోహీరోయిన్ల మధ్య సన్నివేశాలు ఇంకాస్త పెంచితే బాగుండేది. కీలక పాత్రధారులు మురళీశర్మ హీరోయిన్‌ డాడీగా మెప్పించారు. రాహుల్‌ రామకృష్ణ, నరేష్‌ ఓకే అనిపించారు. ఇంకా మరే పాత్రలు ఇంపాక్ట్ ని చూపించలేకపోయాయి.

78

హైలైట్స్ ః ఫస్ట్ ఆఫ్‌ ఎంటర్టైన్‌మెంట్స్, మేకింగ్‌, మ్యూజిక్‌, బీజీఎం. 
డ్రా బ్యాక్స్ ః సెకండాఫ్‌, గందరగోళం సృష్టించే సన్నివేశాలు, ట్విస్ట్ లు. 
 

88

ఫైనల్‌గాః `పాగల్‌` రిజల్ట్ పై హీరో విశ్వక్‌ సేన్‌కి ముందే ఓ క్లారిటీ ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే రిలీజ్‌కి  ముందే శుక్రవారం రాత్రి ఆయనో నోట్‌ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. `సినిమా బాగుంటే ఆదరించండి, బాగా లేకపోతే తప్పులు చెప్పండి, అంతేకానీ ఎదురుదాడి చేయకండి` అని పేర్కొన్నాడు. ఇదే సినిమా ఎలా ఉండబోతుందో తెలిపారు. విశ్వక్‌ సేన్‌ నటన, రెండు పాటలు, అక్కడక్కడ కామెడీ సన్నివేశాలు మినహాయిస్తే..  `పాగల్‌` ఓ పేలవమైన మూవీగా నిలిచిందని చెప్పొచ్చు. 

రేటింగ్‌- 2/5.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: భోజనం ప్లేట్‌లో ఆ కూర లేకపోతే బాలయ్యకు ముద్ద దిగదు, బాలకృష్ణ ఫిట్ సీక్రెట్ ఏంటో తెలుసా?
Recommended image2
Secret Soldier Movie Review: సీక్రెట్‌ సోల్జర్‌ మూవీ రివ్యూ.. స్నేహం, స్పై యాక్షన్‌ మేళవించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image3
Pawan Kalyan: బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ను ఎలా కాకా పడతాడో తెలుసా? అసలు సీక్రెట్ రివిల్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved