- Home
- Entertainment
- నిన్న సమంత, విజయ్ .. నేడు విశ్వక్ సేన్, నేహా శెట్టి.. స్టేజిపైనే చీర లాగిన హీరో, కొత్త పబ్లిసిటీ టెక్నిక్
నిన్న సమంత, విజయ్ .. నేడు విశ్వక్ సేన్, నేహా శెట్టి.. స్టేజిపైనే చీర లాగిన హీరో, కొత్త పబ్లిసిటీ టెక్నిక్
విశ్వక్ సేన్ తాజాగా నటిస్తున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బోల్డ్ హీరోయిన్, డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

హీరో విశ్వక్ సేన్ తన అగ్రెసివ్ యాటిట్యూడ్ తో సపరేట్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. బోల్డ్ గా నటిస్తూ, విభిన్నమైన కథలపై పాత్రలపై ఈ యువ హీరో ఫోకస్ పెడుతున్నాడు. విశ్వక్ సేన్ నటిస్తున్న చిత్రాలు యావరేజ్ గా రాణిస్తున్నాయి కానీ బ్లాక్ బస్టర్స్ కావడం లేదు. తనకి పెద్ద బ్రేక్ ఇచ్చే సక్సెస్ కోసం విశ్వక్ సేన్ గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు.
విశ్వక్ సేన్ తాజాగా నటిస్తున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బోల్డ్ హీరోయిన్, డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. డీజే టిల్లు తర్వాత నేహా శెట్టికి వరుస ఆఫర్స్ జోరందుకుంటున్నాయి.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో కూడా నేహా శెట్టి అందాలు ఆరబోస్తూ బోల్డ్ గానే నటించినట్లు ఉంది. మరోసారి తన సొగసుతో సిల్వర్ స్క్రీన్ పై మాయ చేసేందుకు సిద్ధం అవుతోంది. తాజాగా విడుదలైన సుట్టమ్ లా సూసి అనే సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. గోదావరి అందాలలో విశ్వక్ సేన్, నేహా శెట్టి రొమాన్స్ తో రెచ్చిపోతున్నారు. ఏకంగా లిప్ లాక్స్ తో కుర్రాళ్ళకి పసందైన విందు వడ్డిస్తున్నారు.
ఈ సాంగ్ లో విశ్వక్ సేన్.. నేహా శెట్టి చీర లాగుతూ డ్యాన్స్ చేయడం యువతని ఆకర్షించే విధంగా ఉంది. ఈ సాంగ్ లాంచ్ లో భాగంగా ప్రమోషన్స్ కోసం ఈ జంట తెగించేశారు. పాటలోని డ్యాన్స్ ని వేదికపైనే చేసి ప్రమోషన్స్, పబ్లిసిటీ కోసం కొత్త టెక్నిక్స్ ఉపయోగించారు. ఈ సాంగ్ లాంచ్ కి చిన్న ఈవెంట్ నిర్వహించారు.
దీనితో వేదికపైనే ఆ సాంగ్ తరహాలోనే నేహా శెట్టి తన చీర కొంగుతూ విశ్వక్ సేన్ ని చుట్టేసింది. బీట్ మొదలు కాగానే ఆమె కొంగుని లాగుతూ ఇద్దరూ డ్యాన్స్ చేయడం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం యువ హీరోలు హీరోయిన్లు పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నేహా శెట్టి ఏమాత్రం బెదురూ లేకుండా చీర కొంగు తీసేసి వేదికపైనే డ్యాన్స్ చేయడంతో ఔరా అంటున్నారు.
నిన్న ఖుషి చిత్ర ఈవెంట్ లో కూడా దాదాపు ఇలాంటి సీనే జరిగింది. వేదికపై విజయ్ దేవరకొండ షర్ట్ తీసేసి సమంత తో డ్యాన్స్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. వేదికపైనే ఈ రేంజ్ లో కెమిస్ట్రీ పండిస్తుంటే ఇక సినిమాలో ఈ యువ జంటలు రెచ్చిపోయి ఉంటారు అని నెటిజన్లు అంటున్నారు. మొత్తంగా వేదికలపై పబ్లిసిటీ పెంచుకునే కొత్త ట్రెండ్ మొదలయింది అని అంటున్నారు.