MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విలన్ గా అల్లాడించిన రామిరెడ్డి.. చివరి రోజుల్లో అంత నరకం అనుభవించాడా..?

విలన్ గా అల్లాడించిన రామిరెడ్డి.. చివరి రోజుల్లో అంత నరకం అనుభవించాడా..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో గొప్పగా బ్రతికిన ఎంతో మంది నటీనటుులు చివరి రోజుల్లో మాత్రం నరకం చూసి మరణించినవారు ఉన్నారు. అలాంటి వారిలో విలన్ పాత్రలకు ప్రసిధ్ది చెందిన రామిరెడ్డి ఒకరు. 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 08 2024, 10:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఎంత గోప్పగా బ్రతికిన వాళ్లు కూడా చివరి రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. మరీ ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజాలా బ్రతికిన వారు కూడా రోడ్డున పడ్డ ఉదాహరణలు ఉన్నాయి. అందరు అలా అయిపోతారు అని లేదు.

కాని ఆర్ధిక  క్రమశిక్షణ లేక, తమతో ఉన్నవారే తమను మోసం చేయడం.. లేకపోతే పది మంది మంచి కోరి.. చేతిలో ఉన్నదంతా దానం చేయడం. ఇలా అన్నీ తమ చేతులారా చేసుకుని చివరకు ఇబ్బందులుపడే నటీనటులు ఎంతో మంది ఉన్నారు ఇండస్ట్రీలో . 

Also Read: ఠాగూర్ కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి..? డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

మరికొంత మంది మాత్రం ఈ విషయంలో జాగ్రతపడి తమ ఆస్తులు, సొమ్ములు పదిలం చేసుకుంటుంటారు. అయితే కొంత మంది ఆర్టిస్ట్ లు మాత్రం అనారోగ్యం కారణంగా ఉన్నదంతా ట్రీట్మెంట్ కు పెట్టి.. అయినా ఆరోగ్యం కుదుట పడక మరణించినవారు ఉన్నారు. అలాంటి వారిలో విలన్ పాత్రలకు ప్రసిద్ధి చెందిన రామిరెడ్డి ఒకరు. 
 
మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కమెడియన్లకు , విలన్లకు, కామెడీ విలన్లకు కొదవ లేదు. తెలుగు సినిమాల్లో విలన్ అంటే జనాలు దడుసుకునేవాళ్లు. స్క్రీన్ మీద వాళ్లను చూసి..  బయట కనిపించినా కూడా భయపడి దూరం జరిగేవారు. అంతే కాదు వీడి మంచోడు కాదురా అని దాడులు చేసిన వారు కూడా లేకపోలేదు. అంతలా ఆడియన్స్ ను  భయంతో వణికించిన విలన్లలో రామిరెడ్డి కూడా ఒకరు. 

Also Read: హీరోయిన్ ను పెళ్లాడబోతున్న నిహారిక మాజీ భర్త, మెగా డాటర్ కు షాక్ ఇచ్చిన చైతన్య ..?

35

తమ నటనతో వెండితెరపై చెరగని ముద్ర వేశారు రామి రెడ్డి.  ఈతరం ప్రేక్షకులకు ఆయన పెద్దగా పరిచయం లేకపోవచ్చు కాని. 90స్ కిడ్స్ కు రామరెడ్డి సినిమాలు అన్ని గుర్తుండి ఉంటాయి. ఇప్పటికీ అంకుశం, అమ్మోరు లాంటి సినిమాలు తలుచుకుంటే ఇంత పెద్దవారు అయినా కూడా ఏదో ఒక మూలన రామరెడ్డి గుర్తొచ్చి కాస్త భయం వేస్తుంది.  

అలాంటి నటన మళ్ళీ ఎవరు చూపించలేకపోయారు అది రామిరెడ్డి ప్రత్యేకత. ఇవే కాదు 90వ దశకంలో రామిరెడ్డి కి చాలా డిమాండ్ ఉండేది. అంకుశం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రామిరెడ్డి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ ను సాధించారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రామిరెడ్డికి విలన్ గా అవాకాశాలు క్యూ కట్టాయి. 

Also Read:మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరోయిన్, త్వరలో ఎంట్రీ.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..

45

తెలుగు మాత్రమే కాదు. తమిళం, కన్నడ, భోజ్ పూరి సినిమాల్లో కూడా ఆయన నటించారు. తన మార్క్ విలనిజం చూపించారు. విలన్ గా ఆయన్ను చూసి ఎంత భయపడేవారో.. కామెడీ పాత్రలు చేసినప్పుడు కూడా రామిరెడ్డిని చూసి అంతలా నవ్వుకునేవారు జనాలు. కాని అమ్మోరు సినిమాలో రామిరెడ్డిని చూసి జడుసుకోని పిల్లలు ఉండరేమో. 

అంతలా ప్రభావం చూపించారు రామిరెడ్డి తెలుగు ఆడియన్స్ మీద. దాదాపు 300 సినిమాల్లో రకరకాల పాత్రల్లో మెరిసిన ఆయన చాలా చిన్న వయస్సులో మరణించారు. ఇండస్ట్రీలో ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన 55 ఏళ్లకే అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. అనుకోని అనారోగ్యం రామిరెడ్డిని మంచానపడేసింది. కాలేయ సమస్యఅతన్ని వెంటాడింది. 

Also Read: దివ్యభారతి మరణ రహస్యం తెలిసిపోయింది..? 20 ఏళ్ల తర్వాత బయటపడ్డ అసలు నిజం..?

55

కాలేయ వ్యాధి బారిన పడినప్పటి నుంచి రామిరెడ్డి నరకం అనుభవించారు. నిండుగా ఉండే మనిషి.. ఈ జబ్బు వల్ల  గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. సన్నగా పీలగా అయిపోయారు. ఆర్ధికంగా కూడా చాలా ఇబ్బందులు అనుభవించిన రామిరెడ్డి. ట్రీట్మెంట్ చేయించుకుంటూనే  2011 ఏప్రిల్ 14న కన్నుమూశారు. 

రామిరెడ్డి చిత్తూరు జిన్నా వాయల్పాడు సమీపంలోని ఓబుళంవారిపల్లెలో జన్మించాడు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పట్టా తీసుకున్న ఆయన మొదట్లో ఉర్దూ పత్రికలో జర్నలిస్టుగా పనిచేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. నటుడు, జర్నలిస్ట్ మాత్రమే కాదు బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Movie Trailer: పెద్ది ట్రైలర్‌ రివ్యూ.. ఆట మాత్రమే కాదు, అంతకు మించి.. కానీ డిజప్పాయింట్‌ చేసేది ఇదే
Recommended image2
Folk Song: యూట్యూబ్‍లో 110 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్..ఈ పాట వింటే ప్రతి ఒక్కరి గుండె బరువెక్కాల్సిందే
Recommended image3
Sreeleela: క్రికెటర్ తో పీకల్లోతు ప్రేమలో శ్రీలీల..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved