Janhvi Kapoor with Vijay Devarakonda: రౌడీ హీరోతో కలిసి సౌత్ ఫ్లైట్ ఎక్కబోతున్న జాన్వీ కపూర్
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) సౌత్ ఎంట్రీ గురించి చాలా కాలంగా చాలా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కాని ఇప్పటి వరకూ ఆమె సౌత్ ప్లైట్ ఎక్కింది లేదు. త్వరలో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
జాన్వీకపూర్(Janhvi Kapoor) అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈముద్దుగుమ్మ తన టాలెంట్ తో ఒక్కో మెట్టు ఎక్కుతోంది. రెండు మూడు సినిమాలతోనే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న జాన్వీ.. వరుస సినిమాలతో.. సక్సెస్ ఫుల్ కెరీర్ ను లీడ్ చేస్తోంది. బాలీవుడ్ యంగ్ స్టార్ హీరోయిన్ల సరసన జాన్వీ చేరిపోయింది.
బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అక్కడే సెటిల్డ్ గా సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్(Janhvi Kapoor) సౌత్ ఎంట్రీ పై చాలా కాలంగా రూమర్స్ నడుస్తూ వస్తున్నాయి. కొన్ని రోజులేమో.. తమిళ సినిమా ద్వారా సౌత్ ఎంట్రీ ఇస్తుందన్నారు. లేదు తెలుగు సినిమాలో జాన్వీ నటిస్తుందంటూ రకరకాల రూమర్స్ వినిపించాయి. కాని ఇప్పటి వరకూ జాన్వీ సౌత్ ఎంట్రీ జరగలేదు.
ఇటు టాలీవుడ్ లో చాలా మంది జాన్వీని తెలుగు తెరకు పరిచయం చేయాలని ట్రై చేశారు. ఎన్టీఆర్ కోసం జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ను తెగ ట్రై చేశాడు మాటల మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కాని ఈ కాంబో సెట్ అవ్వలేదు. అటు రామ్ చరణ్, బన్ని లాంటి స్టార్ హీరోల కోసం కూడా జాన్వీని ట్రై చేశారు దర్శకులు. కాని అవేమి వర్కౌట్ కాలేదు. ఇక ఇన్నాళ్లకు జాన్వీ (Janhvi Kapoor) సౌత్ ఎంట్రీకి ముహూర్తం కుదిరినట్టు తెలుస్తోంది.
సౌత్ ఎంట్రీ గురించి పలు సందర్భాల్లో జాన్వీ కపూర్(Janhvi Kapoor) కూడా మాట్లాడింది. కపిల్ శర్మ షోలో తన మనసులో మాట చెప్పిన జాన్వీ కపూర్. సౌత్ లో తన అభిమాన స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)- అని చెప్పింది. తనతో సినిమా చేసే ఛాన్స్ వస్తే.. ఎగిరి గంతేసి ఒప్పుకుంటానంటోంది. ఇప్పుడు ఇదే నిజం అయ్యేట్టు తెలుస్తోంది. వీరి కాంబోలో సినిమా దాదాపు కన్ ఫార్మ్ అంటున్నారు.
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)- ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆయన ఇమేజ్ టాలీవుడ్ ను దాటి బాలీవుడ్ చేరింది. ప్రస్తుతం పూరీ జగ్నాథ్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ లైగర్ చేస్తున్నాడు విజయ్. ఈమూవీలో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా భాగస్వామిగా ఉన్నారు. బాలీవుడ్ లో విజయ్ దేవరకొండను గ్రాండ్ గా పరిచయం చేయబోతున్నాడు కరణ్.
ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)- జాన్వీ కపూర్(Janhvi Kapoor) కాంబినేషన్ ను కూడా కరణ్ జోహారే కలపబోతున్నట్టు తెలుస్తోంది. వీరి కాంబోలో భారీ మూవీని ప్లాన్ చేస్తున్నాడట కరణ్ జోహార్. జాన్వీ కపూర్(Janhvi Kapoor) ను బాలీవుడ్ కు పరిచయం చేసిన కరణ్.. సౌత్ ఇండస్ట్రీకి కూడా ఆయనే జాన్వీని ఇంటర్డ్యూస్ చేయబోతున్నాట్టు సమాచారం. అది కూడా పూరీ జగన్నాథ్ (Puri Jagannath) డైరెక్ష్ లోనే ఉంటుందంటూ రూమర్ నడుస్తోంది.
ప్రస్తుతం పూరీ కాంబోలో వస్తోన్న లైగర్ మూవీ విషయంలో బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నాడట కరణ్ జోహార్. పూరీపై మంచి నమ్మకంతో ఉన్నాడు. దాంతో జాన్వీ సౌత్ ఎంట్రీ ప్లానింగ్ కూడా పూరీ జగన్నాథ్ కే అప్పజెప్పాలని చూస్తున్నాట కరణ్ జోహార్. దాంతో త్వరలోనే జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తెలుగు తెరపై మెరవబోతున్నట్టు తెలుస్తోంది.
రౌడీ హీరోతో అతిలోక సుందరి కలిస్తే.. అటు బాలీవుడ్ లో .. ఇటు టాలీవుడ్ లో.. మరో వైపు సౌత్ అంతా బారీ అంచనాలు పెరిగే ఛాన్స్ ఉంది. ఈ వార్త విన్నఅభిమానులు ఎప్పుడెప్పుడు ఆ సినిమా అనౌన్స్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. మరి ఈ శుభవార్త కరణ్ టీమ్ ఎప్పుడు చెపుతుందో చూడాలి.