MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Vijay Devarakonda Rashmika: వాళ్ళిద్దరి మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు..?

Vijay Devarakonda Rashmika: వాళ్ళిద్దరి మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు..?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ – కన్నడ సోయగం రష్మిక  పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు ఇండస్ట్రీలో రూమర్ గట్టిగా నడుస్తుంది. ఈ ఏడాది శుభప్రదంగా అనౌన్స్ మెంట్ కూడా చేస్తారని టాక్ నడుస్తుంది.

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jan 01 2022, 09:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ... స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ రూమర్స్ గట్టిగా స్ప్రెడ్ అవుతున్నాయి. గతం నుంచి ఈ రూమర్ గట్టిగానే నడుస్తున్నా..  ఈమధ్య ఆ ఇష్యూ పెద్దగా బయటకు రాలేదు. అయితే ఇప్పుడు కొత్త ఏడాది సందర్భంగా మరోసారి ఈ జంట మీద గాసిప్స్ గట్టిగా గుఫ్పుమన్నాయి. నూతన సంవత్సరం ఏదో ఒక ప్రకట చేయబోతున్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న ఈ ఇద్దరూ.. చెప్పుకోడానికి బెస్ట్ ఫ్రెండ్స్ మేము అని  అంటున్నా.. అంతకుమింది వీరి మధ్య ఏదో ఉంది అనే అనేది సోషల్ మీడియా టాక్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

గీత గోవిందం సినిమాతో మొదటి సారి కలిసారు వీరిద్దరూ.. పరశురామ్ డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమా రష్మికను టాలీవుడ్ లో నిలబెట్టింది. రష్మికకు ఈ సినిమా బాగా వర్కౌట్ అయ్యింది. అటు విజయ్ దేవరకొండ కు అర్జున్ రెడ్డి  మ్యానియా వల్ల వచ్చిన ఇమేజ్ ను గీతగోవిందం నిలబెట్టింది. కాకపోతే ఈరెండు సినిమాల్లో రెండు పాత్రలు పూర్తిగా భిన్నమైనవి. అర్జున్ రెడ్డిలో హైపర్ క్యారెక్టర్ చేసిన విజయ్ గీతగోవిందంలో అమాయకపు పాత్రలో అద్భుతం చేశాడు. ఈసినిమా తరువాతే రష్మిక రక్షిత్ శెట్టితో జరిగిన ఎంగేజ్ మెంట్ కాన్సిల్ చేసుకోవడంతో.. వీరిద్దరిపై పుకార్లు యమా స్పీడ్ గా షికారు చేశాయి.

 

35

ఇక గీత గోవిందం టైమ్ లోనే వీరిద్దరి మధ్య ఏదో సమ్ థింగ్ .. సమ్ థింగ్ స్టార్ట్ అయ్యింది అని టాక్ గట్టిగా నడిచింది. ఈ సినిమాకు వీరిద్దరి పెయిర్ బాగా వర్కైట్ అవ్వడం.. వీరిమధ్య కెమిస్ట్రీ బాగా కుదరడంతో.. డియర్ కామ్రేడ్ సినిమాతో మరోసారి స్క్రీన్ పైకి వచ్చారిద్దరూ.. ఈ సినిమాలో ఇంకా అడ్వాన్స్ అయ్యి.. ఘూటు ముద్దుల వరకూ వెళ్లారు. దాంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ గట్టినానే ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. డియర్ కామ్రేడ్ సక్సెస్ సాధించలేకపోయినా. వీరి కెమిస్ట్రీ మాత్రం బాగా వర్కౌట్ అయ్యింది. వీరి లవ్ ట్రాక్ కు.. పాటలకు మంచి రెస్పాస్ వచ్చింది.

45

ఇక అప్పటి నుంచి వీరిద్దరి మీద సోషల్ మీడియా జనాలు ఓ కన్నేసి ఉంచారు. అప్పుడప్పుడు ముంబయ్ లో డిన్నర్ ప్లాన్స్ చేసుకోవడం.. బయట కలిసి చక్కర్లు కొడుతూ..రెస్టారెంట్ల దగ్గర కెమెరా కంట పడ్డారు ఈ ఇద్దరు స్టార్లు. చాలా సార్లు హాట్ టాపిక్ అయిన  ఈ జంట ఇప్పుడు స్టార్స్.. విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్.. ఇప్పుడు లైగర్ తో పాన్ ఇండియాకు వెళ్తున్నాడు. అటు రష్మిక కూడా ఇప్పుడు టాప్ హీరోయిన్ గా ఉంది. మరి వీరిద్దరు ఏదో అనౌన్స్ మెంట్ చేస్తారు అని రూమర్ రావడంతో అందరూ ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు.

55

 అయితే వీరిద్దరు లవ్ రిలేషన్ గురించి అనౌన్స్ చేస్తారా.. లేక  కొత్త సినిమా ఏదైనా ప్రకటిస్తారా అనే క్లారిటీ లేక.. ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. అసలు అనౌన్స్ మెంట్ ఉంటుందా..? లేక ఇది కూడా రూమరేనా..? అనేది తెలియాల్సి ఉంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో లైగర్ మూవీ పాన్ ఇండియా లెవల్లో చేస్తున్నాడు నెక్ట్స్ మన్త్ 25న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇక రష్మిక అల్లు అర్జున్ తో  కలిసి నటించిన పుష్ప మూవీ సూపర్ హిట్ అవ్వడంతో.. ఆమె సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది. మరి ఈ హాట్ కపుల్ ఎలాంటి అనౌన్స్ మెంట్ ఇస్తారో చూడాలి.   

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved