మదర్స్ డే రోజున తొలిసారి తమ పిల్లల్ని చూపించిన నయనతార, విగ్నేష్.. వైరల్ ఫొటోస్
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఏడాది తన ప్రియుడు విగ్నేష్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నయనతార.. సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయింది.

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఏడాది తన ప్రియుడు విగ్నేష్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నయనతార.. సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయింది. నయనతార ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నయన్ నటిస్తోంది.
చాలా కాలం పాటు సహజీవనం చేసిన నయన్, విగ్నేష్ ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. నయనతార, విగ్నేష్ శివన్ జోడి ఎక్కడ కనిపించినా అక్కడ అభిమానులు పెద్ద ఎత్తున జనసంద్రంలా మారడం చూస్తూనే ఉన్నాం.
నయనతార సోషల్ మీడియాకి, మీడియాకి దూరంగా ఉంటుంది. ఇక విగ్నేష్ శివన్ మాత్రమే సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ విశేషాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. నేడు మదర్స్ డే సందర్భంగా విగ్నేష్ శివన్ షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నయనతార, విగ్నేష్ జంట సరోగసి విధానం ద్వారా పిల్లల్ని పొందారు. వీరికి కవల పిల్లలు జన్మించిన సంగతి తెలిసిందే. నయనతార తన పిల్లలని ఎత్తుకుని ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ ని విగ్నేష్ షేర్ చేశాడు. 'ప్రపంచంలోనే ఉత్తమమైన తల్లి నీవు.. తల్లి అయ్యాక ఇదే ఫస్ట్ మదర్స్ డే.. ఈ సందర్భంగా నీకు శుభాకాంక్షలు.
తల్లిగా నీకు 10 కి పది మార్కులు వేయాలి. ఆ దేవుడు నీకు మరింత శక్తిని ప్రసాదించాలి. పిల్లలతో మన కల నెరవేరింది అంటూ విగ్నేష్ నయనతార ఫొటోస్ కి కామెంట్స్ పెట్టాడు. ఈ ఫొటోస్ లో తొలిసారి తన పిల్లల ముఖాలు చూపించాడు.
అలాగే విగ్నేష్ మదర్స్ డే సందర్భంగా తన తల్లితో ఉన్న ఫొటోస్ కూడా షేర్ చేశాడు. నయనతార ఆమె పిల్లలు ఉయిర్, ఉలగ్ క్యూట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.