- Home
- Entertainment
- Nayanthara: భర్తతో నయనతార చిలిపి సరదాలు.. వైభవంగా వెడ్డింగ్, ఫోటోలు షేర్ చేసిన విగ్నేష్ శివన్
Nayanthara: భర్తతో నయనతార చిలిపి సరదాలు.. వైభవంగా వెడ్డింగ్, ఫోటోలు షేర్ చేసిన విగ్నేష్ శివన్
మహాబలిపురంలో విగ్నేష్, నయనతార వివాహం వైభవంగా జరిగింది. విగ్నేష్ శివన్, నయనతార ఇద్దరూ సాంప్రదాయ వస్త్రధారణలో వెలుగులు విరజిమ్మారు.

వయసు పెరుగుతున్నా వన్నె తరగని అందాల భామ నయనతార ,యువ దర్శకుడు విగ్నేష్ ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ ఉదయం 8:30 నుంచి నయనతార, విగ్నేష్ శివన్ ల వివాహం ప్రారంభం అయింది. దాదాపు ఏడేళ్ల సహజీవనానికి తెరదించుతూ వీరిద్దరూ అధికారికంగా భార్య భర్తలు అయ్యారు. నయనతార సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్. లేడీ సూపర్ స్టార్ గా కీర్తి పొందింది.
అందంతో, అభినయంతో నయనతార చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేసింది. యువతలో నయనతారకి ఎంతటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనితో నయనతార వివాహంపై అందరిలో సహజమైన ఆసక్తి ఉంటుంది. ఇక విగ్నేష్ శివన్ కూడా యువ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
వీరిద్దరి వివాహానికి తారలు తరలివచ్చారు. మహాబలిపురంలో విగ్నేష్, నయనతార వివాహం వైభవంగా జరిగింది. విగ్నేష్ శివన్, నయనతార ఇద్దరూ సాంప్రదాయ వస్త్రధారణలో వెలుగులు విరజిమ్మారు. ముఖ్యంగా నయనతార అందాల దేవతలా నవ వధువుగా దర్శనం ఇచ్చింది. నయనతార వివాహానికి రజనీకాంత్, షారుఖ్ లాంటి స్టార్ సెలెబ్రిటీలు హాజరయ్యారు.
రజనీకాంత్ తో నయనతార చంద్రముఖి, దర్బార్, అన్నాత్తే లాంటి చిత్రాల్లో నటించింది. ఇక షారుఖ్ ఖాన్ తో అట్లీ దర్శకత్వంలో 'జవాన్' చిత్రంలో నటిస్తోంది. అలాగే హీరో కార్తీ, నిర్మాత బోని కపూర్ కూడా హాజరవుతున్నారు. ఇక నయనతార వివాహానికి సంబందించిన ఎలాంటి లుక్ బయటకి రాకుండా కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు.
మహాబలిపురం చారిత్రాత్మక ప్రాంతం మాత్రమే కాదు.. అందమైన ప్రకృతి దృశ్యాలు ఉన్న ప్రదేశం కూడా. కాబట్టి నయనతార విగ్నేష్ శివన్ లు తమ వివాహానికి వేదికగా మహాబలిపురంని ఎంచుకున్నారు.
నయనతార, విగ్నేష్ వివాహానికి చెందిన ఫోటోలు ఇప్పుడిప్పుడే బయటకి వస్తున్నాయి. నయనతార పెళ్లి కార్యక్రమంలో వివిధ దశలలో వివిధ శారీలు ధరించి కనిపిస్తోంది. రెడ్ జారీలో ఆభరణాలు ధరించిన నయన్ అందాల దేవతలా వెలిగిపోతోంది.
వివాహం పూర్తి కాగానే విగ్నేష్ శివన్ పెళ్లి ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. పెళ్లి లో మాంగళ్య ధారణ, పూలమాలలు మార్చుకోవడం.. భార్యకి ముద్దు ఇవ్వడం లాంటి కీలక ఘట్టాలని విగ్నేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె నయన్ అయితే నేను వన్ అని ఇద్దరం కలిస్తే 10 అని అర్థం వచ్చేలా విగ్నేష్ కామెంట్ పెట్టాడు.
ఇక పెళ్లి పీటలపై విగ్నేష్ శివన్ వివాహం తర్వాత తన భార్యకు తొలి ముద్దు ఇచ్చిన ఫోటో చూడ ముచ్చటగా ఉంది. గులాబీ రేకులు లాంటి రెడ్ బ్లౌజ్ లో నయనతార చూపు తిప్పుకోనివ్వడం లేదు. అలాగే నయనతార వెడ్డింగ్ లో కోలివుడ్ నటీమణులు నటులు సందడి చేస్తూ కనిపిస్తున్నారు.