- Home
- Entertainment
- ప్రభాస్ ఆరోగ్యం గురించి మీకేం తీలుసురా వెధవల్లారా.. 3 ఫ్లాపుల,1 హిట్టు.. నేను చెప్పిందే నిజం, వేణు స్వామి
ప్రభాస్ ఆరోగ్యం గురించి మీకేం తీలుసురా వెధవల్లారా.. 3 ఫ్లాపుల,1 హిట్టు.. నేను చెప్పిందే నిజం, వేణు స్వామి
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రం శుక్రవారం విడుదలై బాక్సాఫీస్ భరతం పడుతోంది. వసూళ్ళలో సలార్ మూవీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ అభిమానుల ఆకలి తీర్చిన చిత్రం ఇదే అని చెప్పాలి.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రం శుక్రవారం విడుదలై బాక్సాఫీస్ భరతం పడుతోంది. వసూళ్ళలో సలార్ మూవీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ అభిమానుల ఆకలి తీర్చిన చిత్రం ఇదే అని చెప్పాలి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబాలే ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం నేషనల్ వైడ్ సెన్సేషనల్ గా మారింది.
అయితే సలార్ మూవీ విషయంలో వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. వేణు స్వామిపై ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్ కూడా చేశారు. సెలబ్రిటీల జాతకాలపై, వారి వ్యక్తిగత జీవితాలు, కెరీర్ పై వేణు స్వామి జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పటివరకు వేణు స్వామి చాలా మంది సెలెబ్రిటీలపై చెప్పిన జ్యోతిష్యాలు నిజమైనట్లు ప్రచారం ఉంది.
Venu swamy
ఆదిపురుష్ పరాజయం తర్వాత వేణు స్వామి ప్రభాస్ జాతకం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రభాస్ కెరీర్ నిలబడదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ తన కెరీర్ లో చూడాల్సిన పీక్ హైట్స్ చూసేశారు. డౌన్ ఫాల్ మొదలయింది. ఇక ప్రభాస్ కెరీర్ పూర్తిగా నాశనం అయిపోతుంది అని తెలిపారు.
Venu swamy prabhas
కానీ సలార్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ప్రభాస్ అభిమానులు వేణు స్వామిని ఆడేసుకుంటున్నారు. పబ్లిసిటీ పిచ్చలో ప్రభాస్ గురించి ఇష్టం వచ్చినట్లు వాగావ్.. ఇక నీ గాలి మాటలు చెల్లవు అంటూ సలార్ రిలీజ్ తర్వాత ప్రభాస్ అభిమానులు వేణు స్వామిని ఏకిపారేశారు. దీనితో వేణు స్వామి జాతకం పేరుతో ఇక ప్రభాస్ ని కెలకడు అని అంతా భావించారు. ఆశ్చర్యకరంగా వేణు స్వామి ప్రభాస్ అభిమానులపై రివర్స్ అటాక్ చేశారు. అది కూడా కొత్త వాదనతో.
Prabhas
ఫ్యాన్స్ ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తుండడంతో వేణు స్వామి తాజాగా సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలతో పోస్ట్ పెట్టారు. ప్రభాస్ విషయంలో తాను చెప్పిందే నిజం అని వాదిస్తున్నారు. 'ఒరేయ్ ఆస్ట్రేలియా ఆజాము... సూపర్ స్టార్ అంటే విడుదలైన సినిమాల్లో 90 శాతం సినిమాలు హిట్లు కొట్టడం..... అంతేగాని విడుదలైన నాలుగు సినిమాలలో ఒకే సినిమా హిట్టు కొడితే ఏమనాలి రా ఆజాము... ఆస్ట్రేలియా ఆజాము.. నాలుగు సినిమాలకి ఒక్క సినిమా హిట్టు కొట్టడం కాదురా ఆజాము ఆస్ట్రేలియా' అంటూ విరుచుకుపడ్డారు.
బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ మూడు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయని సలార్ మాత్రమే హిట్ అయినట్లుగా వేణు స్వామి అంటున్నారు. ప్రభాస్ విషయంలో తాను చెప్పేదే నిజం అని అంటున్నారు. దీనికి వివరణ ఇస్తూ సలార్ రిలీజ్ కి ముందు చేసిన వ్యాఖ్యలు కూడా పోస్ట్ చేశారు.
ప్రభాస్ విషయంలో నేను చెప్పినవి కొన్ని బయటకి వస్తాయి కొన్ని రావు. కానీ నేను చెప్పిందే నిజం. ప్రభాస్ కి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పా. ఇటీవలే సర్జరీ కూడా జరిగింది. అందుకే సలార్ ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయలేదు. ప్రభాస్ గురించి నేను చెప్పినవి కొన్ని బయటకి రావు. కానీ అవి లోపల జరుగుతాయి. మీకేం తెలుసురా వెధవల్లారా ప్రభాస్ కి ఉన్న సమస్యల గురించి అంటూ వేణు స్వామి కౌంటర్ ఇచ్చారు. అసలే సలార్ బ్లాక్ బస్టర్ తో ఉత్సాహంతో ఉన్న ఫ్యాన్స్ ని వేణు స్వామి మరోసారి కెలికారు. ఏమవుతుందో చూడాలి.