MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Venky Anil 5: పూజా కార్యక్రమంలోనే హీరోయిన్లు మారిపోయారు..వెంకీ, కళ్యాణ్ రామ్ లకు షాక్.. 300 కోట్లపై కన్ను

Venky Anil 5: పూజా కార్యక్రమంలోనే హీరోయిన్లు మారిపోయారు..వెంకీ, కళ్యాణ్ రామ్ లకు షాక్.. 300 కోట్లపై కన్ను

వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోలో అనిల్ రావిపూడి తెరకెక్కించబోయే మల్టీస్టారర్ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభం అయింది. ఈ మూవీతో అనిల్ రావిపూడి మరోసారి 300 కోట్ల కలెక్షన్స్ పై కన్నేశారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 18 2026, 11:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అనిల్ రావిపూడి సినిమాలు
Image Credit : Asianet News

అనిల్ రావిపూడి సినిమాలు

ఇటీవల కాలంలో వినోదాత్మక చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా మెప్పిస్తున్న దర్శకులలో అనిల్ రావిపూడి ముందు వరుసలో ఉంటారు. అనిల్ కి సంక్రాంతి డైరెక్టర్ అనే పేరు ఉంది. అనిల్ తెరకెక్కించిన సినిమాలు ఎక్కువగా సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్స్ అవుతుంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మరోసారి 300 కోట్ల కలెక్షన్స్ పై కన్ను
Image Credit : Asianet News

మరోసారి 300 కోట్ల కలెక్షన్స్ పై కన్ను

అనిల్ రావిపూడి చివరి రెండు సినిమాలు సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. తాజాగా అనిల్ రావిపూడి కొత్త చిత్రం ప్రారంభం అయింది. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోలో అనిల్ రావిపూడి మల్టీస్టారర్ చిత్రం చేస్తున్నారు. గురువారం రోజు గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభం అయింది.

35
వెంకీ, కళ్యాణ్ రామ్ కాంబోలో మూవీ
Image Credit : Asianet News

వెంకీ, కళ్యాణ్ రామ్ కాంబోలో మూవీ

వెంకటేష్ తో అనిల్ కి ఇది 5 వ చిత్రం కాగా.. కళ్యాణ్ రామ్ తో రెండవది. ఈ మూవీ తో అనిల్ హ్యాట్రిక్ 300 కోట్ల కలెక్షన్స్ పై కన్నేశారు. ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. పూజా కార్యక్రమంతోనే అనిల్ రావిపూడి చిత్రాల్లో ఉండే అల్లరి మొదలైపోయింది.

45
నవ్వులు పూయించిన వెంకీ, కళ్యాణ్ రామ్
Image Credit : Asianet News

నవ్వులు పూయించిన వెంకీ, కళ్యాణ్ రామ్

ఈ మూవీలో వెంకటేష్ కి జోడీగా కీర్తి సురేష్.. కళ్యాణ్ రామ్ కి జోడీగా కృతి శెట్టి హీరోయిన్లుగా ఎంపికయ్యారు. అల్లు అరవింద్ పూజా కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. ఆయనే ఈ చిత్రాన్ని ఫస్ట్ క్లాప్ తో ప్రారంభించారు. అల్లు అరవింద్ ఫస్ట్ క్లాప్ ఇచ్చే సమయంలో వెంకటేష్ పక్కన కృతి శెట్టి.. కళ్యాణ్ రామ్ పక్కన కీర్తి సురేష్ ఉన్నారు. క్లాప్ అయ్యాక అరె ఇదేంటి ఇది అని ఆశ్చర్యపోయి.. వెంకీ పక్కకు కీర్తి సురేష్.. కళ్యాణ్ రామ్ పక్కకు కృతి శెట్టి వెళ్లారు. వీరి అల్లరి అక్కడి నవ్వులు పూయించింది.

55
త్వరలో షూటింగ్ షురూ
Image Credit : Asianet News

త్వరలో షూటింగ్ షురూ

సాహు గారపాటి ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తుండగా జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Bollywood Actresses: రూ.8 వేల కోట్ల ఆస్తితో టాప్‌లో జూహీ చావ్లా.. అత్యంత ధనిక హీరోయిన్లు వీళ్లే!
Recommended image2
Brahmanandam: బ్రహ్మానందం త్రిమూర్తులుగా భావించే లెజెండ్స్, ఒకరు చిరు..ఆ కమెడియన్ వల్లే బ్రహ్మి దశ తిరిగింది
Recommended image3
Bhogi Teaser: భోగి టీజర్ రివ్యూ, శర్వానంద్ మాస్ ట్రాన్స్ఫర్మేషన్..కెరీర్‌లో తొలిసారి వణుకు పుట్టించేలా
Related Stories
Recommended image1
Mahesh-Pawan: ఒకే పాత్రతో రెండు సినిమాలు చేసిన మహేష్.. పవన్ ఒక్కసారి చేస్తే బ్లాక్ బస్టర్ అనుకున్నారు కానీ
Recommended image2
Best Horror Films: టాలీవుడ్ లో దుమ్ములేపిన టాప్ 5 హారర్ మూవీస్..కష్టాల్లో ఉన్న హీరోకి అదిరిపోయే కంబ్యాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved