అర్జున్ కి హీరో అవ్వాలని లేదు, అతడు పుస్తకాల పురుగు... వెంకీ పర్సనల్ మేకప్ మాన్ లీక్ చేసిన షాకింగ్ నిజాలు!
స్టార్ హీరో కొడుకు స్టార్ హీరో కావలసిందే. కొంచెం అందం, టాలెంట్ ఆటు ఇటు అయినా.. పర్వాలేదు మేము మోసేస్తాం అంటారు ఫ్యాన్స్. మొదటితరం స్టార్స్ అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్ వారసులుగా హీరోగా పెద్ద సామ్రాజ్యం ఏర్పాటు చేశారు.
స్టార్ నిర్మాత కొడుకుగా చిత్ర సీమకు పరిచయమైన వెంకటేష్ స్టార్ గా ఎదిగారు. చిరంజీవి, బాలయ్య తరువాత అంతటి ఇమేజ్ కలిగిన హీరోగా వెంకీ అనేక బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఇవ్వడం జరిగింది.
వెంకటేష్ కి కుమార్తెలతో పాటు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. వెంకీ కుమారుడు పేరు అర్జున్ కాగా, బయట కనిపించేది చాలా అరుదు. కేవలం ఫ్యామిలీ ఫంక్షన్స్ లో మాత్రమే అర్జున్ కుటుంబ సభ్యులతో కనిపిస్తూ ఉంటారు.
2013లో విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్ర ఆడియో వేడుకలో వెంకటేష్, మహేష్ తమ కుమారులు అర్జున్, గౌతమ్ లను తీసుకు రావడం జరిగింది. ముఖ్యంగా వెంకటేష్ తన భార్యా పిల్లలు మీడియా కంట పడడానికి ఇష్టపడరు.
ప్రస్తుతం అర్జున్ టీనేజ్ లో ఉన్నారు. అంటే మరో రెండు మూడేళ్ళలో హీరోగా అర్జున్ ఎంట్రీ ఉండే అవకాశం కలదు. అయితే అర్జున్ కి నటన పట్ల ఆసక్తి ఉన్నట్లు లేదంటూ వెంకటేష్ పర్సనల్ మేకప్ మాన్ బాంబ్ పేల్చారు.
ఓ మీడియాతో ముచ్చటించిన వెంకటేష్ మేకప్ మాన్... అర్జున్ చాలా అద్భుతమైన కుర్రాడు. ఎప్పుడు చూసినా పుస్తకాలు చదువుతూ కనిపిస్తాడు. అర్జున్ ని అలా చూస్తుంటే, ఇతనికి నటన పట్ల ఆసక్తి లేదేమో అనిపిస్తుంది, అన్నారు.
ఓ స్టార్ హీరో కొడుకు డెబ్యూ కోసం మంచి కథ, ఫార్మ్ లో ఉన్న దర్శకుడుని ఎంచుకోవడం వంటి అనేక ఏర్పాట్లు ఉంటాయి. అర్జున్ విషయంలో అలాంటి ప్రణాళికలు ఏమీ కనిపించడం లేదని అతను మరో అభిప్రాయం వెల్లడించారు.
ప్రస్తుతం అర్జున్ ధ్యాస అంతా స్టడీస్ పైనే ఉన్నట్లు ఉంది. చదువు పూర్తి అయ్యాక, అతడు సినిమాల గురించి ఆలోచిస్తాడేమో అన్నారు సదరు మేకప్ మాన్. స్టార్స్ కడుపున పుట్టినా.. కొందరు హీరోలుగా మారడానికి ఇష్టపడరు. దీనికి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ బెస్ట్ ఉదాహరణ.
బాలయ్య కుమారుడు వయసు 25ఏళ్ళు దాటిపోతున్నా ఇంకా హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. బాలయ్య ప్రతి ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని చెబుతున్నా అది కార్యరూపం దాల్చడం లేదు. దానికి కారణం మోక్షజ్ఞకు ఇష్టం లేకపోవడమే అని సమాచారం.
ఒక వేళ వెంకీ వారసుడు అర్జున్ కూడా హీరోను కానని కఠిన నిర్ణయం తీసుకుంటే అది వెంకీ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్ అవుతుంది. అర్జున్ హీరో కావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి, అప్పుడే ఒక నిర్ణయానికి రాలేము.