వెంకటేష్ రెండో కూతురు ఎంగేజ్‌మెంట్ ఫోటోలు.. చిరు, మహేష్, నాగచైతన్య, రానా సందడి..
హీరో వెంకటేష్ రెండో కుమార్తె హవ్య వాహిని ఎంగేజ్‌మెంట్ బుధవారం గ్రాండ్‌గా జరిగింది. ఇందులో సినిమా సెలబ్రిటీలు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
వెంకటేష్ హీరోగా బిజీగా ఉన్నారు. ఆయన ఇప్పుడు `సైంధవ్` చిత్రంలో నటిస్తున్నారు. తన షూటింగ్ పూర్తయ్యింది. సంక్రాంతికి ఈ చిత్రంతో రాబోతున్నారు. అయితే ఈ లోపు ఇంట్లో శుభకార్యాలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా తన రెండో కూతురు ఎంగేజ్‌మెంట్ నిర్వహించారు.
హీరో వెంకటేష్ రెండు కూతురు హవ్య వాహిని ఎంగేజ్‌మెంట్ బుధవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఓ ప్రముఖ డాక్టర్ కుటుంబంతో వెంకీ కూతురి నిశ్చితార్థం నిర్వహించారు. ఈ వేడుకకి అతికొద్ది మంది సినిమా సెలబ్రిటీలు, ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొనడం విశేషం. అయితే చాలా సైలెంట్‌గా ఈ ఎంగేజ్‌మెంట్‌ని నిర్వహించడం గమనార్హం.
ఇందులో మెగాస్టార్ చిరంజీవి, అలాగే సూపర్ స్టార్ మహేష్‌బాబు, నాగచైతన్య, రానా వంటి వారు పాల్గొన్నారు. సినిమా పరిశ్రమలో అత్యంత సన్నిహితులు మాత్రమే ఇందులో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
చిరంజీవి తన సతీసమేతంగా పాల్గొన్నారు. డిజైనింగ్ వేర్‌లో మెరిశారు. మరోవైపు మహేష్ బాబు తన సతీసమేతంగా హాజరయ్యారు. ఆయన వైట్ షర్ట్, బ్లాక్ జీన్స్ ధరించారు. అలాగే అక్కినేని హీరో నాగచైతన్య కూడా ఈ ఎంగేజ్‌మెంట్‌కి హాజరయ్యారు. కానీ మిగిలిన అక్కినేని ఫ్యామిలీ కనిపించకపోవడం గమనార్హం.
విజయవాడకి చెందిన ప్రముఖ డాక్టర్ కుటుంబంతో వెంకటేష్ వియ్యం అందుకుంటున్నారట. అయితే పెద్దగా ప్రచారం లేకుండా సైలెంట్‌గా ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకని నిర్వహించడం విశేషం. అయితే అబ్బాయికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రధానంగా ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకలో.. చిన్నోడు మహేష్‌బాబు రాకతో పెద్దోడు వెంకటేష్ హ్యాపీగా అయ్యారు. మహేష్‌ని ప్రత్యేకంగా పలకరించి ధన్యవాదాలు చెబుతున్న ఫోటో ఒకటి వైరల్‌గా మారింది.
హీరో వెంకటేష్‌కి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె వివాహం నాలుగేళ్ల క్రితమే చేశారు. ఇప్పుడు రెండో కూతురు పెళ్లికి రెడీ అవుతున్నారు. ఇక కుమారుడుని హీరోని చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.