నిహారిక బర్త్ డే.. వైరల్ అవుతున్న రేర్ పిక్.. ఇంట్రెస్టింగ్ గా విషెస్ తెలిపిన వరుణ్ తేజ్!
మెగా డాటర్, నటి నిహారిక కొణిదెల (Niharika Konidela) పుట్టిన రోజు సందర్భంగా ఇంటర్నెట్ లో అరుదైన ఫొటో వైరల్ అవుతోంది. అలాగే అన్న వరుణ్ తేజ్ కూడా విష్ చేసిన తీరు ఆసక్తికరంగా మారింది.
నటుడు, ప్రముఖ నిర్మాత, మెగా బ్రదర్ నాగబాబు కూతురు కొణిదెల నిహారిక పుట్టిన రోజు వేడుకను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా నిహారికకు మెగా ఫ్యామిలీ నుంచి ఫ్యాన్స్ నుంచి విషెస్ అందుతున్నాయి. ఈ క్రమంలో అన్న వరుణ్ తేజ్ (Varun Tej) ప్రత్యేకంగా విష్ చేశారు.
1993 డిసెంబర్ 18న నిహారిక జన్మించింది. అప్పటి నుంచి అల్లారు ముద్దుగా.. మెగా డాటర్ గా పెరిగింది. మెగా ఫ్యామిలీలో నిహారిక సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటు సినిమాలు, టీవీ షోలతోనూ తెలుగు ప్రేక్షకులను అలరించి బాగా దగ్గరైంది.
ఈరోజుతో నిహారిక 29వ ఏట అడుగు పెట్టింది. ఈ సందర్బంగా అన్న వరుణ్ తేజ్ ట్వీటర్ వేదికన నిహారికకు విషెస్ తెలిపారు. ఇన్ స్టా ద్వారా పోస్ట్ చేస్తూ.. ‘పాప నిహారిక.. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ ప్రత్యేకమైన రోజున కూడా సరదాగా, సాహసంగా గడుపుతావని, ఇరవైలోని చివరి ఏడాదిని సద్వినియోగం చేసుకుంటావని ఆశిస్తున్నాను.’ అంటూ ట్వీట్ చేశారు.
వచ్చే ఏడాది నిహారిక 30వ ఏట అడుగు పెట్టబోతుండటంతో ఇలా ఆసక్తికరంగా పోస్ట్ చేశారు. విషెస్ తెలుపుతూ కొన్ని మెమోరబుల్ పిక్స్ ను పంచుకున్నాడు. నిహారికతో, సాయి ధరమ్ తేజ్ - వైష్ణవ్ తేజ్ తో కలిసి దిగిన ఫొటోలను పంచుకుంటున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఈ స్పెషల్ రోజున నిహారిక చైల్డ్ వుడ్ కు సంబంధించిన ఓ అరుదైన ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి నిహారికను ఎత్తుకుని ఉన్న రేర్ పిక్ ప్రస్తుతం ఇంటర్నెల్ వైరల్ అవతుంది. ఆ చిన్నపాపే నిహారిక అని తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ సందర్భంగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.
నటిగా వెండితెరపై కొన్ని చిత్రాలతో అలరించింది నిహారిక. కానీ వర్కౌట్ కాకపోవడంతో.. బుల్లితెరపై పలు షోలతో ఆడియెన్స్ కు దగ్గరైంది. మరోవైపు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ తో సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ వస్తోంది. 2020లో చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి గ్రాండ్ గా జరిగింది. అప్పటి నుంచి మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.