- Home
- Entertainment
- 'గాండీవధారి అర్జున' ప్రీమియర్ షో టాక్..వరుణ్ తేజ్ మూవీ హిట్టా ఫట్టా, కథలో మైనస్ లు చాలానే..
'గాండీవధారి అర్జున' ప్రీమియర్ షో టాక్..వరుణ్ తేజ్ మూవీ హిట్టా ఫట్టా, కథలో మైనస్ లు చాలానే..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'గాండీవధారి అర్జున'. యాక్షన్ చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన మూవీ ఇది. వరుణ్ తేజ్ తొలిసారి అల్ట్రా స్టైలిష్ యాక్షన్ మూవీలో నటించడంతో మంచి అంచనాలు ఉన్నాయి.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'గాండీవధారి అర్జున'. యాక్షన్ చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన మూవీ ఇది. వరుణ్ తేజ్ తొలిసారి అల్ట్రా స్టైలిష్ యాక్షన్ మూవీలో నటించడంతో మంచి అంచనాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కింది. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా ..నాజర్, విమలా రామన్, రవి వర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆల్రెడీ యుఎస్ ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి రెస్పాన్స్ కూడా వస్తోంది. గని, ఎఫ్3 పరాజయం తర్వాత గాండీవధారి చిత్రం వరుణ్ తేజ్ కి కంబ్యాక్ మూవీ అవుతుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఈ చిత్రం అంచనాలని అందుకునే విధంగా ఉందా లేదా అనేది చూద్దాం.
2 గంటల 17 నిమిషాల నిడివితో గాండీవధారి మొదలవుతుంది. ఇంగ్లాండ్ బేస్ చేసుకుని ఈ కథ సాగుతుంది. నాజర్, సాక్షి వైద్య, విమలా రామన్ పాత్రలతో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. యాక్షన్ సన్నివేశంతో వరుణ్ తేజ్ స్టైలిష్ ఎంట్రీ ఇస్తాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం పర్వాలేదనిపించే స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్ తో సాగుతుంది. ప్రవీణ్ సత్తారు ఎంచుకున్న కథ కూడా ఒకే అనిపించే విధంగా ఉంటుంది.
ఫస్ట్ హాఫ్ ని ఎలాంటి హై మూమెంట్స్ లేకుండా ప్రవీణ్ సత్తారు డీసెంట్ గా నడిపించారు. కథనం నెమ్మదిగా సాగడం బిగ్ మైనస్. యాక్షన్ ప్రియులు అంచనాలు పెట్టుకున్నట్లు అయితే ఫస్ట్ హాఫ్ సాగలేదు. వరుణ్ తేజ్ ఎంట్రీ బావుంది. కొన్ని సన్నివేశాలు బాగా సాగదీశారు. స్క్రీన్ ప్లే కూడా అద్భుతం అనిపించేలా లేదు. ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ ని దర్శకుడు బాగా డిజైన్ చేశారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ వల్ల సెకండ్ హాఫ్ పై ఒక హోప్ వస్తుంది.
ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా సాగడంతో సెకండాఫ్ అద్భుతంగా ఉంటేనే సినిమా నిలబడుతుంది. కానీ దర్శకుడు సెకండ్ హాఫ్ ని కూడా గొప్పగా ప్రజెంట్ చేయడంలో తడబడ్డాడు అనే చెప్పాలి. కొంతమంది ప్రేక్షకులు అయితే సెకండ్ హాఫ్ కంటే ఫస్టాఫ్ కాస్త బెటర్ గా ఉంది అని అంటున్నారు. ఇలాంటి యాక్షన్ చిత్రాలకు అవసరైన బిజియం కూడా యావరేజ్ గా ఉంది.
యాక్షన్ చిత్రం అంటే సీట్ ఎడ్జ్ పై కూర్చుని చూసే సీన్ ఒక్కటైనా ఉండాలి. కానీ ఆ విధంగా కథని సిద్ధం చేసుకోవడంలో ప్రవీణ్ సత్తారు ఫెయిల్ అయ్యారు అని అంటున్నారు. మూవీలో ఎక్కడా హై మూమెంట్ లేదు. దీనికి తోడు స్లోగా సాగే కథనంతో ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారు. వైవిధ్యంగా చిత్రాలు తెరకెక్కించే ప్రవీణ్ సత్తారు.. గాండీవధారి క్లైమాక్స్ ని అవుట్ డేటెడ్ అనిపించే విధంగా తీర్చి దిద్దారు.
ఓవరాల్ గా గాండీవధారి చిత్రం అంచనాలు అందుకోలేని యావరేజ్ మూవీ గా మిగిలిపోతుంది అని యుఎస్ ప్రీమియర్స్ నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ యాక్షన్ చిత్రాలకు సెట్ అవుతుంది. కానీ ఆ చిత్రాల వల్లే వరుణ్ తేజ్ కి సరైన సక్సెస్ రావడం లేదు అని అంటున్నారు. ఈ రకమైన రెస్పాన్స్ తో గాండీవధారి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఈమేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.