- Home
- Entertainment
- తమ్ముడు ఛీ అన్నాడు, జబర్దస్త్ వదిలేస్తున్నా... వర్ష కామెంట్స్ కి రోజాతో సహా అందరూ షాక్, అసలు కారణం అదే
తమ్ముడు ఛీ అన్నాడు, జబర్దస్త్ వదిలేస్తున్నా... వర్ష కామెంట్స్ కి రోజాతో సహా అందరూ షాక్, అసలు కారణం అదే
వర్ష జబర్దస్త్ వదిలేస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె జబర్దస్త్ వేదికపై ఓపెన్ గా చెప్పారు. దానికి కారణం ఇంట్లో సమస్యలే అని తెలుస్తుంది. వర్షపై సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ గురించి ఆమె తమ్ముడు నిలదీశాడని బోరున ఏడ్చేసింది.

కొన్ని నెలల క్రితం జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చారు వర్ష. గతంలో ఆమె రెండు మూడు సీరియల్స్ లో నటించడం జరిగింది. కానీ జబర్దస్త్ ఆమె పిచ్చ పాపులారిటీ తెచ్చింది. జబర్దస్త్ షో చాలా పాప్యులర్ కావడంతో ఆమె చాలా త్వరగా గుర్తింపు తెచ్చుకున్నారు.
జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో వర్ష లవ్ ట్రాక్ కూడా ఆమె త్వరగా పాప్యులర్ కావడంలో ఒక కారణం. నల్లగా ఉండే ఇమ్మానియేల్ వెంట పడే తెల్ల అమ్మాయిగా వర్ష తీరు ప్రేక్షకులకు నచ్చింది. ఓ విధంగా వీరు తాము నిజమైన ప్రేమికులమే అన్నట్లు కలర్ ఇస్తూ ఉంటారు. అది వాళ్ళ కెరీర్ కి చాలా ఉపయోగపడుతుంది.
ఇక సెలెబ్రెటీలకు సోషల్ మీడియా కామెంట్స్ చాలా సాధారణం. కొంత మంది చేసే కామెంట్స్ సదరు సెలెబ్రిటీల పేరెంట్స్ ని చాలా బాధ పెడతాయి. ఈ సమస్య వర్షకు కూడా ఎదురైంది.
తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో జడ్జి రోజా వర్షను ఉద్దేశిస్తూ.. ఏంటి జబర్దస్ ని వదిలేస్తున్నావట అని అడిగారు. రోజా ప్రశ్నకు వర్ష కన్నీరు పెట్టుకున్నారు.
ఇక్కడ ఉన్నట్లు ఇంట్లో ఉండదన్న వర్ష, తన తమ్ముడు మొబైల్ లోని సోషల్ మీడియా కామెంట్స్ చూపిస్తూ.. ఏంటి అక్కా... ఇది అంటే, నేను సమాధానం చెప్పలేక పోయాను మేడం, అని కన్నీరు పెట్టుకుంది
అదే సమయంలో సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్స్ చేసే వారికి స్మూత్ వార్నింగ్ కూడా ఇచ్చింది. మీ ఇంట్లో ఆడవాళ్లను ఎవరైనా కామెంట్ చేస్తే మీకు ఎంత బాధగా ఉంటుందో, నాలాంటి అమ్మాయి గురించి కామెంట్ చేస్తే, మా కుటుంబ సభ్యులకు అంతే బాధ ఉంటుందని ఆక్రోశం గా చెప్పింది వర్ష.
తనపై వస్తున్న దారుణమైన కామెంట్స్, ట్రోలింగ్స్ కుటుంబ సభ్యులను బాధపెడుతున్నాయని, అలా చేయవద్దని ఆమె రిక్వెస్ట్ చేశారు. జబర్దస్త్ నుండి తప్పుకోవాలన్న నిర్ణయం వెనుక కారణం ఇదే అన్నట్లు వర్ష వివరణ ఇచ్చారు.
వర్ష, ఇమ్మానియేల్ లవ్ ట్రాక్ పై చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. కాని కెరీర్ కోసం, ఆఫర్స్ కోసం బుల్లితెరపై నటులు వేసే స్కిట్స్, చెప్పే మాటలు, కామెడీ డైలాగ్స్, రొమాన్స్ చాలా సందర్భాల్లో ట్రోలింగ్ కి గురవుతుంది.