MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కార్తీకదీపంలో షాకింగ్ ట్విస్ట్.. వంటలక్కకు యాక్సిడెంట్, పార్టీ చేసుకుంటున్న మోనిత?

కార్తీకదీపంలో షాకింగ్ ట్విస్ట్.. వంటలక్కకు యాక్సిడెంట్, పార్టీ చేసుకుంటున్న మోనిత?

బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ కు బుల్లితెర ప్రేక్షకులు బాగా అలవాటుపడ్డారు. ఈ సీరియల్ తమకు అభిమానం సీరియల్ గా మారింది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏమిటో చూద్దాం. 

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Oct 07 2021, 10:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ కు బుల్లితెర ప్రేక్షకులు బాగా అలవాటుపడ్డారు. ఈ సీరియల్ తమకు అభిమానం సీరియల్ గా మారింది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏమిటో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

 హిమ ఇంటికి వెళ్లకుండా ఓ దగ్గర కూర్చొని హాస్పిటల్ లో మోనిత అన్న మాటలు తలుచుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది. తన తండ్రి అబద్ధాలు చెబుతాడని అసలు అనుకోలేదు అంటూ బాధపడుతుంది.
 

310

దీప సౌందర్య దగ్గరికి వచ్చి పిల్లలు పేపర్ చదివిన విషయాన్ని చెప్పడంతో సౌందర్య షాక్ అవుతుంది. పిల్లలకు చాలా దాచిపెట్టాము అని ఇక అబద్ధాలను చెప్పలేము అంటూ మాట్లాడుతుంది.
 

410

 ఇక దీప తనను సౌర్య అన్న మాటలను సౌందర్యతో చెప్పుకుంటూ బాగా కుమిలిపోతుంది. నిజాలు చెప్పలేము అంటూ అబద్దాలు పెంచలేమూ అంటూ బాగా బాధపడుతుంది. సౌర్యకు అసలు నిజం చెబుదామని సౌందర్య అంటుంది.
 

510

మరోవైపు పోలీస్ స్టేషన్ లో మోనిత కార్తీక్ ను కలిసినందుకు బాగా సంతోషపడుతుంది. ఇక సుకన్య వచ్చి తన సంతోషాన్ని పంచుకోగా ఇద్దరు కలిసి సోడా పార్టీ చేసుకుంటారు.
 

610

సౌందర్య సౌర్య తో కార్తీక్ గురించి నిజం చెప్పడానికి ప్రయత్నిస్తోంది. కానీ సౌర్య మాత్రం సౌందర్య మాటలను అస్సలు లెక్క చెయ్యదు. సౌందర్య మాత్రం పేపర్లో అది అబద్ధం అని చెప్పి సౌర్యకు నచ్చచెప్పుతుంది.
 

710

అంతలోనే ఆదిత్య, శ్రావ్య హిమను తీసుకొస్తారు. ఇక హిమ తల నొప్పి వచ్చింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీప ఏమైంది అని సౌందర్యను ప్రశ్నిస్తుంది.
 

810

 వెంటనే ఆదిత్య పిల్లలకు ఇటువంటి విషయాలు ముందే చెప్పాలి అంటూ కాస్త క్లాస్ పీకుతాడు. ముందే పేపర్ చూపించి ఇదంతా అబద్ధం అని చెబితే ఇదంతా  జరగదు కదా అని హెచ్చరిస్తాడు.
 

910

 మరోవైపు హిమ హాస్పిటల్ లో మోనిత కార్తీక్ తో మాట్లాడిన మాటలు అన్నీ సౌర్య తో చెబుతుంది. సౌర్య వాళ్ళు ఫ్రెండ్స్ కదా అందుకే మాట్లాడుకున్నారో ఏమో అని అనేసరికి కాదు అంటూ వాళ్ళు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని తెలుపుతుంది.
 

1010

 తరువాయి భాగంలో కార్తీక్ పుట్టినరోజు గురించి మాట్లాడుకుంటారు పిల్లలిద్దరూ. ఇక కార్తీక్ తో మాట్లాడకుండా పిల్లలు సైలెంట్ గా ఉండి పోతారు. మరోవైపు దీపకు యాక్సిడెంట్ జరిగినట్లు చూపిస్తారు. మొత్తానికి మరో ట్విస్ట్ వచ్చి పడింది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Drishyam 3: 9 రోజుల్లో 200 కోట్లు.. బాక్సాఫీస్ ను మాయచేసిన మోహన్ లాల్..
Recommended image2
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేసిన తప్పు, అందులో అలీ కూడా భాగస్వామే..నిలదీసిన సీనియర్ నటుడు
Recommended image3
Mokshagna: మోక్షజ్ఞ కోసం రంగంలోకి నారా లోకేష్, బాలకృష్ణ వల్ల కూడా కాలేదా? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved