ఇది జస్ట్ బ్రేక్ ఫాస్ట్, ఫుల్ మీల్ అదిరిపోతుంది.. వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ వేడుకలో దిల్ రాజు

First Published Mar 29, 2021, 9:16 PM IST


'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్" ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం అభిమానుల సందడి మధ్య జరిగింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు రెండు తెలుగు రాష్ట్రల్లోని ప్రధాన సెంటర్ల థియేటర్లలో "వకీల్ సాబ్" సినిమా ట్రైలర్ విడుదల జరిగింది. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాణా సంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. జై పవన్ కళ్యాణ్ అనే నినాదాలు మార్మోగాయి.