- Home
- Entertainment
- Kriti Shetty Photos : ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి హోలీ విషెస్.. ఆరెంజ్ డ్రెస్ లో ఎగిరి గంతులేస్తూ..
Kriti Shetty Photos : ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి హోలీ విషెస్.. ఆరెంజ్ డ్రెస్ లో ఎగిరి గంతులేస్తూ..
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కృతి శెట్టి (Kriti Shetty) హోలీ డేను తన గ్లామర్ తో మరింత రంగుల మయంగా చేస్తోంది. తాజాగా తను పోస్ట్ చేసిన ఫొటోల్లో ఫుల్ జోష్ లో కనిపిస్తోందీ కుర్ర హీరోయిన్.

పంజా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) నటించిన ‘ఉప్పెన’ మూవీతో తెలుగు ఆడియెన్స్ కు ఆడియెన్స్ గుండెల్ని కొల్లగొట్టిందీ కుర్ర హీరోయిన్ కృతి శెట్టి. అంతకు ముందు హిందీలో హ్రుతిక్ రోషన్ నటించిన ‘సూపర్ 30’ హిందీ చిత్రంలో స్టూడెంట్ పాత్రను పోషింది.
కృతి శెట్టి తన కేరీర్ ఇలా స్టార్ చేసిందో లేదో... అలా పెద్ద సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. Uppena మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తొలిసినిమాతోనే తన నటన, గ్లామర్ తో ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసింది.
రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ గా డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన గతేడాది రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంది. వైష్ణవ్ తేజ్ కు కూడా ఈ సినిమా తొలిచిత్రం కావడం, మెగా ఫ్యామిలీ నుంచి ఆడియెన్స్ పరిచయడం అవుతుండటంతో దర్శక, నిర్మాతలు చాలా కేర్ తీసుకున్నారు. అందుకు ఊహించిన రేంజ్ లో రిజల్ట్ వచ్చింది.
అయితే ఉప్పెనతో వైష్ణవ్ తేజ్ కు ఎంత పేరొచ్చిందో.. అంతకు రెండింతల ఫేమ్ ను కృతి శెట్టి దక్కించుకుంది. ఆ మూవీలో నటించి మెప్పించిన ఈ హీరోయిన్.. పేరు గతేడాది నుంచి ఇప్పటికీ హాట్ టాపిక్ గానే నిలుస్తోంది. అదే రేంజ్ లో వరుస ఆఫర్లను అందిపుంచుకుంటోంది.
మరోవైపు, సోషల్ మీడియాలోనూ కృతి శెట్టికి మామూలు ఫాలోయింగ్ లేదు. రెండున్నర మిలియన్ల ఫాలోవర్స్ తో ఇన్ స్టాలో ఈ అమ్మడు చేసే హంగామా అంతా ఇంతా కాదు. కృతి శెట్టి పోస్ట్ చేసిన ఫొటోలకు గంటలోనే లక్షకుపైగా లైక్స్ వచ్చాయి. అయితే హోలీ సందర్భంగా కృతి శెట్టి పలు ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది.
హోలీ సందర్భంగా పోస్ట్ చేసిన ఈ ఫొటోల్లో కృతి శెట్టి ఆరెంజ్ డ్రెస్ లో ఫుల్ జోష్ లో కనిపిస్తోంది. సందడిచేస్తూ.. ఫొటోలకు మందహాసంతో ఫోజులు ఇచ్చిందది. తన అభిమానులకు ‘హోలీ శుభాకాంక్షలు’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. కృతి ప్రస్తుతం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం’ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.