- Home
- Entertainment
- Ghani: ఉపేంద్రకి మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ మిస్.. అసలేం జరిగిందంటే
Ghani: ఉపేంద్రకి మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ మిస్.. అసలేం జరిగిందంటే
డెబ్యూ దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన చితం 'గని'. ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ ఎంతో కష్టపడుతున్నాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో తన మేకోవర్ మార్చుకుని ఈ చిత్రంలో నటించాడు.

Upendra
డెబ్యూ దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన చితం 'గని'. ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ ఎంతో కష్టపడుతున్నాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో తన మేకోవర్ మార్చుకుని ఈ చిత్రంలో నటించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. శుక్రవారం రోజు ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
Upendra
అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ ఈ చిత్రానికి నిర్మాత. బాలీవుడ్ యంగ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడిగా నటిస్తోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో, తెలుగువారికి సుపరిచయమైన ఉపేంద్ర నటించారు.
Upendra
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఉపేంద్ర మెగా ఫ్యామిలీతో తనకున్న రిలేషన్ రివీల్ చేశారు. గత 24 ఏళ్లుగా నేను తెలుగువారందరికీ బాగా తెలుసు. హీరో రాజశేఖర్ తో దాదాపు పాతికేళ్ల క్రితం 'ఓంకారం' అనే సినిమా డైరెక్ట్ చేశాను. ఆ సమయంలో చిరంజీవిగారిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఆ చిత్రానికి అశ్వినీదత్ గారు నిర్మాత. కానీ నేను ఆ చిత్రాన్ని చేయలేకపోయాను. చిరంజీవిగారిని డైరెక్ట్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నాను.
Upendra
ఆ సినిమా చేయలేకపోయినందుకు ఇప్పటికి బాధపడుతుంటాను. ఆ తర్వాత ఒక్కమాట చిత్రంలో వరుణ్ తేజ్ ఫాదర్ నాగబాబు గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. కొన్నేళ్ల క్రితం అల్లు అర్జున్ చిత్రం సన్నాఫ్ సత్యమూర్తిలో కీలక పాత్రలో నటించాను.
Ghani
మెగా ఫ్యామిలీ ఇన్ని గార్లు తెలుగు ప్రేక్షకులకు నన్ను పరిచయం చేస్తూనే ఉంది. ఉపేంద్ర నటుడిగా మాత్రమే కాక రచయితగా, దర్శకుడిగా కూడా సత్తా చాటారు. ఉపేంద్ర నటన, ఆయన సినిమాలు విలక్షణంగా ఉంటాయి.
Ghani
ఉపేంద్ర వరుణ్ తేజ్ బాడీ ట్రాన్స్ఫర్ మేషన్ గురించి ప్రశంసలు కురిపించారు. వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ చిత్రం చూశాను. ఆ సినిమాలో వరుణ్ తేజ్ కి.. ఇప్పుడు చూస్తున్న వరుణ్ తేజ్ అసలు సంబంధం లేదు అన్నట్లుగా అనిపిస్తోంది. అద్భుతమైన మేకోవర్ అంటూ ఉపేంద్ర ప్రశంసించారు.