మగధీర: ఈ కథ మొదట ఏ హీరోకు చెప్పారో తెలిస్తే మతిపోతుంది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిన మగధీర సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు. ఈ సినిమా కథ మొదట సూపర్ స్టార్ కృష్ణ కోసం రాశారని, ఆ తర్వాత రామ్ చరణ్ కు ఎలా వచ్చిందో తెలుసుకోండి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచి, అభిమానులు ఎప్పటికప్పుడూ హాట్ టాపిక్ గా మాట్లాడుకునే సినిమా మగధీర. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కెరీర్ లో రెండో సినిమాగా వచ్చిన మగధీర అప్పట్లో భారీ విజయం సాధించి ఇండస్ట్రీ హిట్ కొట్టింది.
రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమా 40 కోట్లతో తెరకెక్కగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. రెండో సినిమాతోనే చరణ్ ఇండస్ట్రీ హిట్ కొట్టి అప్పట్లో సంచలనం సృష్టించాడు.
ఇక రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ 15 ఏళ్ల కిందటే రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లతో టాలీవుడ్ రికార్డులను తిరగరాసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మధ్యే చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ 4కే వెర్షన్ థియేటర్లలో రిలీజ్ చేసారు కూడా.
అంతేకాదు ఇప్పుడదే క్వాలిటీతో ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమా కథ మొదట వేరే హీరోకు చెప్పారు. అప్పుడు ఆ హీరో ఒప్పుకుని చేసి ఉంటే రామ్ చరణ్ కు ఈ కథ ఉండేది కాదు. ఎంతకీ ఎవరా హీరో...అలాగే ఈ సినిమా కథకు కూడా ప్రేరణ ఉంది..అదేంటో చూద్దాం.
Magadheera
ఈ సినిమా కథను ఓ మరాఠి సినిమా చూసి రాసుకున్నారు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్. అయితే ఆ కథను సూపర్ స్టార్ కృష్ణ హీరోగా చేద్దామని ఆలోచన. అప్పట్లో దర్శకుడు సాగర్ డైరక్షన్ లో 'జగదేకవీరుడు' సినిమా ప్లానింగ్ జరుగుతోంది.
దీనికి విజయేంద్ర ప్రసాద్ కథ ఇవ్వటానికి ప్లాన్ చేసారు. ఆయన కొడుకు రాజమౌళి స్టోరీ అసిస్టెంట్. స్టోరీ లైన్ గా నచ్చినా స్క్రిప్టుగా దర్శక నిర్మాతలకు నచ్చలేదు. దాంతో ఇంకో రైటర్ ఆ సినిమాలోకి వచ్చారచు. అయితే ఆ కథకు పని చేసిన రాజమౌళిని మాత్రం ఈ కథ హాంట్ చేస్తూనే ఉంది.
first 100 crore club movie in telugu is Magadheera directed by ss rajamouli
ఆ తర్వాత రాజమౌళికి ...రామ్ చరణ్ ని లాంచ్ చేసే ఆఫర్ వచ్చింది. చిరంజీవి, అల్లు అరవింద్, రామ్ చరణ్ లతో రాజమౌళి మీటింగ్ అయ్యింది. అయితే రామ్ చరణ్ ని లాంచ్ చేయటం రాజమౌళికి ఇష్టం లేదు. అదే చెప్పేసారు. "సారీ సర్! చరణ్ లాంచింగ్ ప్రాజెక్ట్ చేయలేను. మీ అబ్బాయి ఫస్ట్ సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉంటాయి.
నేను ఎంతవరకు నెరవేర్చ గలనో చెప్పలేను. సెకండ్ సినిమా అయితే ఓకే” అని చెప్పేశాడు రాజమౌళి. ఆ తర్వాత రామ్ చరణ్ ఫస్ట్ సినిమా 'చిరుత' పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తయారైంది. హండ్రడ్ డేస్ ఫిల్మ్. మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. ఇప్పుడు చరణ్ సెకండ్ ఫిల్మ్ రాజమౌళి దగ్గరకు వచ్చింది. అప్పుడీ కథ గుర్తు వచ్చింది. అంతే లైన్ చెప్పి ఓకే చేయించి, మార్పులు చేర్పులతో స్క్రిప్టు రెడీ చేసారు.
ఇంతకీ ఈ కథ కు మూలం ఏమిటి అంటే... శివాజీ నిజ జీవిత కథతో తయారైన ఓ మరాఠీ సినిమాలోని ఓ ఎపిసోడ్. శివాజీ, తానాజీ అడవి దారిలో వెళ్తూంటే...అకస్మాత్తుగా వాళ్ళపై మొఘలాయి సైన్యం దాడి చేసింది. అందుకు కొంచెం దగ్గర్లోనే సింహఢ్ కోట. అక్కడకు వెళ్లగలిగితే ఫిరంగులతో సైన్యాన్ని పేల్చిపారేయొచ్చు.
అందుకే తానాజీ ఒంటరిగా సైన్యాన్ని ఎదుర్కొంటూ, శివాజీని కోటలోకి పంపించాడు. ఇక్కడ తానాజీ 'ఒకటీ... రెండూ... మూడు' అని లెక్కపెడుతూ, శత్రువుల్ని వరుసపెట్టి నరికేసి, తానూ చనిపోయాడు. అప్పుడు శివాజీ వచ్చి, 'గఢ్ మిల్గియా, మగర్ సింహ్ చలాగయా' అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఎపిసోడ్ చుట్టూనే విజయేంద్రప్రసాద్ కథ రాసారు.
Rajamouli
కృష్ణకి చెప్పిన కథ ఏమిటంటే... ఓ రాజమాత. ఆమెను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడే ఓ బాడీగార్డ్. రాజమాతపై ఓ వందమంది యోధులు ఎటాక్ చేస్తే, ఎదురొడ్డి పోరాడి, అమరుడు అయ్యాడు బాడీగార్డ్. మళ్లీ 400 ఏళ్ల తర్వాత పుట్టాడు.
రాజమాత కూడా మళ్లీ పుట్టింది. మేధా పాట్కర్ లాంటి సోషల్ వర్కర్లా ఎదిగిన ఆమె ముఖ్యమంత్రి కావడం కోసం బాడీగార్డ్ ఎంతో పోరాడి, ఆమె లక్ష్యాన్ని నెరవేరుస్తాడు. క్లుప్తంగా ఇదీ కథ. అయితే బడ్జెట్, అప్పటి పరిస్దితులు లెక్కేసి నో చెప్పేసారు. దాంతో ఈ కథ రామ్ చరణ్ దగ్గరకు వచ్చి ఆగింది.
ఇక ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లో రాజమౌళి క్రేజ్ మరో స్థాయికి చేరింది. ఆ తర్వాత అతడు తీసిన ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు టాలీవుడ్ నుంచి అతన్ని గ్లోబల్ లెవల్ కు తీసుకెళ్లాయి. మగధీర తొలిసారి రిలీజైనప్పుడు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.
రీసెంట్ గా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రీరిలీజ్ చేస్తే మరోసారి అలాంటి రికార్డులే క్రియేట్ చేస్తుందని భావించారు. కానీ ఊహించని విధంగా ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. రీరిలీజ్ లో అసలు ఈ మూవీ చూసేవారే కరవయ్యారు. అక్కడక్కడా కొన్ని ఫ్యాన్స్ షోలు తప్ప మిగతా అన్ని చోట్లా థియేటర్లు ఖాళీగా దర్శనమిచ్చాయి.
మగధీర (2009)
రామ్ చరణ్ తాజా సినిమాల విషయానికి వస్తే అతడు నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి 2025 న రిలీజ్ కానుంది. ఈ చిత్రం తర్వాత బుచ్చిబాబుతో ఆర్సీ16, సుకుమార్ తో ఆర్సీ17 మూవీస్ ను చరణ్ చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత రెండేళ్లుగా చరణ్ నటించిన పూర్తి స్థాయి సినిమా మరొకటి రాలేదు. ఇప్పుడీ రెండు చిత్రాలపైనే మెగాభిమానులు ఆశలు పెట్టుకున్నారు.మధ్యలో ఎలాగో చిరంజీవి విశ్వంభర ఉండనే ఉంది.