- Home
- Entertainment
- TV
- విష్ణు ప్రియ డీప్ ఫేక్ వీడియో వైరల్, సూసైడ్ చేసుకోబోయిన స్టార్ యాంకర్ ను కాపాడింది ఎవరు?
విష్ణు ప్రియ డీప్ ఫేక్ వీడియో వైరల్, సూసైడ్ చేసుకోబోయిన స్టార్ యాంకర్ ను కాపాడింది ఎవరు?
స్టార్ యాంకర్ విష్ణు ప్రియ సూసైడ్ చేసుకోవాలి అనుకుందా? ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న స్టార్ యాంకర్ ను కాపాడింది ఎవరు? ఆమె నిర్ణయం వెనుక కారణాలు ఏంటి? విష్ణు అనుభవించిన మానసిక వేదనకు కారణం ఎవరు?

టాలీవుడ్ స్టార్ యాంకర్
టాలీవుడ్‌లో ఎంతో మంది యాంకర్స్ ఉన్నారు. కానీ అందులో స్టార్ యాంకర్స్ గా కొంత మంది మాత్రమే పేరు తెచ్చుకున్నారు. పదుల సంఖ్యలు యాంకర్స్ ఉన్నా.. ఆడియన్స్ దృష్టిలో పడింది మాత్రం కోందరే.. వారిలో విష్ణు ప్రియ కూడా ఒకరు. యాంకర్ గా స్టార్ డమ్ ను చూసిన ఈ బ్యూటీ.. సుడిగాలి సుధీర్‌తో చేసిన పోవే పోరా గేమ్ షో ద్వారా పాపులర్ అయ్యింది. ఈ షో ద్వారా విష్ణు ప్రియకు ఫ్యాన్స్ భారీగా పెరిగిపోయారు. ఈ ఇమేజ్ ఆమెను బిగ్ బాస్ వైపు నడిపించింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో అవకాశం రాగా.. అక్కడ కూడా తన మార్క్ చూపించింది విష్ణు ప్రియ.
బిగ్ బాస్ లో లవ్ ట్రాక్ ..
బిగ్ బాస్ లో పృధ్విరాజ్ తో లవ్ ట్రాక్ నడిపి.. ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ అందించింది విష్ణు.. ఈ విషయంలో విమర్షలు కూడా ఫేస్ చేసింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత పెద్దగా ఫామ్ లో లేదు విష్ణు ప్రియ. ఆమెకు అవకాశాలు కూడా తగ్గాయనే చెప్పాలి. అప్పుడప్పుడు స్పెషల్ ప్రోగ్రామ్స్ లో మాత్రం కానిపిస్తోంది. కొన్ని ఇంటర్వ్యూలలో అలా మెరిసి మాయమైపోయింది. ఇక రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన మనసులో మాటలు బయటపెట్టింది. తన జీవితంలో అత్యంత బాధాకరమైన అనుభవాన్ని ఆడియన్స్ ను షేర్ చేసుకుంది విష్ణు ప్రియ.
వైరల్ అయిన ఫేక్ వీడియో
టీవీ షోలు ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ముఖ్యంగా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. కానీ ఈ సక్సెస్ వెనుక చాలా కష్టాలు, మానసిక ఒత్తిడి ఉన్నాయని విష్ణు ప్రియ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. “చాలా రోజుల క్రితం నా మార్ఫింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది చాలా వల్గర్ గా ఉంది. ఆ వీడియోను నాకు కూడా వాట్సాప్‌లో పంపారు. చూసి షాక్ అయ్యాను. ఏం చేయాలో అర్ధం కాలేదు. చాలా మంది అది నిజం అని, అందులో ఉన్నది నేనే అనుకున్నారు. నేను చెప్పినా కూడా కొంత మంది నమ్మలేదు. సరిగ్గా అదే టైమ్ లో నా ఫేస్‌బుక్ అకౌంట్ కూడా హ్యాక్ అయ్యింది. ఆ వీడియోలు అందులో కూడా షేర్ అయ్యాయి". అని విష్ణు ప్రియ బాధపడ్డారు.
సూసైడ్ చేసుకోవాలనుకున్న విష్ణు ప్రియ
విష్ణు ప్రియ మాట్లాడుతూ.. " ఫేస్ బుక్ లో వైరల్ అయిన వీడియోలు మా తాతయ్య చూసి మా అమ్మమ్మకు కాల్ చేసి మాట్లాడారు.. ‘విష్ణు ఏంటి ఇవి పోస్ట్ చేసింది?’ అని అడిగాడు. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుంది, ఏం చేయాలో అర్ధం కాలేదు.. నేను బయటికి వెళ్తే చాలా మంది ఒక రకంగా చూడటం స్టార్ట్ చేశారు, నా ముందు ఆ వీడియో గురించి మాట్లాడేవారు. కొంత మంది వచ్చిన నన్నే నేరుగా ఆ వీడియోల గురించి అడిగేవారు. ఆ సమయంలో నేను అనుభవించిన నరకం.. అంతా ఇంతా కాదు, చాలా బాధేసింది. నిజంగా సూసైడ్ చేసుకుందాం అనిపించింది. కానీ అమ్మ ఇచ్చిన ధైర్యం వల్లనే నేను బతికాను. లేదంటే ఎప్పుడు చనిపోయేదాన్ని,” అని కన్నీళ్లు పెట్టుకుంది విష్ణు ప్రియ.
నెటిజన్ల ఓదార్పు
విష్ణు ప్రియ బాధపడుతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడంతో నెటిజన్లు కరిగిపోతున్నారు.. స్టార్ యాంకర్ ను ఓదార్చుతూ ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. రకరకాలుగా సపోర్ట్ చేస్తూ.. అభిమానులు స్పందిస్తున్నారు. మానసికంగా కృంగిపోయినప్పుడు తల్లీ తండ్రుల సపోర్ట్ ఎంత అవసరం అవుతుందనే విషయం.. విష్ణు ప్రియ సంఘటనతో చాలామందికి అర్ధం అవుతోంది.