- Home
- Entertainment
- TV
- రజినీకాంత్ మూవీనే రిజెక్ట్ చేసిన రాజమౌళి, స్టార్ డైరెక్టర్ ఎందుకలా చేశాడు? కారణం ఏంటి?
రజినీకాంత్ మూవీనే రిజెక్ట్ చేసిన రాజమౌళి, స్టార్ డైరెక్టర్ ఎందుకలా చేశాడు? కారణం ఏంటి?
సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేయాలని చాలామంది దర్శకులు ప్రయత్నిస్తుంటారు. వారిలో కొంతమంది రిజెక్ట్ అయిన వారు ఉండొచ్చు. కానీ రజినీకాంత్ నే రిజెక్ట్ చేసిన దర్శకుడు ఎవరో తెలుసా?

భారతదేశం గర్వించ దగ్గ నటుడు
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా రజినీకాంత్ స్థానం చాలా ప్రత్యేకం. ఆయన సినిమాలకు తమిళం, తెలుగు, సౌత్‌లో మాత్రమే కాకుండా, బాలీవుడ్, ఓవర్సీస్ లో కూడా భారీ డిమాండ్ ఉంది. మరీ ముఖ్యంగా జపాన్ లాంటి దేశాల్లో రజినీకాంత్ సినిమాలు భారీగా ఆదరణ పొందుతాయి. 74 ఏళ్ళ వయస్సులో ఇప్పటికీ మార్కెట్ ను శాసించగల సత్తా ఉన్న నటుడు రజినీకాంత్. ఆయన రేంజ్ లో మరో హీరో ఇంత ఇమేజ్ ను సాధించలేదని చెప్పాలి. ఏడు పదులు దాటినా.. కుర్రా హీరోలకు పోటీ ఇస్తూ.. ఫిట్ నెస్ ను మెయింటేన్ చేస్తున్నారు రజినీకాంత్.
రజినీకాంత్ తో సినిమా ఒక కల
సూపర్ స్టార్ లాంటి స్థాయి హీరోతో సినిమా చేయడం ప్రతి స్టార్ దర్శకుడి కల. ఎందుకంటే రజినీకాంత్ సినిమాకు ఏ దర్శకుడు హ్యాండిల్ చేసినా, బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగులేని విజయం ఖాయం.. సక్సెస్ లేకపోయినా.. ఆసినిమా ప్లాప్ అయినా సరే.. దర్శకుడిగా ఇండస్ట్రీలో అతని ఇమేజ్ మాత్రం గట్టిగానే పెరుగుతుంది. అలా రజినీకాంత్ తో సినిమా కోసం చాలామంది దర్శకులు ఎదరుచూస్తుంటారు. సూపర్ స్టార్ 50 ఏళ్ళ కెరీర్ లో రజినీకాంత్ రిజెక్ట్ చేసిన దర్శకులే కానీ.. రజినీని రిజెక్ట్ చేసిన దర్శఖులు లేదు.. కానీ స్టార్ డైరెక్టర్ రాజమౌళి మాత్రం రజినీకాంత్ తో సినిమా చేసే అవకాశాన్ని స్వయంగా తిరస్కరించాడట. దానికి కారణం ఏంటో తెలుసా?
దైర్యం చేయలేకపోయిన రాజమౌళి
మగధీర లాంటి సెన్సేషనల్ హిట్ సినిమా తరువాత రాజమౌళికి రజినీకాంత్‌తో సినిమా చేసే అవకాశం వచ్చిందట. అంతే కాదు ఆ సినిమాను నిర్మించేందుకు సన్ పిక్చర్స్ సంస్థ ముందుకొచ్చింది. అయితే, ఈ ప్రతిపాదన విన్న రాజమౌళి మాత్రం చాలా ఆశ్చర్యపోయాడట. కాసేపటికి తేరుకుని.. ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట. రజినీకాంత్ స్థాయి హీరోతో సినిమా చేయాలంటే.. ఆ అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. సినిమాను ఎంత బాగా తీసినా.. ఇంకాస్త బాగా తీస్తే బాగుండు అని ఫ్యాన్స్ కు అనిపించే అవకాశం ఉంది.. అని రాజమైళి ఆలోచనలో పడ్డాడట. అందుకే ఆ సమయంలో ఆ ప్రాజెక్ట్ చేయడానికి తనకు ధైర్యం లేదని.. రాజమౌళి నేరుగా సన్ పిక్చర్స్‌కి తెలిపాడట.
ప్రస్తుతం రాజమౌళి రేంజ్ వేరు..
పెద్ద అంచనాల నుంచి బయటపడటానికి రాజమౌళి కొన్ని చిన్న సినిమాలు కూడా చేశారు. ‘మర్యాద రామన్న’ వంటి చిన్న కథా నేపథ్యంలో సినిమా తెరకెక్కించాడు. ఆ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అయ్యింది.తర్వాత ‘ఈగ’ సినిమాతో రాజమౌళి తన ప్రతిభను మరోసారి నిరూపించాడు. ఆ సినిమా విజయంతో ఆయనలో ఒక నమ్మకం ఏర్పడింది పెద్ద రిస్క్ తీసుకున్నా, తన క్రియేటివిటీతో హ్యాండిల్ చేయగలనన్న విశ్వాసం వచ్చింది.అదే విశ్వాసంతో ఆయన సినిమా చరిత్రలో నిలిచిపోయే ‘బాహుబలి’ సిరీస్ ను రూపొందించాడు. ఆ సినిమా సాధించిన విజయం జక్కన్నను ఎక్కడ నిలబెట్టిందో అందరికి తెలిసిందే.