MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • TV
  • రామ్ చరణ్ కు సెంటిమెంట్ గా కలిసి రాని గ్లోబల్ స్టార్ ఇమేజ్, మళ్లీ మెగా పవర్ స్టార్ గా మారిన చెర్రీ..

రామ్ చరణ్ కు సెంటిమెంట్ గా కలిసి రాని గ్లోబల్ స్టార్ ఇమేజ్, మళ్లీ మెగా పవర్ స్టార్ గా మారిన చెర్రీ..

రామ్ చరణ్ ఇక నుంచి గ్లోబల్ స్టార్ కాదు.. మళ్లీ పాత మెగా పవర్ స్టార్ గా మారిపోయాడు. ఈ మార్పుకు కారణం ఏంటి? గ్లోబల్ స్టార్ ఇమేజ్ సెంటిమెంట్ గా కలిసిరాలేదా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 04 2025, 04:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గ్లోబల్ స్టార్ ఇమేజ్..
Image Credit : Asianet News

గ్లోబల్ స్టార్ ఇమేజ్..

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో అటు జూనియర్ ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ హీరోలుగా పాన్ వరల్డ్ గుర్తింపులు సాధించారు. మరో వైపు దర్శకుడు రాజమౌళి కూడా హాలీవుడ్ రేంజ్ లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాతో ఇద్దరు హీరోల ఇమేజ్ కంప్లీట్ గా మారిపోయింది. అంతే కాదు వారి ట్యాగ్ లైన్ లు కూడా మార్చేశారు. ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ ను ఆయన అభిమానులు “మ్యాన్ ఆఫ్ ది మాస్సెస్” అని పిలుస్తుండగా, రామ్ చరణ్ అభిమానులు మాత్రం “గ్లోబల్ స్టార్” అనే కొత్త బిరుదును చరణ్ కు అందించారు. ఈ ట్యాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవ్వడంతో, దర్శకులు, నిర్మాతలు కూడా రామ్ చరణ్ పేరుకు ముందు అధికారికంగా “గ్లోబల్ స్టార్” ట్యాగ్‌ను వాడడం ప్రారంభించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గతంలో మెగా పవర్ స్టార్
Image Credit : Asianet News

గతంలో మెగా పవర్ స్టార్

రామ్ చరణ్ హీరోగా... వరుస సక్సెస్ లు కొడుతున్న టైమ్ లో.. మెగా ప్యాన్స్ ఆయనకు మెగా పవర్ స్టార్ అనే బిరుదు ఇచ్చారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తరువాత మెగా ఫ్యామిలీలో ఆ రేంజ్ హీరోగా రామ్ చరణ్ ఎదుగుతుండటంతో.. చిరంజీవి మెగా స్టార్ లో మెగాను.. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ లో పవర్ ను చేర్చి..మెగా పవర్ స్టార్ గా రామ్ చరణ్ ను పిలుచుకున్నారు ఫ్యాన్స్. నిజానికి ఈ ట్యాగ్ రామ్ చరణ్ కు బాగా కలిసి వచ్చింది. ఈ బిరుదుతో చరణ్ ఎన్నో హిట్లు కొట్టాడు. పాన్ ఇండియా హీరోగా మారాడు.. ఆస్కార్ రేంజ్ కు వెళ్లాడు. మగధీర, ఆర్ఆర్ఆర్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలను మెగా పవర్ స్టార్ ట్యాగ్ తోనే సాధించాడు.

Related Articles

Related image1
150 కోట్ల ఇల్లున్న సౌత్ స్టార్ హీరో ఎవరు? కాస్ట్లీ హౌస్ ఉన్న స్టార్స్ లో.. తెలుగు హీరోలదే హవా
Related image2
50 దేశాల్లో రిలీజైన కృష్ణ సినిమా, ఫస్ట్ పాన్ వరల్డ్ తెలుగు కౌబాయ్ మూవీగా మోసగాళ్లకు మోసగాడు రికార్డ్
35
కలిసిరాని గ్లోబల్ స్టార్ ఇమేజ్
Image Credit : Instagram

కలిసిరాని గ్లోబల్ స్టార్ ఇమేజ్

అయితే గ్లోబల్ స్టార్ ఇహేజ్ ట్యాగ్ మాత్రం రామ్ చరణ్‌కు అస్సలు కలిసిరాలేదు. ఆయన అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. అంతే కాదు గ్లోబల్ స్టార్ ఇమేజ్ పై ఎన్నో విమర్శలు కూడా ఫేస్ చేశాడు చరణ్. ఇండియాలో ఎంతో మంది సీనియర్ స్టార్ హీరోలు ఉన్నప్పుడు.. వాళ్లందరికంటే జూనియర్ అయిన రామ్ చరణ్‌ ఒక్కడిని “గ్లోబల్ స్టార్”గా పిలవడం ఎంత వరకు సరైందని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అంతే కాదు గ్లోబల్ స్టార్ ట్యాగ్ తో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ డిజాస్టర్ అవ్వడంతో.. అందరి నుంచి గ్లోబల్ స్టార్ ట్యాగ్ పై నెగెటీవ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దాంతో అసలు కలిసిరాని ఈ ట్యాగ్ ఎందుకు అనుకున్నాడో ఏమో.. చరణ్ గ్లోబల్ స్టార్ ట్యాగ్ ను పీకి పడేశాడు.

45
పెద్ది పోస్టర్ తో మార్పు మొదలు..
Image Credit : instagram /buchi babu sana

పెద్ది పోస్టర్ తో మార్పు మొదలు..

టాలీవుడ్ సమాచారం ప్రకారం, సన్నిహితుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఇమేజ్ నుంచి బయటపడ్డాడు. చెర్రీ తాజా మూవీ పెద్ది సినిమా లో గ్లోబల్ స్టార్ ట్యాగ్‌ను పూర్తిగా తీసేసాడు. రీసెంట్‌గా పెద్ది నుంచి హీరోయిన్ జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్ అయ్యింది. ఇందులో “మెగా పవర్ స్టార్ రామ్ చరణ్” అని స్పష్టంగా రాసి ఉంది. దాంతో ఆయన గ్లోబల్ స్టార్ ట్యాగ్ కు గుడ్ బై చెప్పినట్టు అర్ధం అవుతోంది. అభిమానుల్లో కూడా చరణ్ ను మెగా పవర్ స్టార్ అనే పిలుచుకోవాలి అని ఉంది. రామ్ చరణ్ మళ్లీ తన ఒరిజినల్ ఐడెంటిటీతో రీఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

55
పెద్ది సినిమా విశేషాలు
Image Credit : Social Media

పెద్ది సినిమా విశేషాలు

రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ ఒక స్పోర్ట్స్ డ్రామా జానర్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లోనూ, ఫ్యాన్స్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 6న మొదటి లిరికల్ సాంగ్ రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చినా, తాజా సమాచారం ప్రకారం ఆ సాంగ్ విడుదల వాయిదా పడినట్టు తెలుస్తోంది. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా కథను సుకుమార్ అందించారు. పెద్ది తరువాత సుకుమార్ తోనే మరో సినిమా చేయబోతున్నాడు మెగా పవర్ స్టార్.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Related Stories
Recommended image1
150 కోట్ల ఇల్లున్న సౌత్ స్టార్ హీరో ఎవరు? కాస్ట్లీ హౌస్ ఉన్న స్టార్స్ లో.. తెలుగు హీరోలదే హవా
Recommended image2
50 దేశాల్లో రిలీజైన కృష్ణ సినిమా, ఫస్ట్ పాన్ వరల్డ్ తెలుగు కౌబాయ్ మూవీగా మోసగాళ్లకు మోసగాడు రికార్డ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved