50 సెకన్లకు 5 కోట్లు.. స్టార్ హీరోలకు కూడా షాకిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది నయనతార.. ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా గుర్తింపు ఉన్న లేడీ సూపర్ స్టార్ 50 సెకన్ల యాడ్‌లో నటించడానికి 5 కోట్లు తీసుకుని షాక్ ఇచ్చారు.

20 ఏళ్లుగా ఇండస్ట్రీలో నయనతార
కేరళ పుట్టి, తమిళ సినిమాల్లోకి వచ్చి.. సౌత్ లో స్టార్ గా ఎదిగింది నయనతార. తమిళ, తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమలో నయనతార అగ్రస్థానంలో ఉన్నారు. 'అయ్యా' సినిమాతో అరంగేట్రం చేసి 20 ఏళ్లుగా టాప్ హీరోయిన్‌గా కొనసాగుతుంది సీనియర్ నటి. పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతోంది.
నయనతార రెమ్యునరేషన్
నయనతార ఒక సినిమాకు 10 నుంచి 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారు. దక్షిణ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా ఆమె మొదటి స్థానంలో ఉన్నారు. అంతే కాదు కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా నయన్ కోట్లు సంపాదిస్తున్నారు. ఆమధ్య 50 సెకన్ల టాటా స్కై యాడ్‌లో నటించడానికి ఈస్టార్ హీరోయిన్ రూ.5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.
40 ఏళ్ళ వయసులో తగ్గని ఇమేజ్
40 ఏళ్ల వయసు దాటినా, పెళ్లై పిల్లలు ఉన్నా.. నయనతార మార్కెట్ ఏమాత్రం తగ్గలేదు. వాటన్నింటినీ బ్రేక్ చేసి, ఇప్పటికీ బిజీ హీరోయిన్‌గా కొనసాగుతుంది. అంతే కాదు నిర్మాతగా కూడా రాణిస్తుంది నయనతార. రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ద్వారా కొన్ని చిత్రాలను కూడా నిర్మిస్తుంది.
నయనతార సినిమాలు ..
ప్రస్తుతం నయనతార చేతిలో పలు తమిళ, మలయాళ చిత్రాలు ఉన్నాయి. తెలుగులో చిరంజీవి సరసన మన శంకరవరప్రసాదు గారు సినిమాతో నటిస్తోంది నయన్. ఈసినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. ఇక తెలుగులో బాలకృష్ణ జోడీగా నాలుగో సారి జతకట్టబోతోంది నయన్. ఇక కన్నడలో యశ్‌తో కలిసి 'టాక్సిక్' చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో యశ్‌కు అక్కగా లేడీ సూపర్ స్టార్ నటిస్తున్నారు.