- Home
- Entertainment
- TV
- Naga panchami serial today Episode: పంచమి కోసం కదిలివచ్చిన సుబ్రహ్మణ్యేశ్వరుడు.. బాధలో మోక్ష..!
Naga panchami serial today Episode: పంచమి కోసం కదిలివచ్చిన సుబ్రహ్మణ్యేశ్వరుడు.. బాధలో మోక్ష..!
నెమ్మదిగా మాట్లాడి, మనసు మారుస్తానని హామీ ఇస్తాడు. సరేనని నాగ దేవత ఆశీర్వదించి వెళ్లిపోతుంది.యువరాణి లేదనే విషయం తెలిసి ఉంటే.. తనకు నాగ దేవత శిక్ష వేసేదని తృటిలో తప్పించుకున్నానని యువరాజు అనుకుంటాడు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Naga panchami
Naga panchami Serial: పంచమి లేని సమయాన్ని వీలుగా చేసుకొని మోక్షను తనవైపు తిప్పుకోవాలి మేఘన అనుకుంటుంది. దానిలో భాగంగానే కావాలే ఓ బొద్దింకను తయారు చేసి, మోక్ష మీద పడేస్తుంది. దానిని వదిలించుకోవడానికి మోక్ష తిప్పలు పడుతుంటే, సహాయం చేస్తానంటూ వచ్చి, అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తుంది. బొద్దింకను తీస్తున్నట్లుగా చేసి, మోక్షను హత్తుకోవాలని చూస్తుంది. కావాలనే.. తాను బెడ్ మీద పడి. తనపై మోక్ష కూడా పడేలా చేసుకుంటుంది. వారిద్దరూ అలా బెడ్ మీద పడి ఉండటం వైదేహి చూస్తుంది.. తర్వాత మేఘన.. మీరు నా మీద కావాలనే పడ్డారు కదా అంటుంది.. లేదని, పొరపాటున జరిగిందని సారీ చెబుతాడు.
Naga panchami
తర్వాత నాగ యువరాజు కి నాగదేవత ప్రత్యక్షమౌతుంది. ‘ ఏంటి యువరాజా.. నీకు ఇచ్చిన సమయం దగ్గరపడుతుంది. యువరాణిని ఒప్పించగలవా లేదా?’ అని నాగ దేవత అడుగుతుంది. దానికి యువరాజు.. యువరాణి కనిపించడం లేదని నాగదేవతకు తెలిసినట్లు లేదు. అనుకుంటూ ఉంటాడు. ‘ ఆలోచిస్తున్నావ్ అంటే, యువరాణిని ఒప్పించగలవనే నమ్మకం లేదన్నమాట’ అని నాగ దేవత అంటుంది. ‘అలాంటిదేమీ లేదని, ముక్కోటి ఏకాదశి లోగా.. మీరు ఇచ్చిన పని పూర్తి చేసుకొని వస్తాను’ అని యువరాజు అంటాడు. ‘నీ మీద నమ్మకంతో ఉన్నానని, యువరాణిని ఒప్పించడానికి నీ శాయశక్తులా ప్రయత్నించు. దాని వల్ల మనకు రెండు ఉపయోగాలు ఉన్నాయి. పంచమి మెక్షను కాటేసి చంపేస్తే, మనం మహారాణికి ఇచ్చిన చివరి కోరికను తీర్చిన వాళ్లం అవుతాం. నాగలోక గౌరవాన్ని నిలపెట్టిన వాళ్లం అవుతాం. రెండోది.. నాగలోకానికి రాణి లేని లోటు తీరుతుంది. అందుకే, ఈ విషయం లో నేను ఇంత పట్టుదలతో ఉన్నాను’ అనిఅంటుంది. ‘ ఆ రెండు కార్యాలు నెరవేర్చే బాధ్యత తనది యువరాజా అంటాడు
Naga panchami
మరోసారి తాను యువరాణితో మాట్లాడతాను అని నాగదేవత అంటుంది. పంచమితో మాట్లాడాతాను అంటే.. పంచమి లేదని తెలిసిన యువరాజా వద్దని నిరాకరిస్తాడు. ఒత్తిడి చేస్తే, తాను ఆత్మహత్య చేసుకుంటుందని, నెమ్మదిగా మాట్లాడి, మనసు మారుస్తానని హామీ ఇస్తాడు. సరేనని నాగ దేవత ఆశీర్వదించి వెళ్లిపోతుంది.యువరాణి లేదనే విషయం తెలిసి ఉంటే.. తనకు నాగ దేవత శిక్ష వేసేదని తృటిలో తప్పించుకున్నానని యువరాజు అనుకుంటాడు.
Naga panchami
మరోవైపు పంచమి సుబ్రహ్మణ్య స్వామి పాదాల వద్ద స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. మెళకువ వచ్చి లేచి చూస్తుంది. తన తలకు ఉన్న గాయం నయమైపోతుంది. ‘ నేను బతికే ఉన్నానా? చనిపోలేదా? సుబ్రహ్మణ్యేశ్వర నీకు కూడా నా మీద కనికరం కలగలేదా? నేను ఏం పాపం చేశాను స్వామి.. నన్ను బతికించి, ఇంకా కష్టాలు పెట్టడానికి, ఇంత వరకు పడిన బాధలు చాలవా స్వామి, నాకు ఈ జీవితం వద్దు స్వామి. సంతోషంగా చనిపోయే అదృష్టం కూడా నాకు లేదా? పర్వాలేదు స్వామి కన్నీళ్లతోనే కళ్లు మూస్తాను. నాకు ఏ ఆనందం అవసరం లేదు. కనీసం ప్రాణమైనా త్వరగా పోయేలా చేయండి స్వామి’ అని మరోసారి తల బాదుకుంటుంది. పంచమి బాధ చూసి ఆ సుబ్రహ్మన్య స్వామి బాలుడి రూపంలో ఎంట్రీ ఇస్తాడు.
Naga panchami
ఆ బాలుడిని చూసి పంచమి షాకౌతుంది. ‘ ఏంటి పంచమి అలా చూస్తున్నావ్. అప్పుడే నన్ను మర్చిపోయావా’ అని అడుగుతాడు. ‘ నా జీవితంలో ప్రశాంతత అనేది ఏదైనా ఉంది అంటే.. అది నీతో గడిపిన క్షణాలే సుబ్బు, నిన్నటి నుంచి వేడుకుంటున్నాను. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి నా ప్రాణాలు తీయడం లేదు. నిన్ను చూడటం కోసమే, ఆ స్వామి నన్ను ప్రాణాలతో ఉంచాడు అనుకుంటా’ అని పంచమి అంటుది. ‘ నువ్వు ఒక చీమను కూడా చంపలేవు. ఒక పెద్ద జీవిని ఎలా చంపుతావ్’ అని సుబ్బూ అంటాడు. ‘ నన్ను నేను చంపుకోలేకపోతున్నాను. నీను మరొకరిని చంపడమా సుబ్బు’ అని పంచమి అడుగుతుంది. ‘ అవును పంచమి, నువ్వు ఒక మహా పాతకానికి ఒడికట్టావ్. నీలో ఉన్న జీవిని చంపే హక్కు నీకు లేదు. దేహం మాత్రమే నీది పంచమి. లోపల ఉన్న జీవం భగవంతుడిది. జీవం పోయడం, తీసుకోవడ భగవంతుడి ఇష్టం. అందుకే, ఆ జీవాన్ని చంపే ఆలోచన మానేసి, మన కబుర్లు చెప్పు పంచమి’ అని సుబ్బు అడుగుతాడు.
Naga panchami
ఇక్కడికి ఎలా వచ్చావ్ సుబ్బు అని అడుగుతుంది. ఆ మాట నేను అడగాలి పంచమి.. నేను మొట్టమొదటిసారి నీకు కనిపించింది ఇక్కడే. ఇది నాకు చాలా ఇష్టమైన ప్రదేశం. నచ్చినప్పుడు వస్తూ ఉంటాను. నేను ఉన్న చోటుకు నువ్వే వచ్చావ్ అని అంటాడు. తర్వాత మీ ఇంటి విశేషాలు చెప్పమని అడుగుతాడు. తాను తప్ప... అందరూ సంతోషంగానే ఉంటారు సుబ్బు అని పంచమి అంటుంది.
సంతోషం అంటే కష్టాలు కాదని, ఆస్వాదించడం అని సుబ్బు చెబుతాడు. ‘పురిటి నొప్పులు బాధపెడతాయి. కానీ నొప్పులను కూడ ఆస్వాదిస్తే.. ఆనందాన్ని ఇస్తుంది. మరణం కూడా అంతే.. దానిని ఆస్వాదించి, ఆనందించగలిగితే, చావు అంటే భయం బదులు ఆనందం కలుగుతుంది.’ అని సుబ్బు అంటాడు. స్వామిని ఏం కోరుకున్నావ్ అంటే..చనిపోవడానికి వచ్చాను అని, కానీ స్వామి కనికరించడం లేదు అని పంచమి చెబుతుంది. అంటే.. నువ్వు చావడం స్వామికి ఇష్టం లేదు అనే కదా, పంచమి ఇక బయలుదేరదామా అని సుబ్బు అడుగుతాడు.
Naga panchami
కానీ, పంచమి తాను రానని, ఇక్కడే ఉంటాను అంటుంది. మరి, మోక్ష నీకోసం వస్తాడా అని అడుగుతాడు. లేదని.. తానే మోక్ష బాబు దగ్గరకు వెళతాను అంటుంది. కొంత వరకు తోడు వస్తాను అని సుబ్బు అంటాడు.. దానికి పంచమి సంతోషిస్తుంది. ఇద్దరూ కలిసి వెళతాడు. సుబ్బు నే నిజమైన సుబ్రహ్మణ్య స్వామి అనే విషయం పంచమికి తెలీదు. సాధారణ బాలుడు అనుకుంటూ ఉంటాడు.
Naga panchami
మరోవైపు ఓ స్వామిజీ పూజ చేసుకుంటూ ఉంటాడు. అక్కడికి మోక్ష పంచమి ని వెతుకుతూ వస్తాడు. అతనికి నమస్కారం చేసి, పంచమి జాడ చెప్పమని అడుగుతాడు. పంచమిని కొట్టి తప్పు చేశాను అని బాధపడతాడు. పంచమి తనకు దూరమైందని చెబుతాడు. తనకు చాలా ఆందోళనగా ఉందని, పుట్టింటికి కూడా వెళ్లేలేదని, చాలా చోట్ల వెతికినా దొరకలేదని చెబుతాడు. అక్కడిత ఎపిసోడ్ ముగుస్తుంది.
కమింగ్ అప్ లో.. యువరాజా మనిషి రూపం నుంచి పాముగా మారడం జ్వాల చూస్తుంది. తర్వాత యామిని.. పంచమి కూడా పామే అని చెప్పి అందరికీ షాకిస్తుంది.