- Home
- Entertainment
- TV
- కార్తీక దీపం 2 లేటెస్ట్ ఎపిసోడ్: అసలైన వారసురాలిని వెతుకుతానని జ్యోకు షాకిచ్చిన పారు- సుమిత్ర విషయంలో కార్తీక్ పై మండిపడ్డ శివన్నారాయణ
కార్తీక దీపం 2 లేటెస్ట్ ఎపిసోడ్: అసలైన వారసురాలిని వెతుకుతానని జ్యోకు షాకిచ్చిన పారు- సుమిత్ర విషయంలో కార్తీక్ పై మండిపడ్డ శివన్నారాయణ
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (అక్టోబర్ 24వ తేదీ)లో మమ్మీ లాగే తాత కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడా అన్న జ్యో. పిల్లలను మార్చిన తప్పును సరిదిద్దుకుంటానన్న పారు. సుమిత్ర విషయం తెలిసి కార్తీక్ కుటుంబంపై మండిపడ్డ శివన్నారాయణ. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో సుమిత్ర దొరుకుతుందంటావా కార్తీక్ అని అడుగుతాడు శివన్నారాయణ. కచ్చితంగా దొరుకుతుంది తాతగారు అంటుంది దీప. మనసు ముక్కలైన మనిషి మనకు కనిపించాలి అనుకోదు. అనుకున్నా ఇంటికి రావాలని కోరుకోదు అంటాడు శివన్నారాయణ. ఎక్కడున్నా అత్త క్షేమంగా ఉంటుంది. నేను ఇంటికి తీసుకువస్తాను అని చెప్తాడు కార్తీక్. ఆ ధైర్యంతోనే ఉన్నాం. కానీ సుమిత్ర జాడ ఇంకా తెలియలేదు కదా అంటాడు శివన్నారాయణ. ఫస్ట్ నువ్వు కూర్చో నాన్న. టిఫిన్ చేయ్ నాన్న అంటూ హడావిడి చేస్తుంది కాంచన. కానీ శివన్నారాయణ సుమిత్ర విషయం తెలిసినట్లే వాళ్లతో ఇన్ డైరెక్ట్ గా మాట్లాడుతుంటాడు. వాళ్లు కంగారు పడుతుంటారు.
దశరథ ఉన్నా లేనట్లే
మీరు ఎందుకంతా కంగారు పడుతున్నారు. నేను కాంచనను చూడటానికి వచ్చాను. వచ్చిన పని అయిపోయింది అంటాడు శివన్నారాయణ. అన్నయ్య ఎలా ఉన్నాడని అడుగుతుంది కాంచన. సుమిత్ర లేదు కాబట్టి కనపడట్లేదు. దశరథ ఉన్నా కూడా కనపడట్లేదు. ఏదో పోగొట్టుకున్నట్లు, ఎవ్వరిలాగానో ఇంట్లో తిరుగుతున్నాడు. నా కొడుకు ఉన్నా లేనట్టుగానే ఉన్నాడు అని బాధపడుతాడు. త్వరలోనే అత్త తిరిగి వస్తుంది. అంతా సర్దుకుంటుంది అని చెప్తాడు కార్తీక్. నీతో కొంచెం మాట్లాడాలి. బయట వెయిట్ చేస్తాను అని కార్తీక్ తో చెప్పి వెళ్లిపోతాడు శివన్నారాయణ.
తాత కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడా?
గ్రానీ తాత ఎక్కడికి వెళ్లాడు అని అడుగుతుంది జ్యోత్స్న. గదిలో చూడు అంటుంది పారు. లేడు.. ఈయన కూడా మమ్మీలాగే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడేమో అంటుంది జ్యో. ఆయన మీ తాతే అంటుంది పారు. సొంత తాత కాదు కదా అంటుంది జ్యోత్స్న. కాదు.. కానీ నిన్ను గుండెల మీద ఎత్తుకొని ఆడించిన తాతే. నీకు కొంచెం కూడా ప్రేమ లేదా.. అంటుంది పారు. వాళ్లు నీ సొంతవాళ్లు కాదు కావచ్చు. కానీ నిన్ను ప్రేమగానే పెంచారు కదా.. పెంచిన ప్రేమ అయినా ఉండాలి కదా.. అంటుంది పారు. నాకు ఎవ్వరిపైనా ప్రేమ లేదు అంటుంది జ్యోత్స్న. మీ తాత మంచాన పడితే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కానీ నీకు ఏ బాధ లేదు. ఇలా ఎందుకు మారిపోతున్నావ్ జ్యోత్స్న అంటుంది పారు.
జ్యోకు షాక్ ఇచ్చిన పారు
నేను ఇంతే గ్రానీ అంటుంది జ్యో. నువ్వు రోజు రోజుకు యంత్రంలా మారిపోతున్నావు. ఒకవేళ దాసు నీకు నిజం చెప్పి ఉండకపోతే సుమిత్ర, దశరథలే మీ అమ్మనాన్న కదా.. అంటుంది పారు. కానీ నాకు ఇప్పుడు నిజం తెలిసింది కదా అంటుంది జ్యోత్స్న. నేను పిల్లల్ని మార్చి తప్పు చేశానే అంటుంది పారు. ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోలేవులే అంటుంది జ్యోత్స్న. ఎందుకు దిద్దుకోలేను నిన్ను దాసు దగ్గర పెట్టి. దశరథ కూతురిని వాళ్లకు అప్పగిస్తా అంటుంది పారు. నీకు అసలైన వారసురాలు ఎవరో తెలుసా అని షాక్ అవుతుంది జ్యోత్స్న. తెలియదు. కానీ పట్టుకుంటా అంటుంది పారు. నిన్ను చూస్తే నాకు భయం వేస్తోంది. రేపు నాకు ఏమైనా కూడా నువ్వు ఇలాగే ఈజీగా తీసుకుంటావు కదా అంటుంది పారు. వాళ్లు వేరు నువ్వు వేరు గ్రానీ అంటుంది జ్యోత్స్న. నీకు నిజం చెప్పి దాసు తప్పు చేశాడు అని మనసులో అనుకుంటుంది పారు.
నిజం బయటపెట్టిన శౌర్య
కార్తీక్, శివన్నారాయణ బయట మాట్లాడుకుంటూ ఉంటారు. సుమిత్ర కోసం బాధపడుతుంటాడు శివన్నారాయణ. ఇంతలో శౌర్య అక్కడికి వస్తుంది. వచ్చావ ముద్దుల తాత అంటూ పలకరిస్తుంది. నువ్వు వస్తావని నాకే ముందే తెలుసు అంటుంది. ఎలా అని అడుగుతాడు శివన్నారాయణ. దాగుడుమూతలు ఆడటానికి జ్యో వచ్చింది కదా.. నువ్వు కూడా వస్తావని నాకు తెలుసు అంటుంది శౌర్య. జ్యో ఎవ్వరితో దాగుడుమూతలు ఆడుతోంది అని అడుగుతాడు శివన్నారాయణ. అమ్మమ్మతో అని చెప్పబోయి ఆగిపోతుంది శౌర్య.
ఎవ్వరితో చెప్పు అని మళ్లీ మళ్లీ ప్రేమగా అడుగుతాడు శివన్నారాయణ. చెప్తే దొరికిపోతారు కదా అంటుంది శౌర్య. సరే నీకోసం నేను కొన్ని చాక్లెట్స్ తెచ్చాను అని చేతికిస్తాడు శివన్నారాయణ. ఇవి మొత్తం నీకే కాదు. ఇంట్లో వాళ్లందరికీ అని చెప్తాడు. ఒక్కొక్క చాక్లెట్ ఇస్తుంటే ఒక్కొక్క పేరు చెప్తుంది శౌర్య. అలా చివరలో అమ్మమ్మ అని కూడా చెప్పేసి వెళ్లిపోతుంది.
కోపంతో ఊగిపోయిన శివన్నారాయణ
శౌర్య మాటలకు సంజాయిషీ ఇవ్వబోతాడు కార్తీక్. కోపంతో చేయి పైకి ఎత్తుతాడు శివన్నారాయణ. చాలు ఇక ఆపరా.. నిన్ను కొట్టడం కూడా నాకు ఇష్టంలేదు. సుమిత్ర కనపడటం లేదని నేను, నా కొడుకు అంతలా బాధపడుతుంటే తనని ఇంట్లోనే పెట్టుకొని మాకు చెప్పలేదు. మిమ్మల్ని నమ్మి చేరదీసిన ప్రతీసారి మమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నారు అని బాధ, కోపంతో ఊగిపోతాడు శివన్నారాయణ. అదికాదు తాత అని కార్తీక్ చెప్పడానికి ప్రయత్నించిన వినడు. నేను మంచం పట్టినా మీకు నిజం చెప్పాలి అనిపించలేదా? భార్య కనిపించడం లేదని నా కొడుకు ఎంత బాధపడుతున్నాడో చూసి కూడా మీరు నిజం దాచారంటే మీ మనసుల్లో ఎంత విషం ఉంది. మిమ్మల్ని నేను వెలేస్తున్నాను అంటాడు శివన్నారాయణ.
మేము చెప్పేది వినకుండా మీరు అలా మాట్లాడితే ఎలా నాన్న అంటుంది కాంచన. మీరు నిలబెట్టిన ప్రాణాల్నీ మీరే తీసేదాక ఊరుకోరు కదా అంటాడు శివన్నారాయణ. దీంతో అమ్మకు సంబంధం లేదు అంటాడు కార్తీక్. అంతా కలిసే నాటకం ఆడారు. విషయం బయటపడకుండా జాగ్రత్త పడ్డారు అంటాడు శివన్నారాయణ. కానీ ఎక్కడ దొరికిపోయారో తెలుసా.. నిన్న రాత్రి ఫోన్ మాట్లాడినప్పుడు శౌర్య అడిగింది కదా ఆ మాటతో దొరికిపోయారు అని శివన్నారాయణ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.