MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • TV
  • కాంతార చాప్టర్ 1 ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది, రిషబ్ శెట్టి మూవీ ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

కాంతార చాప్టర్ 1 ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది, రిషబ్ శెట్టి మూవీ ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

1000 కోట్లు కలెక్ట్ చేయకముందే ఓటీటీలో రిలీజ్ కు రెడీ అయ్యింది కాంతార చాప్టర్ 1 మూవీ. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ… డైరెక్ట్ చేసిన ఈసినిమా.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 28 2025, 09:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఓటీటీలోకి  కాంతార చాప్టర్ 1
Image Credit : instagram

ఓటీటీలోకి కాంతార చాప్టర్ 1

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన సినిమాల్లో కాంతార చాప్టర్ 1 ఒకటి. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈసినిమా 1000 కోట్లు కలెక్ట్ చేయకముందే ఓటీటీలోకి రాబోతోంది.  ఈసినిమాను అక్టోబర్ 31 నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రిషబ్ శెట్టి నటిస్తూ డైరెక్ట్ చేసిన సినిమా
Image Credit : X

రిషబ్ శెట్టి నటిస్తూ డైరెక్ట్ చేసిన సినిమా

 రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ.. డైరెక్ట్ చేసిన ఈసినిమాలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ ముఖ్య పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో భారీ విజయం సాధించింది. 

35
ప్రైమ్ వీడియో పోస్ట్
Image Credit : X

ప్రైమ్ వీడియో పోస్ట్

కన్నడ  సంస్కృతితో కూడిన కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇటువంటి కథలకు మంచి ఆదరణ ఉంటుందని, ప్రేక్షకులను అవి  ఆకట్టుకుంటాయని 'కాంతార' నిరూపించింది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై అమెజాన్ ప్రైమ్ ప్రకటన రిలీజ్ చేసింది.  అక్టోబర్ 31 నుంచి ఈ సినిమాను ప్రపంచ ప్రేక్షకులతో పంచుకోవడానికి ఉత్సాహంగా ఉన్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

45
కదంబ రాజవంశం కాలం నాటి కథ
Image Credit : Instagram

కదంబ రాజవంశం కాలం నాటి కథ

కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా ఈసినిమా రూపొందింది.  కదంబ రాజవంశం కాలం నాటి కథ ఇది. పవిత్ర అడవులను కాపాడే పంజుర్లి దైవం పురాణగాథ మూలాలను.. ఈ సినిమా లో చూపించారు. కాంతార మొదటి భాగంలో రిషబ్ శెట్టి  తండ్రి పాత్ర చుట్టు.. ఈ సినిమా నడుస్తుంది.  ఇందులో దైవిక శక్తులు  ఎలా  మేల్కొంటాయి, అవి మేల్కొనడానికి కారణాలు వెల్లడించారు. 

55
భూతకోల సంప్రదాయం
Image Credit : instagram

భూతకోల సంప్రదాయం

కర్ణాటక తీరప్రాంత భూతకోల సంప్రదాయాన్ని ఈ సినిమా అద్భుతంగా చూపించింది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సినిమాకు ప్రాణం పోసిందని చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన కాంతార చాప్టర్ 1 సినిమా అద్భుతమైన రెస్పాన్స్ ను సాధించింది. అయితే కేజీఎఫ్ తరువాత 1000 కోట్ల కలెక్షన్లు సాధించిన సినిమాగా కాంతార చాప్టర్ 1 నిలుస్తుందని అనుకున్నారు. కానీ ఈ సినిమా 800 కోట్ల వరకూ మాత్రమే  కలెక్ట్ చేసింది.  కన్నడ బాషలో ఓటీటీ రిలీజ్ డేట్ ఇంకా ఇవ్వలేదు. మరి ఈసినిమా కలెక్షన్స్ పై మరేదైనా ప్లాన్ చేస్తున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు
Related Stories
Recommended image1
1000 కోట్ల కలెక్షన్స్ కోసం రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్, కాంతార చాప్టర్ 1 నెక్ట్స్ రిలీజ్ ఎక్కడో తెలుసా?
Recommended image2
చిరంజీవి కి లెటర్ రాసి.. టేబుల్ పై పెట్టిన రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రిక్వెస్ట్ కు మెగాస్టార్ స్పందన ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved