MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Guppedntha Manasu 12th march Episode:స్టూడెంట్స్ ముందు మను పరువు తీసిన వసు, అల్లాడిన తల్లి మనసు..!

Guppedntha Manasu 12th march Episode:స్టూడెంట్స్ ముందు మను పరువు తీసిన వసు, అల్లాడిన తల్లి మనసు..!

 వసు సంతోషం కోసమే చేస్తున్నాం అని చెప్పడంతో.. ఫణీంద్ర సరే వస్తాను అంటాడు. మీ వదిన, శైలేంద్ర, ధరణిని కూడా తీసుకువస్తాను అని చెబుతాడు.

4 Min read
Author : ramya Sridhar
Published : Mar 12 2024, 08:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Guppedantha Manasu

Guppedantha Manasu

Guppedntha Manasu 12th march Episode:కాలేజీలో వసుధార పుట్టినరోజు వేడుకలు చేయాలని మహేంద్ర, మను ప్లాన్ చేస్తూ ఉంటారు. అదేమో వసుధారకు నచ్చదు. కనీసం కాలేజీలో పోస్టర్లు అంటించడమే ఆమెకు నచ్చదు. ఆ విషయంలోనే మనుని పిచ్చి పిచ్చిగా తిడుతుంది. అయితే.. మనుని అలా అనడం కరెక్ట్ కాదని మహేంద్ర అన్నమాటలకు వసు బాధపడుతుంది, తనను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అంటూ... రిషి ఫోటో పట్టుకొని ఎప్పటిలాగానే మాట్లాడుతూ ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నారు రిషి సర్.. మీరు నా పక్కన లేకుండా నేను పుట్టినరోజు ఎలా చేసుకుంటాను అని మాట్లాడుతూ ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Guppedantha Manasu

Guppedantha Manasu

మరోవైపు మహేంద్ర... కాలేజీలో వసుధార పుట్టినరోజు చేస్తున్నామంటూ మీరు రావాలి అని ఫణీంద్రకు ఫోన్ చేసి చెబుతాడు. వసుధార ఒప్పుకుందా అని ఆయన అడిగితే... ఒప్పకోలేదని, తెలీకుండా చేస్తున్నాం అని చెబుతాడు. వసు సంతోషం కోసమే చేస్తున్నాం అని చెప్పడంతో.. ఫణీంద్ర సరే వస్తాను అంటాడు. మీ వదిన, శైలేంద్ర, ధరణిని కూడా తీసుకువస్తాను అని చెబుతాడు.

39
Guppedantha Manasu

Guppedantha Manasu

మహేంద్ర తో ఫోన్ మాట్లాడిన వెంటనే ఫణీంద్ర... దేవయాణి, శైలేంద్రలను పిలుస్తాడు. రేపు కాలేజీలో మను.. వసుధార బర్త్ డే చేస్తున్నాడని.. మనం అందరం వెళ్తున్నామని,  తొందరగా రెడీ అవ్వమని చెబుతాడు. అయితే.. శైలేంద్ర నేను రాను అంటాడు. వెంటనే దేవయాణి కూడా నేను  రాను అంటుంది. ఎందుకు అని ఫణీంద్ర అంటే.. ఓవైపు రిషి కనపించక అందరం బాధపడుతుంటే...ఆ వసుధార బర్త్ డే సెలబ్రేషన్స్ కావాలా..? అసలు ఒక్కోసారి ఏం చేస్తుందో కూడా అర్థం కాదు అని దేవయాణి అంటుంది. శైలేంద్ర కూడా వసు బర్త్ డే ఆ మను ఎందుకు చేయాలి అనే అనుమానం వ్యక్తం చేస్తాఢు. దీంతో.. ఇద్దరినీ ఫణీంద్ర తిడతాడు. అసలు రిషి కి అన్నగా.. వసుధార సంతోషం కోసం నువ్వు చేయాల్సిన పనిని ఆ అబ్బాయి చేస్తున్నాడు.. సంతోషించాల్సిందిపోయి.. ఇలా మాట్లాడతావా అని అరుస్తాడు. రేపు కచ్చితంగా కాలేజీకి మీరు రావాల్సిందే అని చెబుతాడు. ధరణితో.. నువ్వు కూడా రామ్మా అని చెబుతాడు. అయితే.. ఫణీంద్ర వెళ్లగానే ధరణి.. అత్తయ్యగారు.. ఇప్పుడు మీరు ఏమీ చేయలేరు అనుకుంటాను అని అంటుంది.. నువ్వు మూసుకొని వంట గదిలోకి వెళ్లు అని దేవయాణి కసురుకుంటుంది. సరే అని ధరణి వెళ్లిపోతుంది.

49
Guppedantha Manasu

Guppedantha Manasu

తెల్లారే వసుధార కాలేజీకి వెళ్తుంది. అలా కాలేజీలోకి వెళ్లగానే.. ఓ స్టూడెంట్ ఉరుక్కుంటూ వచ్చి.. మేడమ్ స్టూడెంట్స్ కొట్టుకుంటున్నారు అని చెబుతాడు. వెంటనే వసుధార లోపలికి వెళ్తుంది. అయితే.. స్టూడెంట్స్ కొట్టుకుంటున్నట్లు యాక్ట్ చేసి... హ్యాపీ బర్త్ డే అని సర్ ప్రైజ్ ఇస్తారు. అయితే.. వసు దానికి సీరియస్ అవుతుంది. ఎవరు ఇచ్చారు మీకు ఈ ఐడియా... ఇలా ఎవరైనా విషెస్ చెబుతారా అని సీరియస్ అవుతుంది. మీరు చెప్పకపోయినా.. ఇలా ఎవరు చేయించారో నాకు తెలుసు అంటూ కోపంగా బయటకు వస్తుంది,

59
Guppedantha Manasu

Guppedantha Manasu

బయటకు రావడం రావడమే...మను ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు. ఇదంతా మను నే చేశాడు అనుకొని వెళ్లి ఫైర్ అవుతుంది. వెనక స్టూడెంట్స్ చూస్తూ ఉంటారు... మహేంద్ర, అనుపమ కూడా అక్కడే ఉంటారు... అందరి ముందు మనుని తిడుతుంది. నిన్ననే చెప్పాను కదా.. నా బర్త్ డే సెలబ్రేషన్స్ చేయవద్దని... ఈరోజు స్టూడెంట్స్ తో ఎందుకు విష్ చేయించారు..? నాకు సర్ ఫ్రైజ్ అయినా, సెలబ్రేషన్ అయినా.. రిషి సర్ సమక్షంలోనే జరగాలి. మీ మనసులో ఏదో దురుద్దేశం ఉంది.. అదేంటో చెప్పండి.. నీకు ఎండీ పదవి కావాలి కదా.. దానికోసమే ఇలా చేస్తున్నారు.. మీ వళ్లే మా మామయ్య కూడా నన్ను తప్పు అంటున్నారు.. ఎవరు ఏమనుకున్నా కూడా నేను ఈ బర్త్ డే చేసుకోను. మీకు నిజంగా ఎండీ పదవి కావాలంటే డైరెక్ట్ గా అడగండి.. ఇచ్చేస్తాను. నన్ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయవద్దు.. నేను భరించలేను..  అని నోటికి వచ్చినట్లు మాట్లాడుతూనే ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది.  అయితే.. మనం చేసినదానికి సర్ తిట్లు తింటున్నారు అని స్టూడెంట్స్ ఫీల్ అవుతారు.

69
Guppedantha Manasu

Guppedantha Manasu

మనుని వసుధార అలా తిట్టడం చూసి అనుపమ కూడా చాలా ఫీలౌతుంది. ఆమె తల్లి మనసు అల్లాడిపోతుంది. మహేంద్రను పక్కకు పిలిచి.. ఇందుకే వద్దు అన్నాను.. నా మాట మీరు వినలేదు అని సీరియస్ అవుతుంది. మను ఎంత బాధపడ్డాడో అని.. అనుపమ కూడా బాధపడుతుంది. మను ఫీలైతే నీకు ఎందుకు అంత బాధ అని మహేంద్ర అడుగుతాడు. మొన్నకూడా భోజనం చేసేటప్పుడు అతనేదో అంటే.. నువ్వు కళ్లల్లో నీళ్లు తెచ్చుకున్నావ్ అని అంటాడు. అయితే.. కూరలో కారం ఎక్కువయ్యింది అని అనుపమ కవర్ ఛేయాలని చూస్తుంది. కానీ.. అది కారం కాదని.. మమకారం.. ఇప్పుడైనా మీ ఇద్దరి మధ్య బంధం ఏంటో చెప్పమని ఒత్తిడి తెస్తాడు. దీంతో... అనుపమ అలర్ట్ అయ్యి.. టాపిక్ డైవర్ట్ చేస్తున్నావ్.. నేను వసుధార గురించి మాట్లాడుతున్నాను అని అంటుంది. 

79
Guppedantha Manasu

Guppedantha Manasu


దానికి మహేంద్ర... తాముు వసుధార బాధ పోగొట్టాలనే చేశాం అని అంటాడు. అయితే.. వసుధారది బాధ కాదని, దుఖం అని చెబుతుంది. అయితే.. జగతి పోయినప్పుడు తాను కూడా అలానే ఉండేవాడినని.. నన్ను నార్మల్ చేయడానికి వసుధార, రిషి చాలా ప్రయత్నాలు చేశారని.. ఇప్పుడు మను చేసింది తప్పు అయితే.. అప్పుడు వసు, రిషిలు చేసింది కూడా తప్పే అంటాడు. వసుధారకు ఇప్పుడు బాధ అనిపించినా.. తర్వాత..మను  చేసింది కరెక్ట్ అని అర్థం చేసుకుంటంది అని అంటాడు,

89
Guppedantha Manasu

Guppedantha Manasu

ఇక వసుధార తన క్యాబిన్ లో కూర్చొని స్టూడెంట్స్ చెప్పిన విషెస్ గురించే ఆలోచిస్తూఉంటుంది. అప్పుడే స్టూడెంట్స్ వచ్చి... వసుకి క్షమాపణలు చెబుతారు. మీరు ఎందుకు చెబుతున్నారు.,. ఇది మీ ఐడియా కాదు కదా... ఆ మను చెప్పారు.. మీరు చేశారు అని వసు అంటుంది. అయితే.. మను సర్ కి ఎలాంటి సంబంధం లేదని.. సోషల్ మీడియాలో రీల్ చూసి తామే చేశాం అని చెబుతారు. దీంతో... వసు చాలా గిల్టీగా పీలౌతుంది. అనవసరంగా మనుని తిట్టాను అని ఫీలైతుంది.

99
Guppedantha Manasu

Guppedantha Manasu

వెంటనే మను దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెబుతుంది. కానీ.. మను పర్వాలేదు మేడమ్.. మీరు పొరపాటు పడ్డారు అంతే కదా అంటాడు. అప్పుడు వసు చెబుతుంది.. ఇప్పటి వరకు తమను చాలా మంది మోసం చేశారని.. అందుకే.. ఆ ప్రభావం తనపై ఉందని.. ప్రతి ఒక్కరి మనసులో ఏదో చెడు ఉద్దేశం ఉందేమో అనే  అనుమానంలో తనలో ఉందని... మిమ్మల్ని ప్రతిసారీ తాను ఏదో ఒక విధంగా బాధపెడుతున్నాను అని... చాలా బాధపడుతుంది. దానికి మను మాత్రం.. పర్వాలేదని.. మీ బాధను తాను అర్థం చేసుకోగలను అంటాడు. మీకు రిషి సర్ అంటే ప్రాణం అని తనకు తెలుసు అని.. ఆయన చేయాల్సిన పనులు నేను చేస్తున్నందుకు మీకు అలా అనిపించడంలో తప్పులేదని అంటాడు. అయితే.. తన విషయంలో మీరు ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదని మరోసారి చెబుతాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ వెళ్లిపోయాడు ఇక ముఖేష్, వర్షిణిపై దాడి మొదలు పెట్టిన త్రిగుణ్, కోపంతో ఊగిపోయిన శివ, దేబ్జానీ కన్నీళ్లు
Recommended image2
Rohit Re Entry: బిగ్ బాస్ హౌస్ లోకి రోహిత్ నాయుడు రీ ఎంట్రీ..? అభిజిత్ ట్వీట్ వెనుక అసలు సీక్రెట్ ఏంటి?
Recommended image3
Bigg Boss 10: ఝాన్సీ నీ వల్లే ఎలిమినేట్‌ అయ్యింది.. ముఖేష్‌ని ఆడుకున్న శివ, టెంపర్‌ వంశీ.. హీటెక్కిన నామినేషన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved