MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • TV
  • Gunde Ninda Gudi Gantalu: చావు బతుకుల్లో రోహిణీ తల్లి, చింటూ ఇక తల్లితోనే.. మనోజ్ కి దొరికిపోయిన రోహిణీ

Gunde Ninda Gudi Gantalu: చావు బతుకుల్లో రోహిణీ తల్లి, చింటూ ఇక తల్లితోనే.. మనోజ్ కి దొరికిపోయిన రోహిణీ

 Gunde Ninda Gudi Gantalu: రోహిణీ తల్లి ఆస్పత్రిలో ఉంది. ఆమెకు ఏదైనా జరిగితే చింటూ బాధ్యత రోహిణీ మీదే పడుతుంది. ఈ సమస్య నుంచి రోహిణీ ఎలా బయటపడుతుందో టీవీ కంటే ముందుగా మీ కోసం... 

4 Min read
Author : ramya Sridhar
Published : Feb 02 2026, 08:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Gunde Ninda Gudi Gantalu
Image Credit : Jio Hotstar

Gunde Ninda Gudi Gantalu

బాలు, మీనా.. రవి, శ్రుతిలతో గొడవ పడిన విషయం తెలిసిందే. అది చూసి ప్రభావతి సంతోషంతో ఆనంద తాండవం చేస్తుంది. అయితే.. ఎప్పుడూ మంచిగా ఉండే వీళ్లు గొడవ పడటంతో సత్యం కంగారు పడతాడు. బాలుని ప్రశ్నించినా.. సరిగా సమాధానం చెప్పకుండా కారు తుడుచుకోవడానికి వెళ్లిపోతాడు. విషయం ఏంటో తెలుసుకోవడానికి సత్యం.. బాలు వెనకే వెళతాడు.. బాలు కారు తుడుచుకుంటుండగా.. సత్యం అరుస్తాడు. దీంతో.. బాలు కంగారు పడటం చాలా ఫన్నీగా ఉంటుంది.

‘ రేయ్.. ఏం జరుగుతోందిరా ఇంట్లో..?’ అని సత్యం అడుగుతాడు. దానికి బాలు.. ఏమైంది నాన్న అని అంటే.. ‘ ఇన్ని రోజులు నువ్వు ఆ మనోజ్ గాడు గొడవలు పడేవాళ్లు. కానీ తోటి కోడళ్లు గొడవ పడటం నేను చూడలేదు. రోహిణీ ఎప్పుడైనా కోపం తెచ్చుకునేది కానీ.. శ్రుతి, మీనా ఎందుకు గొడవపడుతున్నారు? నువ్వు వాళ్లకు సర్ది చెప్పాల్సింది పోయి.. ఎందుకు ఎగదోస్తున్నావు? ఆ రవి గాడు కూడా రెచ్చి పోతున్నాడు? ఏమైంది మీ అందరికీ ..?’ అని సత్యం అడుగుతాడు. ‘ దీనంతటికీ కారణం అమ్మ’ అని బాలు చెబుతాడు. ‘ మీ అమ్మ ఏం చేసింది?’ అంటే.. బాలు జరిగింది చెబుతాడు. ‘ శ్రుతి వాళ్ల అమ్మను కలిసిందని, మీనా, శ్రుతి అక్కాచెల్లెళ్లలా ఉంటారు కదా... శ్రుతి.. మీనాకి సపోర్ట్ చేస్తుంది కదా.. మీనా శ్రుతిని చెడగొట్టి. అమ్మమీదకు ఉసిగొల్పుతోందని.. అమ్మ వెళ్లి.. శ్రుతి వాళ్ల అమ్మకు చెప్పింది.ఆవిడ వచ్చి.. మీనాని తిట్టింది ’ అని బాలు అంటాడు.‘ మరి.. మీరు ఎందుకు గొడవ పడుతున్నారు?’ అని సత్యం అడిగితే.. జరిగిన విషయం బాలు చెబుతాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
గొడవ పడినట్ల నాటకం...
Image Credit : Jio Hotstar

గొడవ పడినట్ల నాటకం...

మీనా వాళ్ల అమ్మ వచ్చి మీనాని తిట్టడం దూరం నుంచి బాలు చూస్తాడు. ఆవిడతో గొడవ పడాలని మీనాని తీసుకొని బాలు కారులో బయలుదేరతాడు. అయితే.. వాళ్లతో గొడవ పడొద్దని.. మీనా నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ, బాలు వినడు. ‘ నా పెళ్లాంని ఎవరైనా ఏదైనా అంటే నేను ఊరుకోను’ అని బాలు అంటాడు. అప్పుడు.. అసలు ఈ గొడవకు కారణం ప్రభావతి అని మీనా చెబుతుంది. దీంతో.. ఇద్దరూ కాసేపు వాదించుకుంటూ ఉంటారు. దీంతో.. ఇద్దరూ కలిసి ప్లాన్ వేస్తారు. రవి, శ్రుతితో గొడవ పడదాం అని మీనా సలహా ఇస్తుంది. కావాలని గొడవ పడినట్లు నాటకం ఆడిన విషయం మొత్తం బాలు చెబుతాడు. వాళ్లు గొడవ పడుతున్నట్లు... ఫన్నీగా చేయడం చాలా బాగుంటుంది.అదంతా బాలు చెప్పడంతో సత్యం ఊపిరిపీల్చుకుంటాడు. ముందే రవి, శ్రుతికి ఫోన్ చేసి చెప్పామని.. అందుకే కలిసి నాటకం ఆడాం అని బాలు చెబుతాడు. ఇలానే ప్రతిరోజూ గొడవలు పడతారా? అని సత్యం అడిగితే.. అమ్మ తృప్తి పడేవరకు ఇలానే చేస్తాం అని బాలు చెబుతాడు. సత్యం మాత్రం.. చాలా సంతోషపడతాడు.

Related Articles

Related image1
Gunde Ninda Gudi Gantalu: ప్రభావతి పెట్టిన చిచ్చు.. ఉప్పు, నిప్పులా గొడవ పడిన మీనా, శ్రుతి..!
Related image2
Gunde Ninda Gudi Gantalu: రోహిణీతో కలిసి ప్రభావతి మాస్టర్ ప్లాన్.. మీనాని తిట్టిన శ్రుతి తల్లి
34
తల్లికి శ్రుతి వార్నింగ్...
Image Credit : Jio Hotstar

తల్లికి శ్రుతి వార్నింగ్...

ఇక శ్రుతి, రవి మాట్లాడుకుంటూ ఉంటారు. మనం గొడవ పడ్డాం కదా.. మీ అమ్మ నమ్మిందా? అని శ్రుతి అడిగితే..‘ నమ్మింది.. ఇప్పుడు కూడా నన్ను పిలిచి ఇలా జరుగుతుందని నేను ముందే చెప్పాను కదా అని అంటోంది’ అని రవి చెబుతాడు.సీరియల్ లో విలన్ క్యారెక్టర్ అని శ్రుతి అంటే..‘ మా అమ్మకు మొదటి నుంచి మీనా వదిన అంటే నచ్చదు. నువ్వు వెళ్లి మాట్లాడి ఉంటే గొడవ ఇంకాస్త పెద్ది అయ్యేది. ఆ గొడవకు మీనా వదినే కారణం అని మా అమ్మ మళ్లీ వదిననే తిట్టేది.. మీరు మాట్లాడుకోకుండా ఉంటున్నారని.. ఆవిడ సంతోషిస్తోంది’ అని రవి చెబుతాడు. ఇలా నాటకం ఆడటం కూడా భలే కిక్కు ఇచ్చింది అని శ్రుతి చెబుతుంది. ఇక ఇద్దరూ కలిసి మీనాని పొగుడుతారు. తర్వాత.. శ్రుతి.. వాళ్ల అమ్మకు ఫోన్ చేసి.. మీనాని తిట్టినందుకు కోప్పడుతుంది. కానీ.. శ్రుతి వాళ్ల మాత్రం ఊరుకోదు.. మీనాకి దూరంగా ఉండమని సలహా ఇస్తుంది. కానీ.. శ్రుతి తెగేసి చెబుతుంది.. ‘ నేను రవిని పెళ్లి చేసుకున్నాను.. ఇదే నా ఇల్లు... వీళ్లతోనే ఉంటాను. నాకు సలహాలు ఇవ్వకు.. ఇంకోసారి మీనా జోలికి రావద్దు’ అని వార్నింగ్ ఇస్తుంది. శ్రుతి మాటలకు వాళ్ల అమ్మకు కోపం వస్తుంది.

44
ఆస్పత్రిలో సుగుణమ్మ...
Image Credit : Jio Hotstar

ఆస్పత్రిలో సుగుణమ్మ...

ఇక.. సీన్ కట్ చేస్తే.. రోహిణీ వాళ్ల అమ్మకు హాస్పిటల్ లో చికిత్స చేస్తూ ఉంటారు. ఆమెను చూసి చింటూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే రోహిణీ అక్కడికి వస్తుంది. రోహిణీని చూసి చింటూ అమ్మ అనుకుంటూ వస్తాడు.ఇక.. రోహిణీ కూడా వాళ్ల అమ్మ సుగుణమ్మను చూసి.. ఏడుస్తుంది. సుగుణమ్మను హాస్పిటల్ లో జాయిన్ ని చేసిన వాళ్లు.. రోహిణీని తిడతారు. మీ అమ్మకు చిన్న పిల్లాడిని వదిలేసి.. ఇలా వెళ్లిపోతావా అంటూ బుద్ధి చెప్పి వాళ్లు వెళ్లిపోతారు.

చాలా సేపటి తర్వాత సుగుణమ్మ కళ్లు తెరుస్తుంది. తనకు ఏం జరిగిందో చెబుతుంది.. ఆరోగ్యం బాగోనప్పుడే ముందే ఆస్పత్రికి వెళ్లొచ్చు కదా..అని రోహిణీ తిడుతుంది. అప్పుడే డాక్టర్ వస్తుంది. ‘ హార్ట్ పేషెంట్ ని ఒంటరిగా వదిలేయకూడదని మీకు తెలీదా?’ అని తిడుతుంది. హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని.. ఒంటరిగా ఉంచకూడదని, దగ్గర ఉండి చూసుకోవాలని డాక్టర్ చెబుతుంది.కనీసం కేర్ టేకర్ ని అయినా పెట్టమని డాక్టర్ సలహా ఇస్తుంది. రోహిణీ సరే అంటుంది.తర్వాత.. తల్లిని, చింటూని ఎలా చూసుకోవాలా అని ఆలోచిస్తుంది. ఎవరైనా కేర్ టేకర్ ని పెట్టాలి అని నిర్ణయించుకుంటుంది.

ఇక.. బాలు ట్రిప్ కి వెళతాడు. కారులో ఎక్కిన ప్యాసింజర్.. పెళ్లి చూపులకు వెళ్తూ ఉంటాడు. ఇక.. బాలు సలహాలు ఇస్తాడు. వీళ్లు వెళ్తున్న కారును మీనా డ్యాష్ ఇస్తుంది. ఇద్దరూ కాసేపు గొడవ పడతారు.ఒకరికొకరు తెలియని వాళ్లలా గొడవ పడటం చాలా సరదాగా ఉంటుంది. కారులో అతనేమో.. పెళ్లి చూపులకు లేట్ అవుతుందని టెన్షన్ పడుతూ ఉంటాడు. వీళ్లు మాత్రం గొడవలు పడుతూనే ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. కమింగప్ లో.. రోహిణీ అబద్ధం చెప్పి మనోజ్ కి దొరికిపోతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్‌ వార్నింగ్‌
Recommended image2
Ram Prasad Remuneration: రామ్‌ ప్రసాద్‌కి మైండ్‌ బ్లాక్‌ అయ్యే పారితోషికం.. బుల్లితెర స్టార్‌కి ఝలక్‌
Recommended image3
Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?
Related Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: ప్రభావతి పెట్టిన చిచ్చు.. ఉప్పు, నిప్పులా గొడవ పడిన మీనా, శ్రుతి..!
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: రోహిణీతో కలిసి ప్రభావతి మాస్టర్ ప్లాన్.. మీనాని తిట్టిన శ్రుతి తల్లి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved