- Home
- Entertainment
- TV
- Coolie movie: కూలి సినిమా కన్నా ముందు రజినీకాంత్, నాగ్ కలిసి నటించిన సినిమా ఏదో తెలుసా?
Coolie movie: కూలి సినిమా కన్నా ముందు రజినీకాంత్, నాగ్ కలిసి నటించిన సినిమా ఏదో తెలుసా?
ప్రస్తుతం కూలి సినిమా ట్రెండింగ్ లో ఉంది. నాగార్జున, రజనీకాంత్ కలిసి నటిస్తున్న ఈ సినిమాకు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా ఎంతోమందికి నచ్చింది. ముఖ్యంగా వీళ్ళ కాంబినేషన్ ఆసక్తికరంగా ఉంది.

కూలీ సినిమాలో రజినీ నాగ్
మల్టీ స్టారర్ మూవీ అంటేనే సినిమా అభిమానుల్లో విపరీతమైన క్రేజ్. ఇద్దరు హీరోలు ఒక సినిమాలో కనిపిస్తే డబుల్ ధమాకాలాగా అనిపిస్తుంది. ఇప్పుడు కూలి సినిమాలో రజనీకాంత్, నాగార్జున కలిసి నటిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ మూవీకి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకు రజనీకాంత్, నాగార్జున కలిసి నటించలేదని ఎంతోమంది భావిస్తున్నారు. నిజానికి వాళ్ళిద్దరూ కలిసి గతంలోనే నటించారు. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు.
శాంతి క్రాంతి సినిమా
34 ఏళ్ల క్రితం శాంతి క్రాంతి అనే మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించారు. ఇందులోనే రజినీకాంత్, నాగార్జున కలిసి నటించారు. దీనికి దర్శకుడు కర్ణాటకకు చెందిన రవిచంద్రన్. ఈ సినిమాను నాలుగు భాషల్లో తెరకెక్కించారు. తెలుగులో కూడా ఈ సినిమాను విడుదల చేశారు. తెలుగులో నాగార్జున, రవిచంద్రన్ ఈ మూవీలో కలిసి నటించారు. కానీ తమిళం, హిందీలో మాత్రం నాగార్జునకు బదులు రజనీకాంత్ నటించారు. రజినీకాంత్, నాగార్జున ఒకే స్క్రీన్ పైన కనిపించకపోయినా... షూటింగ్ మాత్రం అందరికీ ఒకేసారి జరిగింది. ఇది భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ అట్టర్ ప్లాఫ్ గా మిగిలిపోయింది. కేవలం ఒక్క భాషలో కూడా ఈ సినిమా సరిగా ఆడలేదు. ఇది ఒక డిజాస్టర్ అనే చెప్పుకోవాలి.
తెలుగులో పోలీస్ బుల్లెట్ సినిమా
ఈ సినిమాను తెలుగులో పోలీస్ బుల్లెట్ అనే పేరుతో రిలీజ్ చేశారు. కనీసం ఆ సినిమా ఎవరికీ గుర్తులేదు. ఆ సినిమాలో నటించిన వారికి కూడా ఈ సినిమా గుర్తు ఉండడం చాలా కష్టం. ఈ సినిమా శాంతి క్రాంతి పేరుతో 1991లోనే సెప్టెంబర్ 19న కన్నడ, తెలుగులో విడుదలైంది. ఆ కాలంలోనే నాలుగు భాషల్లో విడుదలైన మల్టీస్టారర్ చిత్రంగా ఇది రికార్డులను సొంతం చేసుకోండి. ఇక హీరోయిన్లుగా జుహీ చావ్లా, కుష్బూ నటించారు.
భారీ బడ్జెట్ సినిమా
మూడు ఇండస్ట్రీల నుండి ముగ్గురు సూపర్ స్టార్లతో పాన్ ఇండియా చిత్రంగా నిలిచిన శాంతి క్రాంతి అప్పట్లోనే ఎక్కువ ఖర్చు పెట్టి తీసిన సినిమాగా గుర్తింపు పొందింది. కానీ అది 8 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టగలిగింది. ఆ సినిమా నిర్మాత దివాలా తీసేంత దారుణ స్థితికి చేరుకున్నాడు. 1991 లోనే 10 కోట్ రూపాయల భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మించారు. 34 ఏళ్ల క్రితం 10 కోట్ల రూపాయలు అంటే చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. ఆ సమయంలో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా ఇది నిలిచింది.
దారుణంగా నష్టపోయినా హీరో
రవిచంద్రన్ తన జీవితాంతం పొదుపు చేసిన డబ్బును ఈ సినిమా కోసం ఖర్చు చేశాడు. క్లైమాక్స్ చిత్రీకరణ కోసం ఏకంగా 50 ఎకరాలకు ఖాళీ స్థలాన్ని అద్దెకు తీసుకున్నాడు. విఎఫ్ఎక్స్ కోసం పెద్ద సెట్లను వేశాడు. కానీ అతను ఊహించని విధంగా ఇది ఘోర పరాజయం పాలైంది. ఆ సినిమా తర్వాత తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్ళాడు. చివరికి బి గ్రేడ్ సినిమాలు రీమేకులు చేసి తన కెరీర్ను తిరిగి పుంజుకునేలా చేశాడు. రజినీకాంత్, నాగార్జున, రవిచంద్రన్ ఎంతో అద్భుతంగా శాంతి క్రాంతి సినిమాలో నటించారు.