- Home
- Entertainment
- TV
- Brahmamudi january 5th Episode: కావ్యకు ముద్దుపెట్టి ప్రపోజ్ చేసిన రాజ్, అనామిక పనికి షాకైన దుగ్గిరాల కుటుంబం
Brahmamudi january 5th Episode: కావ్యకు ముద్దుపెట్టి ప్రపోజ్ చేసిన రాజ్, అనామిక పనికి షాకైన దుగ్గిరాల కుటుంబం
వాళ్లు కూడా తలా ఒక దుప్పటి తెచ్చుకొని.. దానిని చుట్టుకొని.. వీళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి వస్తారు. సేమ్.. నిన్నే పెళ్లాడతా మూవీలో సీన్ గుర్తుకు వస్తుంది.

Brahmamudi
Brahmamudi january 5th Episode:దుగ్గిరాల కుటుంబ సభ్యులంతా ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడటం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. రాజ్ వంతు వస్తుంది. రాజ్ ఎందుకైనా మంచిదని డేర్ ఎంచుకుంటాడు. అయితే.. కళ్యాన్.. రాజ్ ని కావ్యకు ప్రపోజ్ చేయమని అంటాడు. అపర్ణ వద్దు అన్నా.. కళ్యాణ్ వినిపించుకోడు. ఇక.. తప్పక రాజ్.. మోకాలి పై కూర్చని పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. తర్వాత నుదిటిపై ముద్దు పెడతాడు. ఆ సీన్ చూసి అందరూ సంతోషిస్తే.. అపర్ణ మాత్రం ముఖం మాడుస్తుంది. ఆమెకు అది చూడటం కూడా నచ్చదు. దీని తర్వాత.. అందరూ పడుకొని నిద్రపోతారు.
Brahmamudi
అందరూ నిద్రపోయిన తర్వాత.. కళ్యాన్.. నెమ్మదిగా అనామిక కోసం వెళతాడు. అనామిక అనుకొని రుద్రాణిని లేపబోతాడు. తర్వాత.. చూసుకొని మళ్లీ అనామికను లేపుతాడు. ఎవరికీ అనుమానం రాకుండా చిన్నగా.. ఇంటి పెరటిలోకి తీసుకొని వెళతాడు. అక్కడ ఊగే ఉయ్యాల బల్ల మీద ఇద్దరూ కూర్చొని దుప్పటి కప్పుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఇంట్లో వాళ్లు గమనించి.. వాళ్లు కూడా తలా ఒక దుప్పటి తెచ్చుకొని.. దానిని చుట్టుకొని.. వీళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి వస్తారు. సేమ్.. నిన్నే పెళ్లాడతా మూవీలో సీన్ గుర్తుకు వస్తుంది.
Brahmamudi
కళ్యాన్ అనామికతో.. తమ ఇంట్లో వాళ్ల అందరి గురించి చెబుతూ ఉంటాడు. వీళ్లు అదంతా వినేస్తూ ఉంటారు. తర్వాత.. తనకు ముద్దు కావాలని అడుగుతాడు. అనామిక సిగ్గుపడుతూ ఉంటుంది.
Brahmamudi
అది చూసి రుద్రాణి.. చిరాకుగా త్వరగా కానిస్తే.. వెళ్లి పడుకుంటాం అని అంటుంది. అది విని వీళ్లిద్దరూ షాకై దుప్పటి తీసి చూస్తారు. అందరూ అక్కడే ఉండటం చూసి అనామిక సిగ్గుపడుతుంది. కళ్యాన్ ని అపర్ణ కాసేపు ఆట పట్టిస్తుంది.
Brahmamudi
మరుసటి రోజు ఉదయాన్నే కావ్య కిచెన్ లో వంట చేయడానికి వెళితే.. అనామిక వెళ్లి తానే ఈ రోజు కాఫీ పెడతాను అంటుంది. అదే సమయానికి ధాన్యలక్ష్మి, రుద్రాణి కూడా వస్తారు. అనామికను చూసి మెచ్చుకుంటారు. అంత డబ్బు ఉండి, గారాభంగా పెరిగినా కూడా కిచెన్ లోకి వచ్చిందని అనామికను పొగుడుతూ.. కావ్య పై సెటైర్లు వేస్తారు. అది చూసి కావ్య చాలా బాధపడుతుంది.
ఆ తర్వాత అనామిక కాఫీ కలుపుతాను అని.. కాఫీ పొడికి బదులు టీ పొడి వేస్తుంది. కావ్య చెప్పబోతుంటే అనామిక వినిపించుకోదు. తనకు తెలుసు అని బిల్డప్ ఇస్తుంది. తర్వాత.. వెళ్లి అందరికీ కాఫీలు ఇచ్చి... అందరూ ఒకేసారి తాగాలి అంటుంది. అందరూ సరే అంటారు. రాజ్ అయితే రోజూ.. కళావతి కాఫీ తాగి బోర్ కొట్టిందని, అనామి కాఫీ తాగుతాను అంటూ ఎక్సైట్ అవుతాడు. కానీ టేస్ట్ చూసిన తర్వాత అందరూ బిత్తరబోతారు. కావ్య పనిలో పనిగా రాజ్ మీద సెటైర్ వేస్తుంది. బాగుందా కాఫీ లాంటిటీ అని అంటుంది. ఎలా ఉంది అని అనామిక అడిగితే.. అద్భుతంగా ఉందని మెచ్చుకుంటారు.
Brahmamudi
కానీ, అదే సమయానికి కళ్యాన్ వస్తాడు. తనకు కూడా కాఫీ ఇవ్వమని అంటాడు. ఇస్తుంది. అది తాగిన తర్వాత.. అది ఎంత కమ్మగా ఉందో.. కళ్యాన్ చెబుతాడు. అనామిక నమ్మదు.అందరూ బాగుంది అన్నారు అని అంటుంది. కావాలంటే.. నువ్వే టేస్ట్ చెయ్యి అని కళ్యాణ్ అంటాడు. తాగిన తర్వాత.. అది ఎంత కమ్మగా ఉందో.. అనామికకు అర్థమౌతుంది. ఛండాలంగా ఉంది అంటుంది. తనకు కాఫీ పెట్టడం రాదు అని అర్థమైంది అంటుంది. ఈ పనులు చేయడానికి కావ్య ఉంది లే అని ఇందిరా దేవి అంటుంది. మళ్లీ.. అందరూ కావ్యను కాఫీ ఇవ్వమని అడుగుతారు.
వెంటనే రుద్రాణి.. నువ్వేమీ బాధపడకు అనామిక. నువ్వు గారాభంగా పెరిగావ్ కదా.. ఈ పనులు ఎలా వస్తాయి. కావ్య, స్వప్న అంటే.. పేదరికంలో పెరిగారు కాబట్టి.. ఈ పనులు వాళ్లకు వస్తాయి అని అంటుంది. వెంటనే స్వప్న కలగజేసుకొని.. నేను కూడా మా ఇంట్లో గారాభంగా పెరిగాను అని అంటుంది. రుద్రాణి, స్వప్న గొడవ మొదలౌతుంి. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.
కమింగ్ అప్ లో రాజ్ , శ్వేత తో కలిసి రోడ్డు మీద ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు. అది కావ్య కంట పడింది. ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు అని అడిగితే... ఆఫీసులో ఉన్నాను అని చెబుతాడు. అబద్ధం ఎందుకు చెబుతున్నాడా అని కావ్యలో అనుమానం మొదలౌతుంది.