MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • TV
  • BrahmaMudi 9th march Episode:బికినీ యాడ్ కి స్వప్న, ఆస్తి రాసిచ్చిన తాతయ్య, అనామిక పరువు తీసిన ఫ్యామిలీ

BrahmaMudi 9th march Episode:బికినీ యాడ్ కి స్వప్న, ఆస్తి రాసిచ్చిన తాతయ్య, అనామిక పరువు తీసిన ఫ్యామిలీ

నువ్వు మోడలింగ్ చేసి లక్షలు సంపాదిస్తే.. అని రాహుల్ అంటే... నువ్వు కూర్చొని తిందాం అనుకుంటున్నావా? నా సంపాదనలో నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని తెగేసి చెప్పి.. కిందకు బయలుదేరుతుంది.

4 Min read
Author : ramya Sridhar
Published : Mar 09 2024, 10:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Brahmamudi

Brahmamudi


BrahmaMudi 9th march Episode: స్వప్న మరోసారి మోడ్రన్ గా రెడీ అయ్యి..ఓ టీవీ యాడ్ కోసం రెడీ అవుతుంది.  అది దూరం నుంచి రుద్రాణి, రాహుల్ చూస్తారు. దానికి ఎంత పొగరు మమ్మీ.. నిన్న ఇంట్లో అంత రచ్చ జరిగినా.. మళ్లీ మోడలింగ్ చేయబోతోంది అని అని రాహుల్ అంటాడు. ఇప్పుడు దానిని ఒక్కటి పీకి ఆపు మమ్మీ అని రాహుల్ అంటే.. రుద్రాణి నవ్వి.. వెళ్లనివ్వమని అంటుంది. అదేంటి మమ్మీ అంటే.. నువ్వు ఇప్పుడు వెళ్లి స్వప్నకు సపోర్ట్ గా మాట్లాడి ఎంకరేజ్ చెయ్యి.. కిందకు వచ్చిన తర్వాత చిచ్చు నేను పెడతాను అంటుంది. సరే అని రాహుల్ వెళతాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
Brahmamudi

Brahmamudi

రెడీ అవుతున్న స్వప్న దగ్గరకు వచ్చి వావ్ బ్యూటిఫుల్ అంటాడు. ఏదైనా కొత్త విషయం చెప్పమని స్వప్న అడుగుతుంది. నువ్వు మోడలింగ్ చేయడమే కరెక్ట్ అని, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అని చెబుతాడు. ఆ పని నువ్వు కూడా చేయవచ్చు అని స్వప్న అంటే.. నన్ను మోడల్ గా ఎవరు తీసుకుంటారు అని రాహుల్ అంటాడు. బతకడానికి చాలా పనులు చేయవచ్చు అని స్వప్న అంటే.. ఎందుకు.. నువ్వు మోడలింగ్ చేసి లక్షలు సంపాదిస్తే.. అని రాహుల్ అంటే... నువ్వు కూర్చొని తిందాం అనుకుంటున్నావా? నా సంపాదనలో నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని తెగేసి చెప్పి.. కిందకు బయలుదేరుతుంది.

313
Brahmamudi

Brahmamudi

అప్పుడే హాల్ లో అందరికీ కావ్య  టీ, కాఫీలు ఇస్తూ ఉంటుంది. అయితే.. స్వప్న మోడ్రన్ డ్రెస్ లో మళ్లీ బయటకు బయలుదేరడంతో చూసి షాకౌతారు. అలాగే నిలపడి చూస్తూ ఉంటారు. రుద్రాణి మాత్రం.. ఎక్కడికి అని అడుగుతుంది. అయితే.. తనకు బికినీ యాడ్ చేయమని కాల్ వచ్చిందని.. చేయడానికి వెళ్తున్నాను అని చెబుతుంది

413
Brahmamudi

Brahmamudi

 బికినీ నా అని అందరూ ఆశ్చర్యపోతారు. నిన్ననే కదా ఇంట్లో అంత పెద్ద గొడవ జరిగింది.. మళ్లీ ఎందుకు వెళ్తున్నావ్ అని రుద్రాణి అడుగుతుంది. అయితే.. తనకు, తన బిడ్డకు జీవనోపాధి కల్పించలేని సామర్థ్యం లేని మీకు.. నన్ను ప్రశ్నించే హక్కు లేదని.. తాను వెళ్తున్నాను అని స్వప్న బయలుదేరుతుంది.

513
Brahmamudi

Brahmamudi

అయితే.. వెళ్తున్న స్వప్నను ఇంటి పెద్ద సీతారామయ్య ఆపుతాడు. అమ్మా స్వప్న అని పిలుస్తాడు. ఏంటి తాతయ్య అని అడుగుతుంది. దానికి ఆయన... కడుపుతో ఉన్న నువ్వు ఇక నుంచి ఇలాంటి పనులు చేసి కష్టపడాల్సిన అవసరం లేదని..ఇదిగో అంటూ ఓ ఆస్తిపత్రం చేతిలో పెడతాడు. తాను సంపాదించిన ఆస్తి అని.. దానిని ఎవరూ అమ్మడానికి వీలు లేదని.. కాకపోతే.. దాని నుంచి వచ్చే సంపాదనను నువ్వు, నీ కొడుకు బతకడానికి వాడుకోవచ్చని చెబుతాడు. ఆ మాటకు స్వప్న సంతోషిస్తుంది. ఆ పేపర్స్ అందుకుంటుంది.

613
Brahmamudi

Brahmamudi

ఇక ఇక్కడ మొదలౌతుంది రచ్చ.. ధాన్యలక్ష్మి మొదలుపెడుతుంది. ఏం హక్కు ఉందని  స్వప్నకు అంత ఆస్తి ఇస్తారు అని ప్రశ్నిస్తుంది. స్వప్నకు పుట్టే బిడ్డ ఈ ఇంటి వారసుడు కాదని, ఆ ఆస్తి తమ బిడ్డలకు చెందాలి కానీ.. స్వప్నకు ఎలా ఇస్తారు అని అడుగుతుంది. రుద్రాణి తమ కూతురని, ఆమె కోడలికి ఆస్తి రాస్తే తప్పేంటని,, నీ పుట్టింటి ఆస్తి కాదు కదా అని ఇందిరాదేవి అంటుంది. అయినా, ధాన్యలక్ష్మి ఊరుకోదు. అసలు రుద్రాణి మీ సొంత కూతురు కాదు కదా అని అంటుంది.

713
Brahmamudi

Brahmamudi

ఆ మాటకు రుద్రాణికి కాలుతుంది. నీ మనసులో ఇంత విషం ఉందా? కొంచెం ఆస్తి ఇస్తేనే ఇంత రచ్చ చేస్తావా అని అడుగుతుంది. వెంటనే అనామిక అందుకొని.. అందులో అబద్ధం ఏముందని? తమ అత్త చెప్పిందే నిజం కదా అని అడుగుతుంది.  ఇక ధాన్యలక్ష్మి, అనామిక ఇద్దరూ కలిసి.. స్వప్నకు ఆస్తి ఇవ్వడానికి వీలు లేదని మాట్లాడతారు.

813
Brahmamudi

Brahmamudi

ఇక స్వప్న అందుకుంటుంది. నువ్వు ఈ ఇంటి పెద్ద నిర్ఖయాన్ని వ్యతిరేకిస్తున్నావా? మీ అత్త అడిగిందంటే అర్థం ఉంది.. పిల్ల కాకివి నీకెందుకె? నీ బుద్దే వంకర అని తిడుతుంది. కళ్యాణ్ కూడా.. అనామికను ఆగమని అంటాడు. అయినా అనామిక వినదు. ధాన్యలక్ష్మి కూడా.. ఆ ఆస్తి ఎలా ఇస్తారు అని ప్రశ్నిస్తుంది. మధ్యలో ఇందిరాదేవి.. ధాన్యలక్ష్మికి బుద్ధి వచ్చేలా క్లాస్ పీకుతుంది. అపర్ణ, సుభాష్ లు కూడా ధాన్యం, అనామికలదే తప్పు అన్నట్లుగా మాట్లాడతారు. ఈ ఇంట్లో సీతారామయ్య తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించే హక్కు ఎవికీ లేదని అంటారు.

913
Brahmamudi

Brahmamudi

ఇక,.. సుభాష్ అయితే..  ప్రకాశం ని కూడా తిడతాడు. నీ పెళ్లాం, నీ కొడలు ఇలా మాట్లాడుతున్నారంటే.. అది నీ చేతగాని తనమే అవుతుంది అంటాడు. అంతే.. వెంటనే ప్రకాశం.. భార్యను తిట్టి.. అక్కడి నుంచి లాక్కొని వెళతాడు. ఇక కళ్యాణ్ కూడా.. మా అమ్మకే మాట్లాడే హక్కు లేదు... ఇక నీకు ఎక్కడ ఉంటుంది..? అని కళ్యాణ్ అరవడంతో అనామిక కూడా ముఖం మాడ్చుకొని లోపలికి వెళ్లిపోతుంది. ఇక.. తన గురించి ఆలోచించి నిర్ణయం తీసుకున్నందుకు స్వప్న థ్యాంక్స్ చెబుతుంది.

1013
Brahmamudi

Brahmamudi

తన ప్లాన్స్ అన్నీ ప్లాప్ అవుతున్నాయని అనామిక ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఆమెకు వాళ్ల అమ్మ కళ్యాణి ఫోన్ చేస్తుంది. అక్కడి విశేషాలు ఆరా తీస్తుంది. అయితే.. తన ప్లాన్స్ అన్నీ ప్లాప్ అవుతున్నాయని, స్వప్న, కావ్యలు తన ప్లాన్స్ తిప్పి కొడుతున్నారని చెబుతుంది. నీ మొగుడు ఏం చేస్తున్నాడు అంటే తనకు దూరంగా ఉంటున్నాడని, కనీసం గదిలోకి కూడా రావడం లేదని, బయట పడుకుంటున్నాడని చెబుతుంది. ఆ మాటలకు వాళ్లమ్మ.. ముందు మొగుడిని లైన్ లో పెట్టుకోమని సలహా ఇస్తుంది. దాని కోసం ఏం చేయాలో ఓ ఐడియా ఇస్తుంది. సరే మమ్మీ అని అనామిక ఫోన్ పెట్టేస్తుంది.

1113
Brahmamudi

Brahmamudi

ఇక... కావ్య కిచెన్ లో ఉంటుంది. తనతోనే ఇందిరాదేవి కూడా ఉంటుంది. రాజ్ మాత్రం చాలా సంతోషంగా గంతులు వేసుకుంటూ కిందకు వస్తాడు. ఆ బావగాడు లేకపోవడంతో చాలా సంతోషంగా ఉందని.. ఇఫ్పుడు ఆ కళావతికి ఏది చెప్పినా ఓవర్ యాక్షన్ చేయకుండా చెప్పింది చేస్తుందని అనుకుంటాడు. వెంటనే కావ్యను పిలిచి.. బ్లాక్ కాఫీ ఇవ్వమని చెబుతాడు. చెప్పగానే పనులన్నీ చేస్తుందని రాజ్ సంబరపడుతూ ఉంటాడు. మీ బావ రాలేదని కాఫీ అడిగాడు అని  ఇందిరాదేవి అంటే... ఆ బావను చూసి షాకౌతాడు అని అంటుంది. బావ వచ్చాడని తెలిస్తే.. నా పీక పిసుకుతాడు అని కావ్య అంటే.. వెనకే నేను వస్తాను అని అని ఆమె చెబుతుంది.

1213
Brahmamudi

Brahmamudi

తర్వాత కాఫీ తీసుకుని వచ్చిన కావ్య.. కాఫీతో పాటు ప్రోటీన్ షేక్ కూడా తెస్తుంది. అది చూసి బావ లేడు కదా అంటే.. వచ్చాడని గార్డెన్ లో ఉన్నాడు అని చెబుతుంది. ఎవరు రమ్మన్నారు అని అరిస్తే.. నేనే అని ఇందిరా దేవి ఎంట్రీ ఇస్తుంది. పాపం కాలు కాలింది కదా అని  ఆమె అంటే.. నాకు కూడా కాలింది అని రాజ్ అంటాడు. రాజ్ ఇబ్బందిచూసి.. నీకు ఏమైనా ఇబ్బందా అని అడుగుతుంది లేదని రాజ్ చెబుతాడు.  కాసేపు కావ్య, ఇందిరాదేవిలు రాజ్ ని ఆడుకుంటారు. మీ బావను జాగ్రత్తగా చూసుకోమని పెద్దావిడ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది.

1313
Brahmamudi

Brahmamudi


రాజ్ దూరం నుంచి కూడా కావ్యను, వాళ్ల బావను చూస్తూ ఉంటాడు. అది కావ్య కంట పడుతుంది. ఇక ఓవర్ యాక్షన్ చేయడం మొదలుపెడుతుంది. అది చూసి రాజ్ తిప్పలు తిప్పలు కావు. భాస్కర్ కావ్యలు సరదాగా ఉంటే.. రాజ్ కి మండిపోతూ ఉంటుంది. ఇక రాజ్ లోని ఆత్మ బయటకు వస్తుంది. నువ్వు ఆలస్యం చేస్తే.. కావ్య నీకు దూరం అవుతుందని.. నీ లోపల కళావతిపై ఉన్న ప్రేమను బయటపెట్టమని చెబుతాడు. కళావతి ముఖం వాళ్ల బావతో ఉన్నప్పుడు కలకలలాడుతోందని అంటాడు. నువ్వు ఆలస్యం చేస్తే... వాళ్ల బావ ఎగరేసుకొని పోతాడు అని చెబుతాడు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved