MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • TV
  • BrahmaMudi 30th march Episode:రుద్రాణి కుట్రకు రాజ్ బలి, కావ్య జోలికొస్తే ఊరుకోను స్వప్న మాస్ వార్నింగ్..!

BrahmaMudi 30th march Episode:రుద్రాణి కుట్రకు రాజ్ బలి, కావ్య జోలికొస్తే ఊరుకోను స్వప్న మాస్ వార్నింగ్..!

కళ్యాణ్ కి ఎలాగూ కవితలు రాయడం తప్ప క్లైంట్స్ ని డీల్ చేయడం రాదు కాబట్టి.. ఎలాగైనా నిన్ను వారసుడిని చేయాలని పట్టుపడతాను అని రుద్రాణి తన మాస్టర్ ప్లాన్ ని బయటపెడుతుంది.  

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 30 2024, 09:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Brahmamudi

Brahmamudi


BrahmaMudi 30th march Episode:రుద్రాణి, రాహుల్ బెడ్రూమ్ లో తెగ ఆలోచిస్తూ ఉంటారు.  రాజ్ చేసిన పనిని ఎలా క్యాష్ చేసుకోవాలా అని రుద్రాణి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మమ్మీ అని రాహుల్ అడిగితే.. రాజ్ అంత పని చేసినా.. మనం దానిని క్యాష్ చేసకోలేకపోతున్నాం రా అని అంటుంది. రాజ్ పెళ్లి రోజున బిడ్డను ఎత్తు కొని వచ్చినా కూడా.. ఇంట్లో అందరూ నిలదీసి.. ఆ తర్వాత వదిలేశారు.. అని రుద్రాణి అంటుంది. రాజ్ కాబట్టి.. ఇంట్లో వాళ్లు ఎవరూ ఏమీ అనలేదు.. అదే  నన్ను అయితే ఊరుకుంటారా అని రాహుల్ అంటాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Brahmamudi

Brahmamudi

దానికి రుద్రాణి రివర్స్ లో కొడుకును తిడుతుంది. నీకు రాజ్ తో పోలికేంట్రా.. నువ్వు అలా బిడ్డను తీసుకువస్తే.. నేను ఇంట్లోనే నర్సరీ స్కూల్ పెట్టాల్సి వస్తుంది. వాడితో పోల్చుకోకు. అది కాదు మనం ఆలోచించాల్సింది. ఈ కారణం చూపించి మనం రాజ్ ని వారసుడిగా తీసేసేలా చేయాలి. కళ్యాణ్ కి ఎలాగూ కవితలు రాయడం తప్ప క్లైంట్స్ ని డీల్ చేయడం రాదు కాబట్టి.. ఎలాగైనా నిన్ను వారసుడిని చేయాలని పట్టుపడతాను అని రుద్రాణి తన మాస్టర్ ప్లాన్ ని బయటపెడుతుంది.

35
Brahmamudi

Brahmamudi

అప్పుడే స్వప్న ఎంట్రీ ఇస్తుంది. చప్పట్లు కొట్టుకుంటూ లోపలికి వస్తుంది. ఇలాంటి ప్లాన్స్ వేయడానికి కొంచెం అయినా బుద్ధి ఉందా అని తిడుతుంది.  రాజ్ తప్పు చేసి ఉండొచ్చు కానీ... ధాన్యలక్ష్మి ఆంటీతో గొడవ జరిగదినప్పుడు ఆయన మీకు ఆడపడుచు హోదా ఇచ్చాడు. అయినా.. ఇలా చేయడానికి మీకు మనసు ఎలా వస్తుంది. కొంచెం అయినా కృతజ్నత అనేది లేదా మీకు అని ప్రశ్నిస్తుంది.  ఏదైనా తేడా వస్తే... తల్లీ, కొడుకులు ఇద్దరూ... రోడ్డున పడతారు జాగ్రత్త అని హెచ్చరిస్తుంది.

45
Brahmamudi

Brahmamudi

మేం రోడ్డున పడితే.. నువ్వేమీ అవుతావ్..? అమెరికాలో ఉంటావా..? నువ్వు కూడా రోడ్డునే పడతావ్ అని రాహుల్ అంటాడు. అయితే.. స్వప్న తనకు మాత్రం అలాంటి పరిస్థితి రాదు అని..  తాతయ్య గారు తనకు తరిగిపోని ఆస్తి ఇఛ్చారని, తాను తన కొడుకు కూర్చొని తిన్నా కరిగిపోదు అని చెబుతుంది. తనకు  వచ్చిన కష్టం ఏమీ లేదు అని చెబుతుంది. ఇక..వెళ్లే ముందు... మీరు ఏం చేసుకుంటారో నాకు అనవసరం కానీ.. మా చెల్లి కావ్య జీవితాన్ని నాశనం చేస్తాను అంటే మాత్రం అస్సలు ఊరుకోను అని మాస్ వార్నింగ్ ఇచ్చేసి  అక్కడి నుంచి వెళ్లిపోతుంది.  స్వప్న ఇచ్చిన వార్నింగ్ కి రుద్రాణి, రాహుల్ లు షాకౌతారు.

55
Brahmamudi

Brahmamudi

కానీ.. కమింగప్ ప్రోమో చూస్తుంటే.. రుద్రాణి తన ప్లాన్ అమల్లోకి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇంట్లో అందరి ముందు... రాహుల్ ని వారసుడిగా తీసేయాలని రచ్చ మొదలుపెడుతుంది.  రుద్రాణి దెబ్బకు.. అపర్ణ కూడా.. రాజ్ ని నిలదీస్తుంది. బిడ్డను వదిలించుకోని రాకపోతే.. వారసుడి పోస్ట్ నుంచి తప్పుకోవాలని చెబుతుంది. మరి.. బిడ్డను వదిలించుకోవడానికి అయితే.. రాజ్ సిద్ధంగా లేడు.. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved