MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • BrahmaMudi 2nd march Episode: అత్తారింట్లో అల్లుళ్ల గోల.. కనకం దెబ్బకు విలవిలలాడుతున్న రాజ్..!

BrahmaMudi 2nd march Episode: అత్తారింట్లో అల్లుళ్ల గోల.. కనకం దెబ్బకు విలవిలలాడుతున్న రాజ్..!

ఇందిరాదేవి కనకం కి ఫోన్ చేసి.. మీ కూతురిని, మేనల్లుడిని పిలుచుకొని.. అల్లుడిని పిలవరా అని సీరియస్ అవుతుంది. రాజ్ కి ఫోన్ ఇచ్చి పిలవమని చెబుతుంది,

3 Min read
Author : ramya Sridhar
Published : Mar 02 2024, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Brahmamudi

Brahmamudi

BrahmaMudi 2nd march Episode: కావ్య తన పుట్టింటికి వెళ్లాలి అని రాజ్ ని అడుగుతుంది. రాజ్.. సంతోషంగా వెళ్లి రమ్మని చెబుతాడు. వెంటనే తన బావ కూడా వస్తున్నాడని.. వాళ్ల బావ అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి మా ఇంటికి రాలేదని.. మా అమ్మ తీసుకురమ్మంది అని కావ్య చెబుతుంది. ఆ మాట విని రాజ్ షాకౌతాడు. వీళ్లిద్దరినీ విడదీయాలి అనుకుంటే.. ఇలా జరిగింది ఏంటా అనుకుంటారు. కావ్య, భాస్కర్ లు బట్టలు సర్దుకోవడానికి వెళతారు. ఎలాగైనా తాను కూడా అక్కడికి వెళ్లాలి అని రాజ్ నిర్ణయించుకుంటాడు. అయితే.. కావ్య, భాస్కర్ లు వెళ్లి.. ఏ కారణంతో ఆయన మాతో వస్తాను అంటారో అర్థం కావడం లేదని చెబుతారు. ఆ సంగతి నేను చూసుకుంటాను అని ఇందిరా దేవి చెబుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Brahmamudi

Brahmamudi

రాజ్ తన బెడ్రూమ్ లోకి వెళ్లి జట్టుపీక్కుంటూ ఉంటాడు. కళావతిని ఇంటికి పిలిచి, ఆ బావను కూడా పిలిచారు.. కానీ నన్ను మాత్రం పిలవలేదు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇందిరాదేవి వస్తుంది. కావాలనే రాజ్ ని ఏడిపించాలని కాసేపు వేరేవాళ్ల సంగతి మాట్లాడుతుంది. తర్వాత...కళావతి వాళ్ల బావతో కలిసి పుట్టింటికి వెళ్తోందని.. తనను మాబత్రం పిలవలేదు అని రాజ్ చెబుతాడు.  దీంతో.. ఇందిరాదేవి కనకం కి ఫోన్ చేసి.. మీ కూతురిని, మేనల్లుడిని పిలుచుకొని.. అల్లుడిని పిలవరా అని సీరియస్ అవుతుంది. రాజ్ కి ఫోన్ ఇచ్చి పిలవమని చెబుతుంది,

38
Brahmamudi

Brahmamudi

దానికి కనకం.. మీరు మా ఇంటికి రావడానికి ఇష్టపడరు కదా.. అందుకే ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పిలవలేదు అని చెబుతుంది. మీరు వస్తే అంతకంటే భాగ్యమా  రండి అల్లుడు గారు అని చెబుతుంది. ఇలా ఫోన్ చేసి అడిగితే పిలుస్తారా..? ఏం అవసరం లేదు నేను రాను అని రాజ్ అంటే.. మీకు అంత ఇబ్బందిగా ఉంటే రాకండి అని కనకం అంటుంది. ఆ ఆన్సర్  ఊహించని రాజ్ షాకౌతాడు. పిలవకుండా ఫోన్ పెట్టేశారు అని చెబుతాడు. రాను అంటే ఎలా పిలుస్తారు.. మీరు ఎప్పుడు వచ్చినా గడపదాకే వస్తారు కదా అని కావ్య అంటుంది. తాను రాను అనే అంటానని... కానీ వాళ్లు బతిమిలాడాలి అని రాజ్ అంటాడు. అంత ఓపిక మా వాళ్లకు లేదు అని కావ్య అంటుంది.

48
Brahmamudi

Brahmamudi

వెంటనే ఇందిరాదేవి కావ్య అని కోపంగా అరుస్తుంది. నువ్వు పుట్టింటికి వెళ్లాలి అంటే.. అది మా రాజ్ తోనే వెళ్లాలి. నా మాటే శాసనం అంటుంది. మీరు అలా చెప్పాక నేను ఎందుకు కాదు అంటాను అమ్మమ్మగారు.. మీరు వెళ్లి ఫ్రెష్ అవ్వండి.. నేను మీ బ్యాగ్ కూడా సర్దుతాను అని కావ్య అంటుంది. సరే.. సాధించాను అనుకొని రాజ్  అక్కడి నుంచి వెళతాడు. తమ ప్లాన్ సక్సెస్ అని కావ్య, ఇందిరాదేవిలు సంబరపడతారు. నాకోసం మీరు చాలా చేస్తున్నారు అమ్మమ్మ అని కావ్య అంటే.. వాడు మారి వస్తే చాలు అని  ఆవిడ అంటుంది.

58
Brahmamudi

Brahmamudi

ఇక.. కనకం ఇంటికి బయలుదేరుతూ ఉంటారు. రాజ్ వెళ్లి కారు ఎక్కుతాడు. రాజ్ లేని సమయంలో అక్కడ అందరూ పర్ఫార్మెన్స్ అదరగొట్టి.. తిరిగి వచ్చే సమాయనికి కావ్యతోనే జీవితాంతం ఉంటాను అని చెప్పాలి అని ఇందిరాదేవి అంటుంది. కావ్య, భాస్కర్ సరే అంటారు. ఇక రాజ్ డ్రైవర్ సీటులో కూర్చుంటే.. భాస్కర్, కావ్య వెనక కూర్చుంటారు. అది చూసి రాజ్.. నేను ఏమైనా డ్రైవర్ అనుకుంటున్నారా అని అడుగుతాడు. అయితే.. భాస్కర్ తానే డ్రైవింగ్ చేస్తానని ముందుకు వస్తాడు.  ఈలోగా కావ్య వెళ్లి వాళ్ల బావ పక్కన కూర్చుుంటుంది. చేసేది లేక రాజ్ వెనక సీటులో కూర్చుంటాడు.

68
Brahmamudi

Brahmamudi

ఇక.. కావ్య, వాళ్ల బావ తమ చిన్ననాటి స్మృుతులు అంటూ ఏదేదో సోది మాట్లాడుతుంటే రాజ్ ఫ్రస్టేట్ అవుతాడు. పాటలు పెట్టమని అడుగుతాడు. ఆ పాటలు కూడా వాళ్లకు సెట్ అయ్యేవి రావడంతో రాజ్ కి మరింత చిరాకు వస్తుంది.

78
Brahmamudi

Brahmamudi


ఇక.. రాజ్ వస్తున్నాడని, అతని ముందు ఎలా నటించాలో అర్థం కావడం లేదని కనకం కంగారుపడుతూ ఉంటుంది. నీకు నటన రాదు అంటే ఎవరూ నమ్మరని.. నటన ఇరగదీయమని ఇందిరాదేవి చెబుతుంది. 

88
Brahmamudi

Brahmamudi

ఈలోగా రాజ్, కావ్యలు రావడంతో.. హారతి ప్లేట్ తో కనకం పరుగులు తీస్తుంది. ఇక అక్కడ నుంచి రాజ్ ని ఆడుకోవడం మొదలుపెడతారు. అల్లుడు అని భాస్కర్ ని పిలిచిన ప్రతిసారీ.. రాజ్ కంగారుపడి.. అల్లుడు కాదు.. మేనల్లుడు అని నొక్కి నొక్కి చెప్పడం చాలా ఫన్నీగా ఉంటుంది. కక్కలేక, మింగలేక రాజ్ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ప్రేక్షకులకు మాత్రం ఈ సీన్స్ బాగా అలరిస్తాయి. ఇక్కడితో ఎపిసోడ  ముగుస్తుంది.

కమింగప్ లో.. కావ్యను వాళ్ల బావ పెళ్లి చేసుకోవడానికే వచ్చాడేమో.. కావ్య నీకు కావాలి అంటే ఈ విషయం తెలుసుకో అని శ్వేత చెబుతుంది. రాజ్ అదేపనిలో ఉంటాడు.


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image2
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Recommended image3
Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved