BrahmaMudi 26th February Episode:అనామిక బుర్రలో చిచ్చపెట్టిన రుద్రాణి, రగిలిపోతున్నా రాజ్..!
రాజ్ వెళ్లిపోవడంతో భాస్కర్, ఇందిరాదేవి సంతోషంగా నవ్వుకుంటారు. శ్వేత కూడా.. దూరం నుంచి రాజ్ ని చూసి.. వీడికి తిక్క బాగా కుదిరింది అని అనుకుంటుంది.
Brahmamudi
BrahmaMudi 26th February Episode: రాజ్ మనసులో కావ్య పై ఉన్న ప్రేమను బయటకు తీయడానికి బావ భాస్కర్ బాగానే ప్రయత్నిస్తున్నాడు. దీనిలో భాగంగానే వాలంటైన్స్ డే ని అడ్డం పెట్టుకొని ఆడించాలని అనుకుంటాడు. కావ్యను తీసుకొని ఓ రెస్టారెంట్ కి వెళతాడు. అక్కడి కే రాజ్ కూడా శ్వేత ని తీసుకొని వెళతాడు. అక్కడ భాస్కర్ కేక్, బొకే ఏర్పాట్లు చేస్తాడు. భాస్కర్.. కావ్యకు ప్రపోజ్ చేయాలని అనుకుంటన్నాడని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా ఆపాలని ప్లాన్ వేస్తాడు. ఈ లోగా అక్కడికి రాజ్ నానమ్మ తాతయ్యాలు వస్తారు. వాళ్లు ఈ సీన్ చూస్తే కొంపకొల్లేరు అవుతుంది అనుకొని.. రాజ్ శ్వేతను పక్కకు తోసేసి, భాస్కర్ ని నెట్టేసి కావ్య పక్కకు చేరతాడు. వాళ్ల నానమ్మ, తాతయ్యల ముందు తానే కళావతి కోసం ఏర్పాట్లన్నీ చేసినట్లు కలరింగ్ ఇస్తాడు. సరిగ్గా అదే సమయానికి మీడియా కూడా అక్కడికి రావడంతో రాజ్.. కావ్యకు ప్రపోజ్ చేస్తాడు. కేక్ తినిపిస్తాడు.
Brahmamudi
తర్వాత.. పెళ్లైన తర్వాత కూడా భార్యభర్తల మధ్య ప్రేమ బంధం ఎందుకు ఉండాలి..? దాని అసవరం , గొప్పతనం ఏంటో ఇందిరాదేవి చక్కగా వివరిస్తుంది. తర్వాత.. కావ్యను ఆఫీసులో వర్క్ ఉంది అని రాజ్ తీసుకొని వెళ్లిపోతాడు. రాజ్ వెళ్లిపోవడంతో భాస్కర్, ఇందిరాదేవి సంతోషంగా నవ్వుకుంటారు. శ్వేత కూడా.. దూరం నుంచి రాజ్ ని చూసి.. వీడికి తిక్క బాగా కుదిరింది అని అనుకుంటుంది.
Brahmamudi
సీన్ కట్ చేస్తే.. రాజ్ , కావ్యలు కారులో ఆఫీసుకు వెళ్తూ ఉంటారు. దీంతో.. రాజ్ మీ బావతో అక్కడ ఏం చేస్తున్నావ్ అని, మీ బావ నీకు ప్రపోజ్ చేయాలి అనుకున్నాడు కదా అని అడుగుతాడు. ఏమీ తెలియనట్లుగా కావ్య నాటకం ఆడుతూ.. మా బావ అమెరికా వెళ్లినా నా మీద ప్రేమ చావలేదా..? నాకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటే పానకంలో పుడకలా వచ్చి మీరే చెడగొట్టారా అని అంటుంది. నేను రాకపోయి ఉంటే..నానమ్మ వాళ్లకు విషయం తెలిసిపోయి.. ఇంట్లో పెద్ద గొడవ జరిగేది అని రాజ్ అంటాడు. కనీసం ఇంట్లో విషయం తెలిసి ఉంటే.. మీకు లైన్ క్లియర్ అయ్యేది.. మీరు నాకు విడాకులు ఇస్తే.. నేను మా బావతో అమెరికా వెళ్లిపోతాను అని కావ్య అంటుంది. కావ్య ఎంత ఉడికించినా రాజ్ మాత్రం తన మనసులోని ప్రేమను బయటపెట్టడు.
Brahmamudi
ఇక.. ఇంట్లో అనామిక ఫోన్ చూసుకొని నవ్వుకుంటూ ఉంటుంది. రుద్రాణి వచ్చి ఎందుకు నవ్వుతున్నావ్ అని అడుగుతుంది. ఫ్రెండ్ ఏదో బెసేజ్ పంపితే నవ్వాను అని అనామిక అంటే.. జోక్ కి నవ్వితే పర్లేదు కానీ.. నువ్వు నవ్వుల పాలు కాకు అని అంటుంది. ఏమంటున్నారు అని అనామిక అడిగితే... కళ్యాణ్ ని ఆఫీసుకు పంపితే సరిపోదు.. ఆఫీసులో ఏం చేస్తున్నాడో కూడా తెలుసుకోవాలి అంటుంది. అలా చేస్తే.. అనుమాన పడుతున్నాను అని అనుకుంటాడేమో అని అనామిక అంటే.. అదే కావ్య అయితే.. భోజనం వంకతో ఆఫీసుకు వెళ్లేది అని చెబుతుంది. దీంతో అనామిక తాను కూడా కళ్యాణ్ కి భోజనం తీసుకొని వెళతాను అంటుంది. కళ్యాణ్ కి ఒక్కడికే కాదు.. అందరికీ తీసుకొని వెళ్లమని చెబుతుంది. సరే ఆంటీ అని..థ్యాంక్స్ చెప్పి.. ఆఫీసులకు లంచ్ తీసుకొని వెళ్లడానికి అనామిక రెడీ అవుతుంది.
Brahmamudi
మరోవైపు ఆఫీసులో కావ్య డిజైన్స్ పరిశీలిస్తూ ఉంటుంది. అసిస్టెంట్ శ్రుతితో ఇదే విషయం మాట్లాడుతూ ఉంటుంది. మధ్యలో రాజ్ వచ్చి.. ముచ్చట్లు పెట్టుకుంటున్నారా అని అడుగుతాడు. దీంతో కావ్య.. అవును మా బావ గురించి మాట్లాడుకుంటున్నాం అని చెబుతుంది. దానికి రాజ్ సీరియస్ అవుతాడు. క్లైంట్ కి పంపిన డిజైన్స్ ఏవని రాజ్ అడిగితే శ్రుతి చూపిస్తుంది. ఆ డిజైన్స్ బాలేవని రాజ్ అంటాడు. దీంతో కావ్య.. మా బావ వచ్చిన దగ్గర నుంచి మీలో మార్పు వచ్చిందని.. బాగున్న డిజైన్స్ కూడా బాలేవని అంటున్నారని.. మీకు గుండెల్లో రగలిపోతోంది. . కడుపులో మండుతోంది అని ఏవేవో డైలాగులతో రాజ్ ని మరింత రెచ్చ గొడుతూ ఉంటుంది. అక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.
Brahmamudi
ఇక రేపటి ఎపిసోడ్ లో కళ్యాణ్ ఆఫీసుకు వెళ్లి కూడా కవితలే రాసుకుంటున్నాడని.. అనామిక ఇంట్లో రచ్చ చేస్తుంది. కావ్య సర్దిచెప్పాలని ప్రయత్నిస్తే.. మరింత సీరియస్ అవుతుంది. ఆ తతంగం రేపటి ఎపిసోడ్ లో చూద్దాం...