MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • BrahmaMudi 1st March Episode:అనామిక కీ, అప్పూ కీ తేడా గుర్తించిన కళ్యాణ్, బావ దెబ్బకు అత్తారింటికి పరుగులు తీస

BrahmaMudi 1st March Episode:అనామిక కీ, అప్పూ కీ తేడా గుర్తించిన కళ్యాణ్, బావ దెబ్బకు అత్తారింటికి పరుగులు తీస

మీరిద్దరూ రామలక్ష్మణులని.. ప్రేమను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, మీ పిన్ని సంగతి నేను చూసుకుంటాను అని ప్రకాశం అంటాడు.

4 Min read
Author : ramya Sridhar
Published : Mar 01 2024, 10:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Brahmamudi

Brahmamudi

BrahmaMudi 1st March Episode:ధాన్యలక్ష్మి మాటలకు, అనామిక ప్రవర్తనకు ఆలోచనలో పడిన రాజ్ ఓ నిర్ణయం తీసుకుంటాడు. తమ కంపెనీల్లోని ఓ బ్రాంచ్ బాధ్యతలు కళ్యాణ్ కి అప్పగించాలని అనుకుంటాడు. దానికి తగినట్లు పేపర్స్ రెడీ చేసి.. కళ్యాణ్  చేతిలో పెడతాడు. ఇంట్లో అందరూ ఆ పేపర్స్ అందుకోమని కళ్యాణ్ కి చెబుతూ ఉంటారు. అంటే నేను కాంప్రమైజ్ అయ్యి బతకాలా అని కళ్యాణ్ అడిగితే.. మన వాళ్ల కోసం అయినా తప్పులేదు అని రాజ్ అంటాడు. నువ్వేనా అన్నయ్య ఈ మాట అంటున్నది అని కవి ఆశ్చర్యపోతే.. అన్నయ్య కాబట్టే.. మీకు ఏం చేస్తే మంచిదో ఆలోచించి చేస్తున్నారు అని కావ్య చెబుతుంది. మీరే కదా నిన్న మీకు నచ్చిన పని చెయ్యమని చెప్పారు అని కవి అడిగితే.. రెండూ బ్యాలెన్స్ చేయమని కావ్య చెబుతుంది. కానీ.. కళ్యాణ్ వినిపించుకోడు. ఇన్ని రోజులు ఇష్టం లేకుండా ఆఫీసుకు వెళ్లింది చాలని.. ఇక నుంచి తాను తనకు నచ్చిన పని మాత్రమే చేస్తాను అని కళ్యాణ్ తెగేసి చెబుతాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Brahmamudi

Brahmamudi

అది విని అనామిక.. అంటే ఏం చేస్తావ్ అని ఆవేశంగా వస్తుంది. నేను చెప్పినా నీకు అర్థం కాదులే.. నీకు నచ్చని పని చేస్తాను అని కళ్యాణ్ చెబుతాడు. ధాన్యలక్ష్మి కూడా... నీ భార్య చెబుతున్నది నీ మంచి కోసమే కదరా అని అందుకుంటుంది. తనకు 25ఏళ్లు వచ్చాయని.. ఏది మంచో, చెడో తనకు తెలుసు అని కళ్యాణ్ అంటాడు. అయితే.. కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి  ప్రకాశం సపోర్ట్ చేస్తాడు. రాజ్ వెంటనే నువ్వు కూడా ఏంటి బాబాయ్ అంటే... మీ పిన్ని ఏదో అన్నదని.. వాడికి నచ్చిన పని చేయమని చెప్పొద్దని.. నువ్వు నీ తమ్ముడిని ఎంత గొప్పగా చూసుకుంటావో.. ఎవరి ముందు నిరూపించాల్సిన అవసరం లేదు అని  ప్రకాశం అంటాడు. మీరిద్దరూ రామలక్ష్మణులని.. ప్రేమను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, మీ పిన్ని సంగతి నేను చూసుకుంటాను అని ప్రకాశం అంటాడు.

39
Brahmamudi

Brahmamudi

సరే.. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావ్ కళ్యాణ్ అని వాళ్ల పెదనాన్న సుభాష్ అడుగుతాడు. ఇక్కడ చాలా మంది తాను ఏమీ చేయలేనని తక్కువ చేసి చూస్తున్నారని.. వాళ్లకు అది తప్పు అని నిరూపించడానికి వెళ్తున్నాను అని చెబుతాడు. అంటే ఏం చేయాలని అనుకుంటున్నావ్ అని అపర్ణ అడిగితే.. తన కవితలను ఎవరైనా పబ్లిష్ చేస్తారేమో అని ప్రయత్నించడానికి వెళ్తున్నట్లు చెబుతాడు. వెంటనే అనామిక.. మీ కవితలను పబ్లిష్ చేసి పెద్ద కవి అయిపోదాం అనుకుంటున్నావా అని అడుగుతుంది. నువ్వు ఎలాగూ నన్ను నమ్మడం లేదు కదా.. నన్ను నేను అయినా నమ్ముకోవాలి కదా అని కళ్యాణ్ బదులిస్తాడు. ఎవరినో అడిగి పబ్లిష్ చేయడం ఎందుకు.. మనమే చేసుకుందాం అని రాజ్ అంటే తనకు తన మీద నమ్మకం ఉందని చెబుతాడు. అయితే.. కళ్యాణ్ కి వాళ్ల పెద్దమ్మ, పెదనాన్నలు ఆల్ ది బెస్ట్ చెబుతారు.

49
Brahmamudi

Brahmamudi

కళ్యాణ్ తన కవితలు తీసుకొని పబ్లిష్ చేయించుకోవడానికి వెళతారు. అయితే కవితలు బాగున్నాయి కానీ.. ఈ రోజుల్లో కవితలు ఎవరూ చదవరని, కథ రాయమని ఆఫర్ చేస్తారు. అది తనకు వద్దు అని కళ్యాణ్ రిజెక్ట్ చేసి వచ్చేస్తాడు.

59
Brahmamudi

Brahmamudi

మరోవైపు అనామిక, ధాన్యలక్ష్మి అన్న మాటల గురించే రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. అది తెలీకుండా కావ్య వచ్చి.. రాజ్ ని ఉడికించాలని.. పాస్ పోర్ట్ అప్లికేషన్ ఫిల్ చేయమని అడుగుతుంది. రాజ్ ఉడుక్కుంటాడు అనుకుంటుంది. కానీ.. చాలా నార్మల్ గా బిహేవ్ చేస్తాడు. దీంతో.. తమ ప్లాన్ బెడిసి కొడుతుందని కావ్య కు భయం మొదలౌతుుంది.

69
Brahmamudi

Brahmamudi


మరోవైపు కళ్యాణ్ నిరాశగా వెనక్కి వస్తుంటే.. మరో కంపెనీ వాళ్లు కూడా ఫోన్ చేస్తారు. కథ రాయమని అడుగుతారు. దానికి కూడా కళ్యాణ్ నో చెబుతాడు.  దారిలో కొబ్బరి నీళ్లు తాగుదాం అని దిగుతాడు. బోండం నీళ్లు తాగిన తర్వాత  తన దగ్గర క్యాష్ లేదని.. ఫోన్ నుంచి చేస్తాను అంటాడు. అతనేమో తన దగ్గర స్కానర్ లేదు అంటాడు. అప్పుడే అప్పూ వచ్చి డబ్బులు కడుతుంది.

79
Brahmamudi

Brahmamudi

తర్వాత ఇద్దరూ.. మాట్లాడుకుంటూ ఉంటారు. తన ఇంట్లో జరిగిన ప్రతి విషయం అప్పూకి కళ్యాణ్ చెబుతాడు. అనామిక తనను అర్థం చేసుకోవడం లేదని అంటాడు. నువ్వు అనకున్నది సాధిస్తే.. అనామిక నిన్ను అర్థం చేసుకుంటుంది లే అని అప్పూ సర్ది చెబుతుంది అలా అయితే.. అది ప్రేమ ఎలా అవుతుంది.. నువ్వు కూడా నన్ను ప్రేమించావ్ కదా.. నువ్వు ఎప్పుడూ నన్ను అలా అనలేదు కదా అని కళ్యాణ్ అంటాడు. అయితే.. తండ్రి, కొడుకులను ఉదాహరణ చూపించి.. కళ్యాణ్ కి అర్థమయ్యేలా చెబుతుంది. సరే అని.. ఇక నంచి మరింత ఎక్కువగా కష్టపడతాను అని కళ్యాణ్ అంటాడు. ఇక.. అప్పూ గురించి అడిగితే పోలీసు అవ్వాలని అనుకుంటున్నట్లు చెబుతుంది. నువ్వుు కచ్చితంగా సాధిస్తావని సపోర్ట్ చేసి.. ఆల్ ది బెస్ట్ చెబుతాడు.

89
Brahmamudi

Brahmamudi

ఇక ఇంట్లో కావ్య మన ప్లాన్ వర్కౌట్ అవ్వడం లేదని, ఇలా అయితే కష్టమే అమ్మమ్మ అని ఇందిరాదేవితో చెబుతుంది. ఇంట్లో పరిస్థితుల వల్ల రాజ్ అలా ఉన్నాడని ఆమె అర్థం చేసుకుంటుంది. అందుకే ఇక్కడ ఉంటే కరెక్ట్ కాదని.. కనకం ఇంటికి రాజ్ ని పంపించాలని అనుకుంటారు. కానీ.. అక్కడికి ఆయన రారు కదా అమ్మమ్మగారు అని కావ్య అంటే,. వచ్చేలా ప్లాన్ చేయాలి అని ఆమె చెబుతుంది. దానికి మీ బావను వాడుకోమని చెబుతుంది.

99
Brahmamudi

Brahmamudi

ఆమె చెప్పినట్లుగా కావ్య తన ప్లాన్ అమల్లోకి పెడుతుంది. రాజ్ దగ్గరకు వెళ్లి.. తాను పుట్టింటికి వెళ్లాలి అనుకుంటున్నట్లు చెబుతుంది. రాజ్ వెంటనే ఒప్పుకుంటాడు. కావ్యను వాళ్ల బావను విడదీయడానికి ఇదే కరెక్ట్ నిర్ణయం అని అనుకుంటాడు. కానీ.. వాళ్లిద్దరూ కలిసే వెళ్తున్నారని తర్వాత తెలిసి షాకౌతాడు. రేపటి ఎపిసోడ్  కావ్య, వాళ్ల బావ భాస్కర్ తో పాటు.. రాజ్ కూడా అత్తారింటికి పరుగులు తీయడం విశేషం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image2
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Recommended image3
Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved