MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • TV
  • BrahmaMudi 12th March Episode:కళ్యాణ్ చేతిలో చెయ్యేసిన అప్పూ... చూసేసిన అనామిక, రాజ్ దెబ్బకు కావ్య విలవిల..!

BrahmaMudi 12th March Episode:కళ్యాణ్ చేతిలో చెయ్యేసిన అప్పూ... చూసేసిన అనామిక, రాజ్ దెబ్బకు కావ్య విలవిల..!

ఇంట్లోనే నాటకం రక్తి కట్టిస్తానుని.. వాళ్లను ఇంటికి రమ్మని చెబుతుంది. తర్వాత రాజ్ కి ఫోన్ చేసి.. తాతయ్య  ట్యాబ్లెట్స్ అయిపోయాయని.. తీసుకురమ్మని చెబుతుంది. రాజ్ సరే అంటాడు.

3 Min read
Author : ramya Sridhar
Published : Mar 12 2024, 10:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Brahmamudi

Brahmamudi

BrahmaMudi 12th March Episode:రాజ్ ని ఏడిపించి ఎలాగైనా అతని మనసులో ప్రేమను బయటకు తీయాలని  కావ్య, ఇందిరాదేవి ప్లాన్ వేస్తారు. అయితే.. చాలా రోజుల వరకు వీళ్ల ప్లాన్ బాగా వర్కౌట్ అయ్యింది. కానీ... రాజ్ అంతరాత్మ బయటకు వచ్చి...  ప్రేమను బయటపెట్టకపోతే.. వాళ్ల బావ ఎగరేసుకుపోతాడు అని చెప్పడంతో రాజ్ ఇగో దెబ్బతింటుంది. తనకు ఎలాంటి జెలసీ లేదని నిరూపించడానికి రివర్స్ డ్రామా ప్లే చేస్తాడు. స్వయంగా వాళ్లకు కారు ఇచ్చిమరీ బయటకు వెళ్లమని చెప్తాడు. వాళ్లతోపాటు.. తాను కూడా కారులో వస్తాను అని చెబుతాడు. కావ్యను వాళ్ల బావ పక్కన కూర్చోమని చెబుతాడు.  అలా కూర్చున్న తర్వా తకూడా జెలసీ ఫీలవ్వకుండా.. పాటలు పెట్టి.. హడావిడి చేస్తాడు. ఓ పక్కన కారు ఆపమని.. తాను దిగి... వాళ్లిద్దరిని మాత్రం..సినిమాకీ, రెస్టారెంట్ కి వెళ్లమని, కళావతికి నచ్చినవి కొనిపెట్టమని మరీ మరీ చెబుతాడు. రాజ్ రివర్స్ ప్లాన్ కి కావ్యకు దిమ్మ తిరిగిపోతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Brahmamudi

Brahmamudi

రాజ్ కారు దిగివెళ్లిపోయిన తర్వాత.. కావ్య ఇందిరాదేవికి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెబుతుంది. అయితే.. రాజ్ .. కావాలనే అలా చేస్తున్నాడని.. ఇంట్లోనే నాటకం రక్తి కట్టిస్తానుని.. వాళ్లను ఇంటికి రమ్మని చెబుతుంది. తర్వాత రాజ్ కి ఫోన్ చేసి.. తాతయ్య  ట్యాబ్లెట్స్ అయిపోయాయని.. తీసుకురమ్మని చెబుతుంది. రాజ్ సరే అంటాడు.

37
Brahmamudi

Brahmamudi

ఇక కళ్యాణ్.. బయట అప్పూని కలుస్తాడు. తనకు ఇంటికి వెళ్లాలి అనిపించడం లేదని, ఇంట్లో ఎవరూ తనను అర్థం చేసుకోవడం లేదని బాధపడతాడు. అనామిక .. తన కవితలు చూసి ఇష్టపడింది కాబట్టి.. తనను బాగా చూసుకుంటుందని అనుకున్నాను అని కానీ.. కనీసం అర్థం చేసుకోవడం లేదని ఫీలౌతాడు. అప్పుడు అప్పూ.. కళ్యాణ్ కి సీరియస్ గా క్లాస్ పీకుతుంది.  అనామికను ఇలా తక్కువ చేసి మాట్లాడొద్దని.. మీ ఇద్దరి విషయాలు ఇలా బయటపెట్టకూడదని కళ్యాణ్ కి అర్థమయ్యేలా చెబుతుంది. అనామికను బ్లేమ్ చేయడం మానేసి... ఫ్యూచర్ కోసం నువ్వు ఏం చేయాలి అనేదాని గురించి ఆలోచించమని సలహా ఇస్తుంది.

47
Brahmamudi

Brahmamudi

సీన్ కట్ చేస్తే.. రాజ్ ట్యాబ్లెట్స్ తో ఇంటికి వచ్చేస్తాడు. రాజ్ రాగానే... కావ్య ఏది అని ఇందిరాదేవి అడుగుతుంది. బయటకు వెళ్లింది అని చెబతాడు. మరి వాళ్ల బావ అంటే... వాళ్ల బావతో కలిసే వెళ్లిందని చెబుతాడు. ఎప్పుడు వస్తారు అంటే... ఇప్పట్లో రారు అని చెబుతాడు. అప్పుడే కావ్య, భాస్కర్ వస్తారు. ఇదిగో వచ్చేశారు అని ఆమె చెబుతుంది. అప్పుడే ఎందుకు వచ్చారు అని రాజ్ అడిగితే ట్రాఫిక్ ఎక్కువగా ఉందని వచ్చేశాం అని చెబుతుంది. అయితే.. నీ భార్యను నువ్వు తీసుకువెళ్లాలి కానీ.. వాళ్ల బావతో ఎందుకు పంపావ్ అని ఇందిరాదేవి అడిగితే.. నేను మధ్యలో వచ్చాను నానమ్మ.. వాళ్లు.. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. సాయంత్రం మళ్లీ వెళ్లండి. నేనేం అనుకోను.. నాది అసలే బ్రాడ్ మైండ్ అని చెప్పి వెళ్లిపోతాడు. ఇలా అయితే.. రాజ్ దారిలోకి రాడు అని.. మంచి ప్లాన్ ఆలోచించాలి అని ఇందిరాదేవి అంటుంది.

57
Brahmamudi

Brahmamudi

ఇక, కళ్యాణ్.. అప్పూ రోడ్డుమీద నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అప్పూతో మాట్లాడిన తర్వాత తనకు చాలా ఎనర్జీ వచ్చిందని  కళ్యాణ్ అంటాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు ఎప్పుడూ తోడుగా ఉంటావా..? ఏ కష్టం వచ్చినా నాకు తోడు ఉంటావా అని అడుగుతాడు. సరే అని అప్పూ చెబుతుంది. చెప్పడం కాదు ప్రామిస్ చేయమని అడుగుతాడు. దీంతో.. చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ వేస్తుంది. సరిగ్గా ఆ సీన్ ని అనామిక, ధాన్యలక్ష్మి చూస్తారు. ఇక అంతే.. కళ్యాణ్ మళ్లీ అప్పూ మాయలో పడిపోతున్నాడని.. ధాన్యలక్ష్మి కి ఎక్కిస్తుంది.  ఇద్దరూ చేతిలో చెయ్యి వేసి.. ప్రమాణాలు చేసుకుంటున్నారు అని నూరిపోస్తుంది.

67
Brahmamudi

Brahmamudi

మా పెళ్లి పెటాకులు చేసి, మళ్లీ ఆ ఇంటి కోడలు అవ్వాలని ఆశపడుతోందని అప్పూపై నిందలు వేస్తుంది. ఈ తప్పు మీ అబ్బాయిది మాత్రమే కాదని.. ఆ అప్పూది కూడా అని.. ఇంకోసారి కళ్యాణ్ తో తిరగకుండా చేయాలి అని అత్తతో చెబుతుంది. రోడ్డు మీదే గొడవపడాలని చూస్తుంది. కానీ ధాన్యలక్ష్మి ఆపేస్తుంది. నువ్వు ఇప్పుడు ఇక్కడ గొడవ చేస్తే... వాళ్లు మన ముందే కలిసి తిరగడం మొదలుపెడతారని.... ఈ విషయాన్ని ఎక్కడ మొదలుపెట్టాలో... ఎక్కడ  పెడితే.. ఇంకోసారి కళ్యాణ్ వెంట తిరగకుండా ఉంటుందో నాకు తెలుసు.. అక్కడికే పోదాం అని అంటుంది. ఒకవేళ కనకం ఇంటికి వెళ్లి రచ్చ చేసే అవకాశం ఉంది.

77
Brahmamudi

Brahmamudi


ఇక.. రాజ్ కావ్య కోసం పాస్ పోర్ట్ తీసుకువస్తాడు.  గుడ్ న్యూస్ అని చెప్పి.. పాస్ పోర్టు ఇస్తాడు. మనం విడిపోయిన తర్వాత...  నువ్వు మీ బావతో కలిసి అమెరికా వెళ్లడానికి, అక్కడ కొత్త లైఫ్ లీడ్ చేయడానికి నీకు లైన్ క్లియర్ అయిపోయిందని చెబుతాడు. మనం విడిపోయాక... అక్కడ సెటిల్ అవ్వమని చెబుతాడు. ఆ మాటలు  ఇందిరాదేవి కూడా వింటుంది. కావ్య ముఖం మాడిపోతుంది. రాజ్ ఇచ్చిన ట్విస్ట్ కి కావ్యకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. రాజ్ తనను  భార్యగా అంగీకరించడని ఫీలౌతుంది. అయితే... చివరి అస్త్రం అప్లై చేయాలని... విడాకులు అస్త్రం అని ఇందిరాదేవి చెబుతుంది. కమింగప్ లో.. కావ్యకు ఇందిరాదేవి విడాకుల పేపర్లు ఇస్తుంది.. ఇదే మిమ్మల్ని కలుపుతుందని చెబుతుంది. ఇదే మన ఆఖరి అస్త్రం అని చెబుతుంది. మరి ఈ ప్లాన్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved