- Home
- Entertainment
- TV
- Biggboss 9 Telugu Promo: దివ్వెల మాధురి మొదలు పెట్టేసింది, మొదటి రోజే పాత కంటెస్టెంట్లతో గొడవ, చివరికి ఏడుపు
Biggboss 9 Telugu Promo: దివ్వెల మాధురి మొదలు పెట్టేసింది, మొదటి రోజే పాత కంటెస్టెంట్లతో గొడవ, చివరికి ఏడుపు
దివ్వెల మాధురి సోషల్ మీడియాలోనే కాదు బిగ్ బాస్ హౌస్ లో (Biggboss 9 Telugu Promo) కూడా వివాదాస్పదమైన వ్యక్తే. ఈ రోజు ప్రోమో చూస్తే ఇంట్లో కూడా వివాదం మొదలుపెట్టేసింది. మొదటి రోజే పాత కంటెస్టెంట్లతో గొడవకు దిగింది. ఏడుపు మొదలు పెట్టింది.

దివ్వెల మాధురి మొదలుపెట్టేసింది
దివ్వెల మాదిరి బిగ్ బాస్ హౌస్ లో ఉంటే వివాదాస్పద కంటెంట్ రాకుండా ఎలా ఉంటుంది? తను మాట్లాడే తీరుతోనే పాత కంటెస్టెంట్లతో గొడవలకు పునాది వేసింది. పాత కంటెస్టెంట్లు కూడా ఏ మాత్రం తగ్గకుండా దివ్వెల మాధురికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. దాంతో ఏడుపు మొదలు పెట్టింది. మొదటి రోజే మాధురి డ్రామాకు తెర తీసింది అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు.
అసలు ఏం జరిగిందంటే
అసలు ఏమైందంటే దివ్వెల మాధురిని వంట పనిని చెప్పారు. కెప్టెన్ కళ్యాణ్ ఆమెను పిలిచి మీతో మాట్లాడాలని, కూర్చోమని అడిగాడు. దానికి మాధురి ‘కూర్చోపోతే.. చెప్పరా.. ఏంటో చెప్పండి’ అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడింది. కళ్యాణ్ మాట్లాడుతూ ‘ఈరోజు అంటే ఇలా ఉంది.. రేపటి నుంచి షెడ్యూల్ ఇలా ఉండదు’ అని అన్నాడు. దానికి మాధురి ‘నేను అరగంట సేపు అక్కడ కూర్చున్నప్పుడు ఏం చేశారు లేటవుతుంది అని మీకు తెలియదా’ అంటూ అంతే పొగరుగా సమాధానం చెప్పింది. దానికి కళ్యాణ్ *మీరు ఇలా మాట్లాడితే మేము వేరేగా మాట్లాడాల్సి వస్తుంది’ అన్నాడు. దానికి మాధురి మాట్లాడండి అంటూ సమాధానం ఇచ్చింది. ఎదుటివారి చెప్పేది అర్థం చేసుకోకుండా గొడవపడే తీరులోనే మాట్లాడింది. దీంతో దివ్య కూడా కల్పించుకోవాల్సి వచ్చింది.
దివ్యతో మాటల యుద్ధం
దివ్వెల మాధురికి దివ్య వివరించే ప్రయత్నం చేసింది. దివ్య మాట్లాడుతూ ‘ఉదయం లేవగానే ఏం వండాలో చెబితే కుకింగ్ టీమ్ వండేస్తారని చెప్పింది. దానికి మాధురి ‘మీరు ఏ వస్తువులు వంటకు అవసరమో.. అవన్నీ అక్కడ పెట్టేయండి’ అని అంది. ఆ తర్వాత దివ్య, మాధురి మధ్య మాటలు యుద్ధం మొదలైంది. కళ్యాణ్ కూడా చాలా గట్టిగా సమాధానం ఇచ్చాడు. మొదటిసారి కళ్యాణ్ ఇంట్లో అరిచాడు. ‘కూర్చోండి మేడం అని రెస్పెక్ట్ ఇచ్చినా ఆమె కూర్చోపోతే చెప్పవా అని అనడం వెటకారం’ అని కళ్యాణ్ అన్నాడు. కళ్యాణ్ గట్టిగా మాట్లాడటంతో ఎందుకు అరుస్తున్నావు అంటూ మాధురి అడిగింది.
మాధురి ఏడుపు
వాయిస్ ఏంటి రైజ్ అవుతోంది అంటూ కళ్యాణ్ మీద అరిచింది మాధురి. దివ్య మాత్రం వెనక్కి తగ్గలేదు. సరిగ్గా మాట్లాడమని హెచ్చరించింది. మామూలుగా మాట్లాడడం నేర్చుకోమని చెప్పింది. ఇద్దరూ కూర కోసం కాసేపు గొడవపడ్డారు. ఆ తర్వాత మాధురి ఏడుపు అందుకుంది. ఆమెను ఓదార్చే పని తనూజ తీసుకుంది.
నామినేషన్లు ఈరోజే
మధ్యలో భరణి... కళ్యాణ్, దివ్యలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఆమెకు టైం ఇస్తే సర్దుకుంటుందని కాసేపు ఆ విషయాన్ని వదిలేయండి అని అన్నాడు. దివ్య, కళ్యాణ్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అలా ఎలా మాట్లాడుతుందని ప్రశ్నించారు. ఇక ఈరోజే నామినేషన్ల రోజు కూడా కాబట్టి.. ఈ పాయింట్ పై ఎంతమంది నామినేషన్ లో పడతారో చూడాలి.