MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Ashwini Sri: బోర్ కొడితే పవన్ కళ్యాణ్ కారవాన్ లోకి పిలిచేవారు... ఇంటికి వెళ్ళాక కూడా కల్లోకి వచ్చేవారు!

Ashwini Sri: బోర్ కొడితే పవన్ కళ్యాణ్ కారవాన్ లోకి పిలిచేవారు... ఇంటికి వెళ్ళాక కూడా కల్లోకి వచ్చేవారు!

బిగ్ బాస్ ఫేమ్ అశ్విని శ్రీ ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ తో తనకున్న అనుబంధం గుర్తు చేసుకుంది. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ సెట్స్ లో జరిగిన కొన్ని కీలక విషయాలు ఆమె బయట పెట్టింది. 
 

Sambi Reddy | Updated : Nov 25 2023, 03:53 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్న అశ్విని శ్రీ పలు చిత్రాల్లో నటించింది. అయితే ఆమెకు ఫేమ్ రాలేదు. అశ్వినిశ్రీ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ చిత్రాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు చేసింది. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో హీరోయిన్ రష్మిక మందాన అక్క పాత్రలో కనిపించింది. 
 

27
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

అశ్విని 2016లో విడుదలైన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో చిన్న పాత్ర చేసింది. ఆ చిత్ర షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ తో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంది. అశ్విని శ్రీ మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ కి బోర్ కొడితే నన్ను కారవాన్ లోకి పిలిచేవారు. ఒక పాట పాడమ్మా అనే వారు. పవన్ కళ్యాణ్ చాలా సరదాగా ఉంటారు. ప్రతి రోజు ఏదో ఒక సమయంలో నన్ను ఆయన కారవాన్ లోకి పిలిచేవారు. 
 

37
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

ఆయన తినే డ్రై ఫ్రూట్స్ నాకు పెట్టేవారు. మేము ఎక్కువ సమయం ఆయనతో కారవాన్ తో గడిపేదాన్ని. ఒక రోజు నేను కారులో ఉండిపోయాను. 800 మందితో 'ఆడెవడన్న ఈడెవడన్నా' సాంగ్ షూటింగ్ జరుగుతుంది. అందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ నన్ను తిడతారని భయపడ్డాను. కో డైరెక్టర్ అప్పటికే అరిచాడు. 
 

47
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7


పవన్ కళ్యాణ్ మాత్రం ఏమీ అనలేదు. ముందు నువ్వు చిల్ అవ్వు అన్నారు. అప్పుడే ఆయన మీద మరింత రెస్పెక్ట్ పెరిగింది. అందుకే ఆయన్ని అందరూ దేవుడు అంటారు. పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన ఇష్టం పెరిగింది. షూటింగ్ జరిగే రోజుల్లో డ్రీమ్ వచ్చేవి. ఆయనతో ఎక్కడికో వెళ్లినట్లు కలలు కనేదాన్ని. ఇంటికి వెళ్ళాక కూడా కల్లోకి వచ్చేవారు. 
 

57
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7


ఆయన నన్ను మరచిపోయి ఉండవచ్చు. నేను ఆయనతో గడిపిన క్షణాలు ఎన్నటికీ మర్చిపోను. పవన్ కళ్యాణ్ గారికి ఆడవాళ్లు అంటే చాలా గౌరవం. సెట్స్ లో అందరికీ తాను తినే ఫుడ్ పెట్టేలా చూసేవాడు. అందరూ కడుపునిండా తినాలి అనేవారు. కారవాన్ లో కాకుండా బయట గుడిసెలో కూలర్ పెట్టుకుని పడుకునేవారు. పవన్ కళ్యాణ్ చాలా మంచి వారు అని ఆమె చెప్పుకొచ్చారు. 
 

67
Asianet Image

అశ్విని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 2016లో దర్శకుడు బాబీ సర్దార్ గబ్బర్ సింగ్ తెరకెక్కించారు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. కాజల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు కథను పవన్ కళ్యాణ్ అందించారు. 

 

77
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

ఇక బిగ్ బాస్ షోతో అశ్వినికి కొంత ఫేమ్ రాబట్టింది. అశ్విని అనే నటి ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె నటించిన చిత్రాలు, పాత్రలు వైరల్ అవుతున్నాయి. హౌస్ నుండి బయటకు వచ్చాక అశ్వినికి మరిన్ని ఆఫర్స్ దక్కే అవకాశం కలదు. కాగా ఈ వారం ఆమె ఎలిమినేట్ కానుందని అంటున్నారు. 

 

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ హౌస్ లోకి బర్రెలక్క, క్రేజీ న్యూస్ లో నిజమెంత..?

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
పవన్ కళ్యాణ్
 
Recommended Stories
Top Stories