- Home
- Entertainment
- TV
- బిగ్ బాస్ హౌస్ లో రౌడీల్లా కొట్టుకున్న కంటెస్టెంట్స్.. మండిపడుతున్న ఆడియన్స్, ట్విస్ట్ ఏంటంటే?
బిగ్ బాస్ హౌస్ లో రౌడీల్లా కొట్టుకున్న కంటెస్టెంట్స్.. మండిపడుతున్న ఆడియన్స్, ట్విస్ట్ ఏంటంటే?
బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ వల్ల ఆడియన్స కు ఎంటర్టైన్మెంట్ అందాలి, లేదా మంచి మెసేజ్ అయినా ఉండాలి.. కానీ ఈమధ్య బిగ్ బాస్ లో వైలెన్స్ ఎక్కువైపోయింది. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో వీధి రౌడీల్లా కొట్టుకున్నారు కంటెస్టెంట్స్.

అదుపు తప్పుతున్న బిగ్ బాస్
అసలు బిగ్ బాస్ కాన్సెప్ట్ మనది కాదు.. హాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకున్నది.. పోనీ అది బాలీవుడ్ కే పరిమితం అయ్యిందా అంటే... అదీ లేదు సౌత్ భాషల్లో మరింతగా ఫేమస్ అయ్యింది. సరే బిగ్ బాస్ వల్ల కాస్త ఏదైనా నేర్చుకునే విధంగా ఉంటుందా అంటే.. ప్రీతీ సిజన్ కు అప్ డేట్ అవుతూ.. వైలెన్స్ ను , రొమాన్స్ ను పెంచుకుంటూ వెళ్తున్నారు. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ పేరుతో రౌడీల్లా కొట్టుకున్నారు కంటెస్టెంట్స్. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిదంటే?
తమిళ బిగ్ బాస్ లో గొడవ
తెలుగులో మాదిరిగానే ప్రస్తుతం తమిళనాడులో బిగ్ బాస్ సీజన్ 9 నడుస్తోంది. మనకి వారికి కొన్నిరోజులు గ్యాప్ అంతే. బిగ్ బాస్ వల్ల జనాలకు మంచి ఎంటర్టైన్మెంట్ అందుతోంది. ఈ షో మైండ్ గేమ్ కు సంబంధించింది. ఒక మనిషి ఎటువంటి సంబంధం లేని వ్యక్తుల మధ్య, ఎలా ఉంటాడు, తన ఫ్యామిలీని వదిలి ఓ సెలబ్రిటీ వీరితో ఉంటాడా.. వారి వ్యక్తిత్తం ఏలా ఉంటుంది అని చూపెట్టే షో. అయితే వీరిని టాస్క్ ల పేరుతో రెచ్చ కొట్టి రచ్చ చేస్తున్నారు. ఒక్కోసారి కంటెస్టెంట్స్ చేసే టాస్క్ ల వల్ల అదుపుతప్పుతుంటారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటారు. ఇటువంటి సంఘటనే తమిళ బిగ్ బాస్ లో చోటుచేసుకుంది.
రౌడీల్లా కొట్టుకున్ని కంటెస్టెంట్స్
బిగ్ బాస్ షోను ఆసక్తికరంగా మార్చేందుకు, నలుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను లోపలికి పంపారు. ఈరోజు నుంచి హోటల్ టాస్క్‌లో పాల్గొనడానికి, ఇంతకుముందు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కొందరు కంటెస్టెంట్లను మళ్లీ తీసుకురాబోతున్నారు.ఇవన్నీ ఒకవైపు ఉంటే.. తాజాగా తమిళ బిగ్ బాస్ హౌస్‌లో ఒక గొడవ జరిగింది. కంటెస్టెంట్స్ ప్రవీణ్, కమ్రుద్దీన్ మధ్యే పెద్ద యుద్దమే జరిగింది. ప్రవీణ్, కమ్రుద్దీన్‌ను చూసి మర్యాదగా మాట్లాడమని చెప్పగా... కమ్రుద్దీన్ కోపంగా ప్రవీణ్ మీదకు దూసుకొచ్చాడు.
విజయ్ వార్నింగ్ ను పట్టించుకోని కంటెస్టెంట్స్
ఇది చూసిన ఇతర కంటెస్టెంట్లు కమ్రుద్దీన్, ప్రవీణ్‌ను ఆపడానికి ప్రయత్నించారు. అయినా, కమ్రుద్దీన్ దూసుకెళ్లి ప్రవీణ్ ముఖంపై కొట్టడంతో అందరూ షాక్ అయ్యారు. గత వారం FJ వాటర్ మిలన్ స్టార్‌తో గొడవపడినందుకు, ఇకపై అలా ప్రవర్తిస్తే బయటకు పంపిస్తానని విజయ్, బిగ్ బాస్ కూడా హెచ్చరించారు. కానీ విజయ్ సేతుపతి మాట కూడా వినకుండా కమ్రుద్దీన్ ఇలా ప్రవర్తించడంతో, అతనికి రెడ్ కార్డ్ ఖాయమని ఫ్యాన్స్ అనుకున్నారు. అలాగే కమ్రుద్దీన్‌తో ప్రజన్ గొడవపడటంతో, సాండ్రా ఏడవడం మొదలుపెట్టింది. తర్వాత హౌస్‌మేట్స్ ఆమెను ఓదార్చారు, ప్రజన్ కూడా ఇకపై అలా ప్రవర్తించనని చెప్పాడు.
టాస్క్ లో భాగంగా చేశారా?
ఆ తర్వాత ముగ్గురూ ఒకరి తర్వాత ఒకరు కన్ఫెషన్ రూమ్‌కి వెళ్లారు. అప్పుడు ఇది షోను ఆసక్తికరంగా మార్చడానికి ముగ్గురూ ఆడిన ఫేక్ గొడవ అని తెలిసింది. ఇది బిగ్ బాస్ చెప్పి చేయించారా? లేక వాళ్లే చేశారా? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా, ఇందులో ప్రవీణ్‌కే కొంచెం దెబ్బలు తగిలాయి. ఇదే ఛాన్స్ అని కమ్రుద్దీన్ అతన్ని కొట్టేశాడు. ఇది టాస్కే కావచ్చు.. కానీ ఆడియన్స్ లోకి ఇది రాంగ్ గా వెళ్తుంది. ఈ గొడవ చూసి.. చాలామంది ఆడియన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి చేయడం వల్లే.. బిగ్ బాస్ ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా కానీ.. దాన్ని బ్యాన్ చేయాలంటూ బయట గొడవలు చేస్తున్నారు.