Bigg Boss Agnipariksha: కామనర్స్ సెలక్షన్ వీరి చేతిల్లోనే.. ఈ ముగ్గురే ఎందుకు..?
కామనర్స్ సెలక్షన్ కోసం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ముందుగా ఆసక్తి ఉన్నవారిని అప్లై చేసుకోమని ఓ ప్రకటన ఇచ్చారు. దానిని చూసి చాలా మంది కామనర్స్ వందల్లో అప్లై చేసుకున్నారు.

Bigg Boss Season9
బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న టీవీ రియాల్టీ షో ఏది అంటే.. వెంటనే అందరికీ బిగ్ బాస్ గుర్తుకు వస్తుంది. ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలోనే సీజన్9 కూడా రాబోతోంది. ఇప్పటి వరకు ఈ బిగ్ బాస్ లో సెలబ్రెటీలను మాత్రమే తీసుకువస్తూ ఉంటారు. ఎప్పుడో సీజన్ లో 2లో ముగ్గురు కామనర్స్ ని తీసుకువచ్చారు.. ఆ తర్వాత సీజన్ 7 లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కామనర్ గా అడుగుపెట్టాడు. అయితే..ఈ సీజన్ లో మాత్రం ఏకంగా 5 నుంచి 10 మంది వరకు కామనర్స్ అడుగుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
యాంకర్ గా శ్రీముఖి..
అయితే.. కామనర్స్ సెలక్షన్ కోసం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ముందుగా ఆసక్తి ఉన్నవారిని అప్లై చేసుకోమని ఓ ప్రకటన ఇచ్చారు. దానిని చూసి చాలా మంది కామనర్స్ వందల్లో అప్లై చేసుకున్నారు. వారిలో 15 మందిని సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ 15 మంది లో ఎవరు ఆ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడతారు అనేది తెలుసుకునేందుకు ఈ అగ్ని పరీక్ష ప్రోగ్రామ్ పెట్టారు.
మళ్లీ బుల్లితెరపైకి అభిజిత్..
ఈ అగ్ని పరీక్ష లో మెంబర్స్ ని సెలక్ట్ చేయడానికి ముగ్గురు జడ్జిలను పెట్టారు. హోస్టింగ్ బాధ్యతలు శ్రీముఖి తీసుకోగా.. జడ్జిలుగా నవదీప్, అభిజిత్, బిందు మాధవి రావడం విశేషం. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమోలో అభిజిత్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. బిగ్ బాస్ 4 గెలిచిన తర్వాత.. పెద్దగా అందుబాటులో లేని అభిజిత్ ఇప్పుడు రావడం ఆయన ఫ్యాన్స్ కి మంచి కిక్ ని ఇస్తోంది. ఈ ముగ్గురు జడ్జిలు.. ఒకప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్సే. మరి.. అలాంటప్పుడు ఈ ముగ్గురినే ఎందుకు ఎంచుకున్నారో ఇప్పుడు చూద్దాం...
ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్నా... సీజన్ 4 లో అభిజిత్ కి వచ్చిన క్రేజ్ మరెవరికీ రాలేదు. చాలా మంది విన్నర్స్ ఉన్నా.. అందరికీ బెస్ట్ విన్నర్ అంటే అభిజిత్ గుర్తుకు వస్తాడు. ఆయన మైండ్ గేమ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ క్రేజ్ తోనే అభిజిత్ ని బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది.
ఒకే ఒక్క అమ్మాయి విన్నర్..
ఇక.. 8 సీజన్లు, ఓటీటీ తో కలిపి కేవలం ఒక్క సీజన్ లోనే అమ్మాయి గెలిచింది. తనే బిందు మాధవి.. అందుకే ఆమెను తీసుకువచ్చారు. ఇక.. సీజన్ 1 లో నవదీప్ గెలవనప్పటికీ.. మొదటి సీజన్ హిట్ అవ్వడానికి నవదీప్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఫుల్ గా ఎంటర్ టైన్ చేశాడు. మళ్లీ అలాంటి పర్సన్ ఎవరూ రాలేదనే చెప్పాలి. ఇప్పుడు.. జడ్జిగా నవదీప్ ని తీసుకురావడం కూడా చాలా మందికి నచ్చుతోంది. మరి.. వీరి ముగ్గురు కలిసి.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేందుకు ఎంత మంది కామనర్స్ ని సెలక్ట్ చేస్తారు..? వారు ఎవరు అనే విషయం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఈ అగ్నిపరీక్ష ఆగస్టు 22 నుంచి టెలికాస్ట్ కానుంది. అయితే.. టీవీలో కాకుండా కేవలం హాట్ స్టార్ లో మాత్రమే రానుందని తెలుస్తోంది.