బాలకృష్ణపై షాకింగ్ ట్రోల్స్.. మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య `గుడ్ టచ్, బ్యాడ్ టచ్` వార్!
బాలకృష్ణ హీరోగా నటించిన `భగవంత్ కేసరి` చిత్రంలో చిన్న పిల్లలకు సంబంధించి `గుడ్ టచ్ బ్యాడ్ టచ్` గురించి చెప్పారు బాలయ్య. కానీ ఇప్పుడు అదే సోషల్ మీడియాలో ఆయనపై ట్రోల్స్ కి కారణమవుతుంది.
Bhagavanth Kesari
బాలయ్య నటించిన `భగవంత్ కేసరి` చిత్రాన్ని రెండు రోజుల క్రితం విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అనిల్ రావిపూడి రూపొందించిన ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటించగా, శ్రీలీల ఆయనకు కూతురు తరహా పాత్ర పోషించింది. ఈ చిత్రం రెండు రోజుల్లో యాభై కోట్లు చేసిందని టాక్. అయితే మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు సగం కలెక్షన్లు పడిపోవడం గమనార్హం.
Bhagavanth Kesari
ఇదిలా ఉంటే `భగవంత్ కేసరి` చిత్రంలో చిన్న పిలలకు సంబంధించిన గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌ల గురించి చెప్పారు. ఆల్ రెడీ జనాల్లో ఉన్నాదే, చాలా స్కూల్లో ఇది పిల్లలకు నేర్పిస్తూనే ఉన్నారు. ఈ చిత్రంలో సెకండాఫ్‌లో శ్రీలీలకి ఆర్మీ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు వచ్చేసీన్ ఇది. ఓ చిన్నారి పాపకి ఛాక్లెట్ కోనిస్తూ దుండగుడు రాంగ్ ప్లేస్‌లో టచ్ చేస్తున్నాడని ఆ పాప చెప్పింది. దీంతో స్కూల్‌లో బాలయ్య `గుడ్ టచ్, బ్యాడ్ టచ్` గురించి వివరించాడు. విషయం పరంగా మంచి సందేశమనే చెప్పాలి.
అయితే ఇదేం కొత్తది కాదు, కానీ కొంత మందికి తెలియదు. అ విషయంలో అభినందించాల్సిందే. కానీ ఆ సందేశం ఇవ్వడం కోసం సినిమా తీయలేదు, సినిమాలో భాగంగా ఆ పాయింగ్ ని చర్చించారు. దీనిపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. అయతే దీన్ని పట్టుకుని నందమూరి ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏంటో చూపిస్తున్నారు. బాలయ్య `భగవంత్ కేసరి` ఈవెంట్‌లో ఆయన శ్రీలీలని ఆశీర్వదించారు. అది గుడ్ టచ్ అంటూ, మెగాస్టార్ చిరంజీవిని ఇందులోకి లాగుతున్నారు. ఆయన గతంలో తన సినిమాల సమయంలో హీరోయిన్లని పట్టుకుని దిగిన ఫోటోలను ట్యాగ్ చేస్తూ బ్యాడ్ టచ్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
ఇది సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంది. దీనిపై మెగా అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. బాలయ్య కూడా హీరోయిన్లతో స్టేజ్‌లపై చేసిన చిలిపి పనులకు సంబంధించిన ఫోటోలు ట్యాగ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. చిరంజీవి చేసింది బ్యాడ్ టచ్ అయితే బాలయ్య చేసిందేంటి? అంటూ ప్రశ్నిస్తున్నారు. నానా రచ్చ చేస్తున్నారు. ఇందులో కొన్ని మరీ అభ్యంతరకరంగా ఉన్నాయి. బహిరంగంగా, పబ్లిక్ ఈవెంట్లలో హీరోయిన్లని గిల్లడం, ముద్దు పెట్టడం వంటి ఫోటోలను సేకరించి ట్రోల్ చేస్తుండటం గమనార్హం.
దీంతో ఇప్పుడు మెగా ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు ట్రోల్ చేసుకుంటున్నారు. తమ హీరోల పరువులు తీస్తూ సోషల్ మీడియా రచ్చ బండ పెడుతున్నారు. ఇటు చిరంజీవి, అటు బాలయ్య హీరోయిన్లతో క్లోజ్ ఉన్న ఫోటోలను వైరల్ చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ అభిమాన హీరోల పరువులను దగ్గరుండి మరీ తీసుకోవడం విచారకరం.
ఇటీవల బాలయ్య.. `భగవంత్ కేసరి` చిత్ర ఈవెంట్‌లోనే శ్రీలీలలో నెక్ట్స్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసి తన కొడుకు మోక్షజ్ఞ.. ఏంటి డాడీ గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అంటూ తిట్టాడని తెలిపారు బాలయ్య. తన మనసులో ఉన్న ఫీలింగ్‌ని మాత్రం పరోక్షంగా వెల్లడించారు. తనకు కూతురుగా చేసిన హీరోయిన్‌తో రొమాన్స్ చేయాలని ఉందనే ఫీలింగ్‌ని ఆయన బయటపెట్టారు.
`భోళా శంకర్` చిత్రంలో కీర్తిసురేష్.. చిరంజీవికి చెల్లిగా నటించింది. దీంతో ఆ సినిమా ఈవెంట్‌లోనూ కీర్తితో తాను కూడా రొమాన్స్ చేయాలని ఉందనే ఫీలింగ్‌ని బయటపెట్టాడు చిరు. స్టేజ్‌పై హంగామా చేశాడు చిరు. అప్పుడు కూడా చిరంజీవిని దారుణంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ చేసిన దానికి బాలయ్యని కూడా ఇరికించినట్టు అయ్యింది. ఆయన ఫోటోలు కూడా తీసి బజార్‌లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మొత్తం రచ్చ రచ్చ అవుతుంది.